iDreamPost

IND vs SA: గెలుపు జోష్​లో ఉన్న సౌతాఫ్రికాకు ఊహించని షాక్.. ఇక, భారత్​కు పండగే!

  • Published Dec 30, 2023 | 4:10 PMUpdated Dec 30, 2023 | 4:10 PM

టీమిండియాపై తొలి టెస్ట్​లో గ్రాండ్ విక్టరీ సాధించిన జోష్​లో ఉంది సౌతాఫ్రికా. అయితే చివరి మ్యాచ్​కు ముందు ఆతిథ్య జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

టీమిండియాపై తొలి టెస్ట్​లో గ్రాండ్ విక్టరీ సాధించిన జోష్​లో ఉంది సౌతాఫ్రికా. అయితే చివరి మ్యాచ్​కు ముందు ఆతిథ్య జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

  • Published Dec 30, 2023 | 4:10 PMUpdated Dec 30, 2023 | 4:10 PM
IND vs SA: గెలుపు జోష్​లో ఉన్న సౌతాఫ్రికాకు ఊహించని షాక్.. ఇక, భారత్​కు పండగే!

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమితో భారత జట్టు డీలాపడింది. ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో రోహిత్ సేన ఓడిపోవడం అభిమానుల్ని తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో అందరూ ఓటమికి కారణాలు వెతికే పనిలో పడ్డారు. టీమిండియా ఎందుకు ఓడిపోయింది? ఎవరి ఫెయిల్యూర్ జట్టును దెబ్బతీసింది? అనే ఆలోచనల్లో పడిపోయారు. బ్యాటర్ల వైఫల్యంతో పాటు బౌలర్లు రాణించకపోవడం వల్లే ఓడిపోయామని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. సమష్టిగా ఆడి నెగ్గాల్సిన చోట అన్ని విభాగాలూ విఫలమవ్వడం టీమ్​ను దారుణంగా దెబ్బతీసిందని కామెంట్స్ చేస్తున్నారు. రెండో టెస్ట్​లోనైనా ఈ నెగెటివ్స్​ను అధిగమించి భారత్ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఇక, మొదటి టెస్ట్​లో నెగ్గిన సౌతాఫ్రికా ఫుల్ జోష్​లో ఉంది. ఇలాంటి టైమ్​లో ఆ టీమ్​కు ఊహించని షాక్ తగిలింది. కీలకమైన ప్లేయర్ ప్రొటీస్​కు దూరమయ్యాడు.

సౌతాఫ్రికా స్టార్ పేసర్ గెరాల్డ్ కొయెట్జీ చివరి టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. కడుపు నొప్పి కారణంగా అతడు మ్యాచ్​కు దూరమయ్యాడు. అయితే ఈ ఫాస్ట్​ బౌలర్ టీమ్​కు దూరమైనా అతడి ప్లేస్​లో మరో సబ్​స్టిట్యూట్​ను ప్రొటీస్​ తీసుకోలేదు. ప్రస్తుత స్క్వాడ్​లో లుంగీ ఎంగిడి, వియాన్ ముల్డర్ రూపంలో ఇద్దరు పేసర్లు ఉండటంతో వారిలో ఒకర్ని కొయెట్జీ స్థానంలో భర్తీ చేయాలని చూస్తోంది. అలాగే ఫస్ట్ టెస్ట్ కోసం ఎంపిక చేసిన స్క్వాడ్​లో చోటు దక్కించుకోని కేశవ్ మహారాజ్​ను కూడా ఆడించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక, సౌతాఫ్రికాను వరుస గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇంజ్యురీ కారణంగా ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా టీమ్​కు దూరమయ్యాడు. భారత్​తో జరుగుతున్న టెస్ట్ సిరీస్​లో అతడు ఆడటం లేదు. ఇప్పుడు కొయెట్జీ కూడా దూరమవడం ఆ టీమ్​ను మెంటల్​గా దెబ్బతీస్తుంది.

కాగా, టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో గెరాల్డ్ కొయెట్జీ పెద్దగా వికెట్లు తీయలేదు. రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. అయితే తన వంతు పాత్ర పోషించాడు. పొడగరి అయిన కొయెట్జీకి సొంత పిచ్​ల మీద మంచి అవగాహన ఉంది. అందుకే పిచ్​ మీద ఉన్న బౌన్స్​ను ఉపయోగించుకుంటూ పేస్ డెలివరీస్​తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఇది మిగతా బౌలర్లకు పనికొచ్చింది. వాళ్లకు వికెట్లు పడ్డాయి. అలాంటి బౌలర్ సెకండ్ టెస్ట్​కు దూరమవడం సౌతాఫ్రికాకు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఇది భారత్​కు తప్పక కలిసొస్తుంది. ఇక, ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్​లో అద్భుతంగా రాణించిన కొయెట్జీ.. కేవలం 8 మ్యాచుల్లో 20 వికెట్లు పడగొట్టాడు. అందుకే ఈసారి ఐపీఎల్ మినీ ఆక్షన్​లో చాలా టీమ్స్ అతడిపై ఫోకస్ చేశాయి. అయితే ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కొయెట్జీని రూ.5 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రాతో కలసి ముంబై బౌలింగ్ అటాక్​ను నడిపించనున్నాడతను. మరి.. కొయెట్జీ రెండో టెస్ట్​కు దూరమవడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: కుర్రాళ్లకు ట్రైనింగ్‌ ఇవ్వనున్న రోహిత్‌ శర్మ! అకాడమీ ప్రారంభం.. ఎక్కడంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి