iDreamPost
android-app
ios-app

IND vs SA: బ్యాటర్లు కాదు ఈ ఫెయిల్యూర్​కు వాళ్లే కారణం.. అంతా తెలిసి కూడా..!

  • Published Jan 04, 2024 | 3:37 PM Updated Updated Jan 04, 2024 | 3:37 PM

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్​ ఫస్ట్ ఇన్నింగ్స్​లో భారత్ 153 రన్స్​కు కుప్పకూలింది. ఒక్క రన్​ కూడా చేయకుండానే ఆఖరి ఆరుగురు టీమిండియా బ్యాటర్లు ఔటయ్యారు. అయితే ఈ ఫెయిల్యూర్​కు బ్యాట్స్​మెన్​ కాదు.. వాళ్లే కారణం.

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్​ ఫస్ట్ ఇన్నింగ్స్​లో భారత్ 153 రన్స్​కు కుప్పకూలింది. ఒక్క రన్​ కూడా చేయకుండానే ఆఖరి ఆరుగురు టీమిండియా బ్యాటర్లు ఔటయ్యారు. అయితే ఈ ఫెయిల్యూర్​కు బ్యాట్స్​మెన్​ కాదు.. వాళ్లే కారణం.

  • Published Jan 04, 2024 | 3:37 PMUpdated Jan 04, 2024 | 3:37 PM
IND vs SA: బ్యాటర్లు కాదు ఈ ఫెయిల్యూర్​కు వాళ్లే కారణం.. అంతా తెలిసి కూడా..!

భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసకందాయంలో పడింది. పేస్, స్వింగ్​కు అనుకూలిస్తున్న కేప్​టౌన్ పిచ్ బౌలర్లకు స్వర్గధామంగా మారింది. ఈ మ్యాచ్​ మొదటి రోజు ఏకంగా 23 వికెట్లు పడ్డాయి. దీన్ని బట్టే పిచ్ బౌలింగ్​కు ఎలా సహకరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రొటీస్ మొదటి ఇన్నింగ్స్​లో కేవలం 55 రన్స్​కు కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి ప్రత్యర్థి వెన్ను వెరిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన రోహిత్ సేన 153 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 153/4తో స్ట్రాంగ్​గా కనిపించిన టీమిండియా.. అదే స్కోరుకు చివరి 6 వికెట్లను కోల్పోయింది. ఇంకో 40 నుంచి 50 పరుగులు చేస్తే సౌతాఫ్రికా మరింత ఒత్తిడిలో పడేది. కానీ లోయరార్డర్​లో ఒక్కరు కూడా సక్సెస్ అవ్వలేదు. అయితే దీనికి బ్యాటర్లను మాత్రమే బాధ్యులను చేయలేం. ఈ వైఫల్యానికి సెలక్టర్లే కారణమని చెప్పాలి.

టీమిండియా బ్యాటింగ్ ఫెయిల్యూర్​కు సెలక్టర్లతో పాటు టీమ్ మేనేజ్​మెంట్ రీజన్ అని చెప్పాలి. అజింక్యా రహానె, ఛటేశ్వర్ పుజారా లాంటి సీనియర్ క్రికెటర్లు అందుబాటులో ఉన్నా వాళ్లను ఈ సిరీస్​కు సెలక్ట్ చేయలేదు. వాళ్లిద్దరికీ మరికొన్నేళ్లు ఆడే సత్తా ఉంది. ఆ ఇద్దర్నీ కనీసం విదేశీ టూర్లలో ఆడించాలి. శుబ్​మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి యంగ్​స్టర్స్​ను స్వదేశీ పిచ్​ల మీద సక్సెస్ అయ్యాక మెళ్లిగా బ్యాకప్​గా రంగంలోకి దించాల్సింది. కానీ బౌన్స్, పేస్, స్వింగ్​కు అనుకూలించే ఇలాంటి పిచ్​ల మీద వెళ్లి ఆడమంటే ఎలా పెర్ఫార్మ్ చేయగలరు? ఫామ్​లో లేకపోయినా పుజారా, రహానె తమ అనుభవాన్ని రంగరించి వికెట్లు పడకుండా కాపాడేవారు. ఇన్నింగ్స్​ బిల్డ్ చేయడంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వారికి సాయం అందించేవారు. హఠాత్తుగా వారిని తీసేసి యంగ్​స్టర్స్​ను తీసుకొచ్చి కగిసో రబాడ, లుంగి ఎంగిడి, బర్గర్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కోమంటే పాజిబుల్ కాదు.

పుజారా, రహానేను కొనసాగిస్తూనే వారికి బ్యాకప్​గా గిల్, జైస్వాల్​ లాంటి వారిని తయారు చేసుకోవాల్సింది. తమ రోల్స్​కు న్యాయం చేయగలరనే నమ్మకం ఏర్పడ్డాక పుజారా, రహానేను తప్పిస్తే బాగుండేది. కానీ అన్నీ తెలిసి కూడా అనుభవం లేని వారిని తీసుకొచ్చి ఫారెన్ పిచ్​లపై ఆడించడం కరెక్ట్ కాదు. ఫెయిలైతే వాళ్ల కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుందని తెలిసినా, టీమ్​లోకి తీసుకోవడం అంటే చావోరేవో తేల్చుకోమని చెప్పడమే. దీంతో గిల్, జైస్వాల్ వరుసగా ఫెయిల్ అవుతున్నారు. మొదటి టెస్ట్​తో పాటు రెండో టెస్ట్​లోనూ జైస్వాల్ ఫెయిలయ్యాడు. సెకండ్ టెస్ట్​ ఫస్ట్ ఇన్నింగ్స్​లో గిల్​ ఫర్వాలేదనిపించాడు. అయితే మంచి స్టార్ట్ దొరికినా దాన్ని భారీ ఇన్నింగ్స్​గా మలచలేకపోయాడు. ఇది పూర్తిగా సెలక్టర్లు, టీమ్ మేనేజ్​మెంట్ ఫెయిల్యూరే. టీమ్ కాంబినేషన్​కు తగ్గట్లు ఎక్కడ ఆడుతున్నామనే దాన్ని బట్టి ప్లేయర్లను ఎంచుకోవాల్సింది. సీనియర్లు, జూనియర్ల కలయికతో కూర్పును సెట్ చేసుకోవాల్సింది. మరి.. భారత బ్యాటింగ్ కొలాప్స్​కు ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Kohli-Gill: వీడియో: సౌతాఫ్రికా బ్యాటర్ ఔట్.. చిన్నపిల్లల్లా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ, గిల్!