iDreamPost

Kohli-Gill: వీడియో: సౌతాఫ్రికా బ్యాటర్ ఔట్.. చిన్నపిల్లల్లా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ, గిల్!

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో తొలిరోజు ఆటలో కింగ్ విరాట్ కోహ్లీ యంగ్ బ్యాటర్ శుబ్ మన్ గిల్ ఇద్దరూ కలిసి గ్రౌండ్ లో చేసిన డ్యాన్స్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో తొలిరోజు ఆటలో కింగ్ విరాట్ కోహ్లీ యంగ్ బ్యాటర్ శుబ్ మన్ గిల్ ఇద్దరూ కలిసి గ్రౌండ్ లో చేసిన డ్యాన్స్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Kohli-Gill: వీడియో: సౌతాఫ్రికా బ్యాటర్ ఔట్.. చిన్నపిల్లల్లా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ, గిల్!

టీమిండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారుతోంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బౌలర్లు చెలరేగడంతో.. ఒకే రోజు 23 వికెట్లు నేలకూలాయి. సఫారీ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 55 రన్స్ కే ఆలౌట్ కాగా.. టీమిండియా కూడా అదే బాటలో నడిచి 153 పరుగులకే ప్రోటీస్ బౌలర్లకు దాసోహం అయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు భారత బౌలర్ ముకేశ్ కుమార్ భారీ షాకిచ్చాడు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి సౌతాఫ్రికా టీమ్ 3 వికెట్లు కోల్పోయి 62 రన్స్ చేసింది. అయితే తొలిరోజు ఆటలో కింగ్ విరాట్ కోహ్లీ యంగ్ బ్యాటర్ శుబ్ మన్ గిల్ ఇద్దరూ కలిసి గ్రౌండ్ లో చేసిన ఓ పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్ లో ఎలా దూకుడుగా ఉంటాడో, ఫీల్డింగ్ లో కూడా అంతే అగ్రెసివ్ గా ఉంటాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు కవ్విస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. తన బ్యాట్ తోనే వారికి సమాధానం ఇస్తాడు. అయితే ఫీల్డింగ్ చేసేటప్పుడు మాత్రం కొన్ని కొన్ని సందర్భాల్లో తనలో ఉన్న హాస్యనటుడిని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. గ్రౌండ్ లో తన చిత్ర విచిత్రమైన చేష్టలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో విరాట్ ఎప్పుడూ ముందుంటాడు. ఇక సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో సఫారీ టీమ్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగగా.. విరాట్ కోహ్లీ, శుబ్ మన్ గిల్ లు గ్రౌండ్ లో సరదాగా డ్యాన్స్ చేశారు. ప్రోటీస్ జట్టు ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ వికెట్ పడ్డ అనంతరం వీరిద్దరు ఒక విధమైన సెలబ్రేషన్స్ చేసుకున్నారు. బుమ్రా బౌలింగ్ లో కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు స్టబ్స్.

ఈ క్రమంలోనే కోహ్లీ-గిల్ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ నవ్వులు పూయించారు. చిన్నతనంలో ఇలాంటి ఆటలు ఎక్కువగా ఆడుతారు పిల్లలు. ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ చిన్నపిల్లాడిలా మారి.. సఫారీ జట్టు 3 వికెట్లను వెంటవెంటనే కోల్పోవడంతో ఇలాంటి సంబరాలు జరుపుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది సరదాగా కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. 153 పరుగులకే ఆలౌట్ అయిన బాధ కొంచెమైనా లేకుండా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మరోసారి కోహ్లీ తనలో ఉన్న కమెడియన్ ను బయటకి తీసుకొచ్చాడని కితాబిస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీ టీమ్ కు అండగా నిలుస్తూ వస్తున్నాడు ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్. అద్భుతమైన బ్యాటింగ్ తో అర్దశతకం పూర్తి చేసుకుని భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం 25 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది సఫారీ టీమ్. క్రీజ్ లో మార్క్రమ్ 57, కేశవ్ మహరాజ్ 3 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరి కోహ్లీ-గిల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి