iDreamPost

IND vs SA: వీడియో: రివ్యూలో ధోనిని మరిపించిన కోహ్లీ.. దెబ్బకు రోహిత్ షాక్!

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ధోనిని మరిపించేలా రివ్యూ తీసుకొమ్మని రోహిత్ కు సలహాఇచ్చాడు విరాట్ కోహ్లీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ధోనిని మరిపించేలా రివ్యూ తీసుకొమ్మని రోహిత్ కు సలహాఇచ్చాడు విరాట్ కోహ్లీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

IND vs SA: వీడియో: రివ్యూలో ధోనిని మరిపించిన కోహ్లీ.. దెబ్బకు రోహిత్ షాక్!

మహేంద్ర సింగ్ ధోని.. ఈపేరు వినగానే అందరి గుర్తుకు వచ్చేది మిస్టర్ కూల్ అని. తన కెప్టెన్సీతో, బ్యాటింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక రివ్యూల్లో ధోనిని కొట్టేవాడే లేడంటే అతిశయోక్తికాదు. ఇక DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్ అనేంతలా రివ్యూ సిస్టమ్ పై తన ముద్రవేశాడు. అయితే సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ధోనిని మరిపించేలా రివ్యూ తీసుకొమ్మని రోహిత్ కు సలహాఇచ్చాడు విరాట్ కోహ్లీ. దీంతో తనకు ఇష్టం లేకపోయినా కోహ్లీ చెప్పాడు అన్న ఒకే ఒక్క కారణంతో రోహిత్ రివ్యూ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్ట్ రెండో రోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన నమోదు అయ్యింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రెండో రోజు సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో క్రీజ్ లో డీన్ ఎల్గర్, కైల్ వెరెన్నే బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఎండ్ లో 62వ ఓవర్ వేయడానికి వచ్చాడు డెబ్యూ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ. ఈ ఓవర్ 5వ బంతిని కైల్ వెరెన్నే హాఫ్ సైడ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బాల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సరాసరి కీపర్ కేఎల్ రాహుల్ చేతిలో పడింది. దీంతో రాహుల్ ఔట్ అంటూ గట్టిగా అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు.

ఈ క్రమంలోనే వెంటనే విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకొమ్మని రోహిత్ కు సలహాఇచ్చాడు. ఈ విషయంలో రోహిత్ అయిష్టంగానే రివ్యూ తీసుకున్నాడు. రిప్లే చూడగా.. బాల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. రివ్యూ సక్సెస్ కావడంతో.. రోహిత్ షాక్ కు గురైయ్యాడు. దీంతో 4 పరుగులకే వెరెన్నే 5వ వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఇక ఈ వికెట్ తో తన టెస్ట్ కెరీర్ లో తొలి వికెట్ తీసుకున్నాడు ప్రసిద్ద్ కృష్ణ. రివ్యూ సిస్టమ్ లో అందరూ ధోనిని తోపు అంటారు. ఇక ఈ మ్యాచ్ లో ధోనిని మరపిస్తూ.. రివ్యూ తీసుకొమ్మని రోహిత్ కు సలహాఇచ్చి, అందరిని అవాక్కైయ్యేలా చేశాడు. దీంతో ఒక నాయకుడు ఎప్పటికీ నాయకుడిగానే ఉంటాడని, అందుకే విరాట్ కోహ్లీ టెస్టుల్లో బెస్ట్ కెప్టెన్ అంటూ కితాబిస్తున్నారు ఫ్యాన్స్. మరి ధోనిని మరపిస్తూ.. రివ్యూ తీసుకొమన్న విరాట్ కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి