iDreamPost
android-app
ios-app

IND vs SA: చివరి టెస్ట్​లో టీమిండియాలో కీలక మార్పు.. ఇక టెన్షన్ అక్కర్లేదు!

  • Published Dec 30, 2023 | 9:58 PM Updated Updated Dec 30, 2023 | 9:58 PM

సౌతాఫ్రికాతో చివరి టెస్ట్​కు ముందు టీమిండియాలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఒక స్టార్ ప్లేయర్​ భారత జట్టుతో చేరాడు. ఇది తెలిసిన అభిమానులు ఇక టెన్షన్ అక్కర్లేదని అంటున్నారు.

సౌతాఫ్రికాతో చివరి టెస్ట్​కు ముందు టీమిండియాలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఒక స్టార్ ప్లేయర్​ భారత జట్టుతో చేరాడు. ఇది తెలిసిన అభిమానులు ఇక టెన్షన్ అక్కర్లేదని అంటున్నారు.

  • Published Dec 30, 2023 | 9:58 PMUpdated Dec 30, 2023 | 9:58 PM
IND vs SA: చివరి టెస్ట్​లో టీమిండియాలో కీలక మార్పు.. ఇక టెన్షన్ అక్కర్లేదు!

సెంచూరియన్ టెస్ట్​లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న భారత్ చివరి మ్యాచ్​లో ఎలాగైనా నెగ్గాలని చూస్తోంది. సిరీస్​ ఎలాగూ మిస్సయింది కాబట్టి సమం చేయాలని భావిస్తోంది. తద్వారా స్వదేశంలో ఇంగ్లండ్​తో జరిగే టెస్ట్​ సిరీస్​కు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని చూస్తోంది. అయితే ఫస్ట్ టెస్ట్​లో జరిగిన తప్పులు రిపీటైతే మాత్రం ఇది పాజిబుల్ కాదు. పేస్, బౌన్స్​కు సహకరించిన పిచ్ మీద సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగగా.. మన బౌలర్లు వికెట్లు తీసేందుకు చెమటోడ్చారు. ఒక్క జస్​ప్రీత్ బుమ్రా తప్పితే మిగతా ఎవ్వరూ ప్రభావం చూపించలేదు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విక్ కూడా మ్యాజిక్ చేయలేకపోయాడు. దీంతో కేప్​టౌన్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్‌ కోసం స్పెషలిస్ట్​లను బరిలోకి దింపుతోంది భారత్. అందులో ఒకడు రవీంద్ర జడేజా.

వెన్ను నొప్పి కారణంగా స్టార్ ఆల్​రౌండర్ జడేజా తొలి టెస్టుకు దూరమయ్యాడు. అయితే దీని నుంచి కోలుకున్న అతడు రెండో టెస్ట్​లో ఆడేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అతడు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. సహచర ప్లేయర్లకు జడ్డూ బౌలింగ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తున్నాయి. ప్రాక్టీస్ సందర్భంగా అతడు ఇబ్బంది పడలేదు. టీమ్ కండీషనింగ్ కోచ్ పర్యవేక్షణలో జడేజా బౌలింగ్ సాధన చేస్తున్నాడు. షార్ట్ సెషన్​లో కూడా అతడు ఎక్కడా ఇబ్బంది పడినట్లు కనిపించలేదు. ఒకవేళ రెండో టెస్ట్​లో జడేజా గ్రౌండ్​లోకి దిగితే టీమిండియాకు బ్యాటర్​గా, బౌలర్​గా, ఫీల్డర్​గా ఉపయోగపడతాడు.

ఇక, తొలి టెస్ట్​ ఓటమి తర్వాత హడావుడిగా ఇండియా నుంచి యంగ్ పేసర్ అవేశ్​ ఖాన్​ను టీమ్ మేనేజ్​మెంట్ రప్పించింది. ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్​లో అతడ్ని ఆడిస్తారా? లేదా జడ్డూకు చోటు ఇస్తారా? అనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. అయితే ఫ్యాన్స్​ మాత్రం జడ్డూను ఆడించాలని.. అతడు టీమ్​కు అన్ని విధాలుగా యూజ్ అవుతాడని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరితో పాటు టీమ్​లో ముకేశ్ కుమార్​కు చోటు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. సౌతాఫ్రికాతో జరిగిన టీ20, వన్డే సిరీస్​లో అతడు ఆకట్టుకున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్​లోనూ రాణించాడు. కాబట్టి ఈ యంగ్​ పేసర్​కు ఛాన్స్ ఇవ్వాలని అభిమానులు కోరుకుతున్నారు. మరి.. రెండో టెస్ట్​లో జడ్డూ, అవేశ్​ల్లో ఎవర్ని ఆడిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IND vs SA: ఫస్ట్ టెస్ట్​లో టీమిండియా ఓటమి.. అతడ్ని ఎందుకు పక్కన పెట్టారన్న భజ్జీ!