iDreamPost

IND vs SA: ఫస్ట్ టెస్ట్​లో టీమిండియా ఓటమి.. అతడ్ని ఎందుకు పక్కన పెట్టారన్న భజ్జీ!

  • Published Dec 30, 2023 | 5:42 PMUpdated Dec 30, 2023 | 5:42 PM

సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్ట్​లో టీమిండియా ఓటమి చెందడంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. అతడ్ని ఆడించకుండా పెద్ద తప్పు చేశారన్నాడు.

సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్ట్​లో టీమిండియా ఓటమి చెందడంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. అతడ్ని ఆడించకుండా పెద్ద తప్పు చేశారన్నాడు.

  • Published Dec 30, 2023 | 5:42 PMUpdated Dec 30, 2023 | 5:42 PM
IND vs SA: ఫస్ట్ టెస్ట్​లో టీమిండియా ఓటమి.. అతడ్ని ఎందుకు పక్కన పెట్టారన్న భజ్జీ!

సౌతాఫ్రికా గడ్డ మీద టెస్ట్ సిరీస్ నెగ్గాలన్న కోరిక భారత్​కు అలాగే ఉండిపోయింది. ఈసారి పక్కాగా గెలుస్తుందని అనుకుంటే నిరాశే మిగిలింది. ప్రొటీస్​తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్​ను టీమిండియా ఓటమితో స్టార్ట్ చేసింది. మొదటి మ్యాచ్​లో ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ మూడ్రోజుల్లోనే ముగిసింది. స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా లేకపోవడం టీమ్​ను బాగా దెబ్బతీసింది. అతడు ఉండుంటే అటు బౌలింగ్​లో కీలకమైన వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్​లో విలువైన రన్స్ చేసేవాడు. జడ్డూ లేకపోవడంతో అతడి ప్లేసులో సీరియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​ను ఆడించింది భారత్. జడేజాతో పాటు వెటరన్ పేసర్ మహ్మద్ షమి సేవల్నీ ఫస్ట్ టెస్ట్​లో కోల్పోయింది రోహిత్ సేన. అయితే మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాత్రం జడ్డూ, షమి కంటే ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానె సేవల్ని టీమ్ ఎక్కువగా మిస్సయిందన్నాడు.

ఎలాంటి కారణం లేకుండా పుజారా, రహానేలను సెలక్ట్ చేయకపోవడం దారుణమని హర్భజన్ అన్నాడు. ఇది టీమ్​ను తీవ్రంగా దెబ్బతీసిందన్నాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీతో సమానంగా ఆడే ప్లేయర్ పుజారా అని.. అలాంటోడ్ని ఎలా దూరం పెడతారని ప్రశ్నించాడు. ‘అజింక్యా రహానేను సెలక్ట్ చేయలేదు. అతడితో పాటు ఛటేశ్వర్ పుజారాను ఎలాంటి కారణం లేకుండా పక్కన పెట్టారు. వీళ్లిద్దరూ ఆడిన ప్రతి చోటా పరుగులు చేశారు. టెస్టుల్లో గత రికార్డులను చూసుకుంటే టీమ్​లో కోహ్లీతో సమానంగా పుజారా కాంట్రిబ్యూషన్ అందించాడు. అసలు పుజారాను ఎందుకు దూరంగా ఉంచారో నాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్​లో పుజారాను మించిన ప్లేయర్​ మన జట్టులో లేడు. అతడు మెళ్లిగా ఆడినా ఓటమి నుంచి గట్టెక్కిస్తాడు. అతడి వల్లే ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్​లోనూ భారత్ టెస్టుల్లో గెలిచింది’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు.

సౌతాఫ్రికాతో జరిగిన ఫస్ట్ టెస్ట్​లో ఏ దశలోనూ భారత్ గేమ్​లో ఉన్నట్లు కనిపించలేదన్నాడు హర్భజన్. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్​లో కేఎల్ రాహుల్, సెకండ్ ఇన్నింగ్స్​లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసిన తీరును అతడు మెచ్చుకున్నాడు. వీళ్లిద్దరే ఫైట్ చేశారన్నాడు భజ్జీ. రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసించాడు. కోహ్లీనే లేకపోతే రెండో ఇన్నింగ్స్​లో 131 పరుగులూ టీమిండియా చేసేది కాదన్నాడు. విరాట్ ఏ మూమెంట్​లోనూ ఔట్ అయ్యేలా కనిపించలేదని.. సూపర్బ్​గా బ్యాటింగ్ చేశాడన్నాడు హర్భజన్. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్​లో ఆడిన తీరే భారత్ కొంపముంచిందన్నాడు. యూట్యూబ్​ ఛానల్​లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో భజ్జీ పైకామెంట్స్ చేశాడు. మరి.. పుజారా, రహానేను ఎంపిక చేయకుండా పెద్ద తప్పు చేశారంటూ హర్భజన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Shubman Gill: శుబ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన టీమిండియా దిగ్గజం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి