Nidhan
టీమిండియాలో ఆ ప్లేయర్ అవసరం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అతడ్ని జట్టులో నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.
టీమిండియాలో ఆ ప్లేయర్ అవసరం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అతడ్ని జట్టులో నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Nidhan
క్రికెట్లో గెలుపోటములు సహజమే అయినా కొన్ని మ్యాచులు, టోర్నమెంట్స్‌లో వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కొన్నిసార్లు టీమ్స్ ఓడితే ప్రేక్షకులు, అభిమానులు అస్సలు ఊరుకోరు. బాగా ఆడినప్పుడు పొగిడిన వాళ్లే ఫెయిలైనప్పుడు విమర్శలు గుప్పిస్తారు. ఇప్పుడు టీమిండియా పరిస్థితి ఇలాగే ఉంది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రోహిత్ సేన.. సౌతాఫ్రికా టూర్‌ను బాగానే స్టార్ట్ చేసింది. టీ20 సిరీస్‌ను డ్రా చేసుకున్న భారత్.. వన్డే సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. దీంతో చాన్నాళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న టెస్ట్ సిరీస్‌నూ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 32 రన్స్ భారీ తేడాతో ఓడటాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. భారత జట్టు ఆటగాళ్లపై విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యంగా టీమ్‌లోని ఓ ఆల్‌రౌండర్‌ను టార్గెట్ చేసుకొని కామెంట్స్ చేస్తున్నారు. అతడే శార్దూల్ ఠాకూర్.
తొలి టెస్ట్‌లో ఫెయిలైన శార్దూల్ ఠాకూర్‌ను టీమ్‌లో నుంచి తీసేయాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఆ మ్యాచ్‌లో 19 ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలింగ్ ఆల్‌రౌండర్.. ఏకంగా 101 పరుగులు ఇచ్చుకున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ పెద్దగా రాణించలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో 33 బంతులు ఎదుర్కొని 24 రన్స్ చేశాడు. మంచి స్టార్ట్ దొరికినా దాన్ని భారీ స్కోరుగా మలచడంలో ఫెయిలయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనైతే 8 బంతుల్లో 2 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. శార్దూల్‌తో పాటు యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా భారీగా పరుగులు ఇవ్వడం, మహ్మద్ సిరాజ్ వికెట్లు తీసినా రన్స్‌ను కంట్రోల్ చేయలేకపోవడంతో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే అయిపోయాడు. అటు బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, ఇటు బౌలింగ్‌లో బుమ్రా ఒంటరి పోరాడటం చేశారు. అయినా టీమ్‌ను ఓటమి బారి నుంచి గట్టెక్కించలేకపోయారు.
ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్‌లోనూ శార్దూల్ ఠాకూర్ అంతగా ప్రభావం చూపలేదు. స్టార్టింగ్‌లో అతడ్ని ఒకట్రెండు మ్యాచుల్లో ఆడించారు. అయినా లాభం లేకపోవడంతో అతడి ప్లేస్‌లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీని తీసుకొచ్చారు. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఉపయోగించుకున్న షమి అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. మెగాటోర్నీలో 8 మ్యాచుల్లో 23 వికెట్లు తీసి బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. శార్దూల్ మాత్రం టీమ్ మేనేజ్మెంట్ వరుస ఛాన్సులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నా దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం లేదు. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లోనూ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో ఫెయిలయ్యాడు. దీంతో శార్దూల్‌ను టీమ్‌లో నుంచి తీసేసి.. అతడి స్థానంలో ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ లాంటి యంగ్‌స్టర్స్‌కు అవకాశం ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి.. శార్దూల్‌ను తీసేయాలనే వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs SA: గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు ఊహించని షాక్.. ఇక, భారత్‌కు పండగే!