Nidhan
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ మొదలవడానికి ముందు టీమిండియా భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీని నుంచి కోలుకొని టీమ్ గెలవాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ మొదలవడానికి ముందు టీమిండియా భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీని నుంచి కోలుకొని టీమ్ గెలవాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
Nidhan
వన్డే వరల్డ్ కప్-2023 తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ20ల సిరీస్‌ను 4-1 తేడాతో భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో ఓటమి బాధతో ఉన్న అభిమానులను వరుస విజయాలతో యంగ్ ఇండియా ఊరటను కలిగించింది. ఇదే జోరులో సఫారీ గడ్డ మీదకు అడుగుపెట్టిన టీమిండియా.. ఈ టూర్లోనూ డామినేషన్ కంటిన్యూ చేయాలని అనుకుంది. అయితే ఈ పర్యటనలో భాగంగా మొదట టీ20 సిరీస్ జరగాల్సి ఉంది. కానీ వర్షం వల్ల ఫస్ట్ టీ20 రద్దవడంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. రెండో మ్యాచ్‌కూ వరుణుడు అడ్డం తగలడంతో ఈ మ్యాచ్ కూడా జరగదని అంతా అనుకున్నారు. కానీ వాన నిలిచిపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్‌ను కంటిన్యూ చేశారు. అయితే టీమిండియా కంటే బాగా ఆడిన ప్రొటీస్ టీమ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సఫారీ టూర్‌ను విక్టరీతో స్టార్ట్ చేద్దామని అనుకుంటే ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ఓటమి తప్పలేదు. దీంతో ఎలాగైనా పుంజుకొని తర్వాతి టీ20లో గెలవాలని భారత జట్టు గట్టిగా కోరుకుంటోంది. సిరీస్‌లో ఇదే ఆఖరి మ్యాచ్ కాబట్టి విజయం సాధిస్తే 1-1తో డ్రా చేసుకోవచ్చు. ఓడిపోతే సిరీస్ సౌతాఫ్రికా సొంతం అవుతుంది. అందుకే పట్టుదలతో ఆడి నెగ్గాలని అనుకుంటోంది. కానీ టీమ్ కాంబినేషన్, ప్లేయర్ సెలక్షన్లో గందరగోళం ఇబ్బంది పెడుతున్నాయి. కంగారూలతో టీ20 సిరీస్‌లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ వంటి వారిని ఆడించకపోవడం మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసలు టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏంటో తెలియక ఫ్యాన్స్ కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇలాగే వ్యవహరిస్తే ఫ్యూచర్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. నిలకడగా రాణిస్తున్న వారికి మరిన్ని ఛాన్సులు ఇస్తూ ఎంకరేజ్ చేయాలని అంటున్నారు.
యంగ్‌స్టర్స్‌కు వరుస అవకాశాలు ఇస్తే టీమ్‌లో తమ ప్లేస్ పక్కా అనే ధీమా వారిలో ఏర్పడుతుందని.. దీని వల్ల ఫియర్లెస్ అప్రోచ్‌తో ఆడే ఛాన్స్ ఉంటుందని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్ తర్వాత ఆఖర్లో టెస్ట్ సిరీస్ ఆడనుంది భారత్. కానీ ఈ సిరీస్ మొదలవడానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయంతో బాధపడుతున్న స్టార్ పేసర్ మహ్మద్ షమి ఈ సిరీస్‌లో ఆడటం దాదాపుగా అసాధ్యం అని తెలుస్తోంది. దీనిపై స్వయంగా షమీనే రియాక్ట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికాకు వెళ్లేందుకు తాను రెడీగా ఉన్నానని చెబుతూనే ఈ వెటరన్ పేసర్ ట్విస్ట్ ఇచ్చాడని తెలిసింది. మోకాలి నొప్పి కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని.. కాస్త ఊరటగా అనిపించినా వెంటనే టీమ్‌తో కలుస్తానని అన్నాడని నేషనల్ మీడియాలో న్యూస్ వస్తోంది. ఒకవేళ ఇంజ్యురీ తగ్గకపోతే మాత్రం సఫారీ సిరీస్‌లో ఆడటం కష్టమేనని పరోక్షంగా వెల్లడించాడని సమాచారం. ఇప్పటికే చాలాసార్లు మెడికల్ టెస్టులు చేయించుకున్నానని.. ఇంకా పూర్తిగా కోలుకోలేదని అన్నాడట షమి. మరి.. టెస్ట్ సిరీస్‌లో ఆడే ఛాన్సులు తక్కువేనంటూ షమి చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rohit Sharma: మానిన గాయాన్ని మళ్లీ రేపుతున్నారు.. రోహిత్ శర్మను వదలని ఆసీస్!
Mohammed Shami’s participation in the South Africa Test Series is uncertain.
The right-arm pacer is grappling with an ankle injury and is unlikely to regain fitness for the red-ball series. pic.twitter.com/fE7ZqL8wVo
— CricTracker (@Cricketracker) December 14, 2023