Nidhan
విరాట్ కోహ్లీని ఇష్టపడే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. కింగ్ కోహ్లీ కూడా తనను అభిమానించే వారిని అంతే ప్రేమిస్తాడు. దీనికి ఇది మరో ఎగ్జాంపుల్ అని చెప్పాలి.
విరాట్ కోహ్లీని ఇష్టపడే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. కింగ్ కోహ్లీ కూడా తనను అభిమానించే వారిని అంతే ప్రేమిస్తాడు. దీనికి ఇది మరో ఎగ్జాంపుల్ అని చెప్పాలి.
Nidhan
విరాట్ కోహ్లీ.. క్రికెట్ గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరిది. ఈ ఆట గురించి తెలియని వారికి కూడా అతడు సుపరిచితుడే. జెంటిల్మన్ గేమ్ ద్వారా పాపులారిటీ సాధించిన ఈ టాప్ బ్యాటర్.. అదే ఆటకు తన బ్యాటింగ్‌తో ఎంతో వన్నె తెచ్చాడు. వరల్డ్ క్రికెట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. ఫుట్‌బాల్ స్టార్స్ తర్వాత స్పోర్ట్స్‌లో అత్యంత పాపులర్ ప్లేయర్‌గా పేరు సంపాదించాడు విరాట్. అతడి బ్యాటింగ్, అగ్రెషన్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ ఈ టీమిండియా స్టార్ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. అందులో వయసుతో సంబంధం లేకుండా యంగ్‌స్టర్స్‌తో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. కోహ్లీ కోసమే మ్యాచ్ చూసే లిటిల్ ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. అలాంటి ఓ చిన్నారి అభిమాని కోరికను తీర్చాడు విరాట్.
సఫారీ టూర్లో ఉన్న భారత క్రికెట్ జట్టు ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు ఆడేసింది. సౌతాఫ్రికాతో ఇప్పుడు టెస్ట్ సిరీస్ జరుగుతోంది. సెంచూరియన్ వేదికగా టీమిండియా, ప్రొటీస్ మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్ జరుగుతున్న టైమ్‌లో ఒక చిన్నారి అభిమాని కోహ్లీని ఆటోగ్రాఫ్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాడు. దీనికి ఎస్ చెప్పిన విరాట్.. తన చిన్నారి ఫ్యాన్‌కు ఆటోగ్రాఫ్ ఇవ్వడమే గాకుండా అతడితో కలసి ఫొటో కూడా దిగాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కోహ్లీని ఆటోగ్రాఫ్ అడిగిన ఆ బుడతడు సౌతాఫ్రికాకు చెందినవాడు. కానీ ఐపీఎల్లో పాపులర్ ఫ్రాంచైజీ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అంటే అతడికి చాలా ఇష్టం. అందుకే ఆర్సీబీ జెర్సీ మీదే అతడు విరాట్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు.
చిన్నారి అభిమాని కోరికను కోహ్లీ తీర్చడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ స్పందిస్తున్నారు. ఫ్యాన్స్‌ను విరాట్ ఇష్టపడతాడని.. అందుకే అతడంటే అందరికీ అంత అభిమానమని కామెంట్స్ చేస్తున్నారు. కింగ్ మరోమారు తమ మనసులు గెలుచుకున్నాడని పొగుడుతున్నారు. ఇక, వరల్డ్ కప్-2023 తర్వాత మళ్లీ గ్రౌండ్లోకి దిగాడు కోహ్లీ. రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రొటీస్‌తో జరిగిన వైట్‌బాల్ సిరీస్‌కు దూరంగా ఉన్న ఈ స్టార్ బ్యాటర్.. సెంచూరియన్ టెస్ట్‌తో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు విరాట్. తొలి టెస్టులో ఆతిథ్య జట్టు డామినేషన్ నడుస్తోంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 245 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం సౌతాఫ్రికా 78.3 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 295 పరుగులతో ఉంది. ఆ టీమ్ 51 రన్స్ లీడ్‌తో ఉంది. మిగిలిన ఐదుగురు బ్యాటర్లను భారత్ త్వరగా పెవిలియన్‌కు పంపాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు. మరి.. చిన్నారి అభిమాని కోరికను కోహ్లీ తీర్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs SA: వీడియో: రివ్యూలో ధోనిని మరిపించిన కోహ్లీ.. దెబ్బకు రోహిత్ షాక్!
ಕಣ ಕಣದಲ್ಲೂ ಕೆಂಪು 😍@imVkohli #SAvIND #Bangalore #KingKohli pic.twitter.com/oSMbjvGr6E
— Star Sports Kannada (@StarSportsKan) December 27, 2023