iDreamPost
android-app
ios-app

Team India: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్.. దరిద్రం ఇలా పట్టుకుందేంటి?

  • Published Dec 30, 2023 | 8:13 PM Updated Updated Dec 30, 2023 | 8:13 PM

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఓటమితో బాధలో ఉన్న భారత్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో రోహిత్ సేనను దరిద్రం ఇలా పట్టుకుందేంటని అభిమానులు అంటున్నారు.

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఓటమితో బాధలో ఉన్న భారత్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో రోహిత్ సేనను దరిద్రం ఇలా పట్టుకుందేంటని అభిమానులు అంటున్నారు.

  • Published Dec 30, 2023 | 8:13 PMUpdated Dec 30, 2023 | 8:13 PM
Team India: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్.. దరిద్రం ఇలా పట్టుకుందేంటి?

సఫారీ టూర్​ను పాజిటివ్​గా స్టార్ట్ చేసిన టీమిండియా టెస్ట్ సిరీస్​లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సౌతాఫ్రికాతో తొలుత జరిగిన టీ20 సిరీస్​ను సమం చేసిన భారత్.. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్​ను సొంతం చేసుకుంది. దీంతో టెస్ట్ సిరీస్​ కూడా నెగ్గుతుందని అభిమానులు అనుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్లు టీమ్​లో ఉండటంతో ఎక్స్​పెక్టేషన్స్​ను మరింత పెంచుకున్నారు ఫ్యాన్స్. కానీ టెస్ట్ సిరీస్​లో భారత్​కు ఏదీ కలసి రావడం లేదు. రెండు టెస్టుల సిరీస్​లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్​లో రోహిత్ సేన ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ మూడ్రోజుల్లోనే ముగిసిపోవడం, భారత్ అన్ని విభాగాల్లోనూ విఫలమవడంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఈ తరుణంలో టీమిండియాకు మరో షాక్ తగిలింది.

చివరి టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న భారత్​కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బౌలింగ్ ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్ నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా అతడి భుజానికి గాయమైంది. దీంతో అతడు రెండో టెస్ట్​లో ఆడటం అనుమానంగా మారింది. అసలే మొదటి టెస్ట్​లో చిత్తుగా ఓడిపోవడం, బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా ఫామ్​లో లేక ఇబ్బందులు పడుతున్న టైమ్​లో శార్దూల్ గాయపడటం భారత టీమ్ మేనేజ్​మెంట్​ను మరింత కలవరపరుస్తోంది. ఈ విషయం తెలిసిన టీమిండియా ఫ్యాన్స్ రోహిత్ సేనను బ్యాడ్ లక్ వదలడం లేదని అంటున్నారు. దరిద్రం ఇలా పట్టుకుందేంటని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. రెండో టెస్ట్​లోనైనా నెగ్గి సిరీస్​ను సమం చేస్తారని అనుకుంటే ఇలా అయిందేంటని ఆందోళన చెందుతున్నారు.

నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన శార్దూల్​ లాస్ట్‌ టెస్ట్​లో ఆడతాడో లేదో ఇప్పుడే చెప్పలేం. దీని గురించి టీమ్ మేనేజ్​మెంట్ ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ శార్దూల్​ దూరమైతే అతడి ప్లేస్​లో టీమ్​లోకి ఎవర్ని తీసుకొస్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. షమి స్థానంలో జట్టుతో చేరిన యంగ్ పేసర్ అవేశ్ ఖాన్​ను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శార్దూల్ గాయం గురించి టీమ్ మేనేజ్​మెంట్ ఏదో ఒకటి చెప్పేదాకా దీనిపై క్లారిటీ రాదు. కానీ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ మాత్రం ఫిట్ అయినా శార్దూల్​ను ఆడించొద్దని అంటున్నారు. ఫస్ట్ టెస్ట్​లో అతడు దారుణంగా ఫెయిలయ్యాడని చెబుతున్నారు. బౌలింగ్​లో 101 రన్స్ ఇచ్చి ఒకే వికెట్ తీశాడని.. బ్యాటింగ్​లోనూ రాణించలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇదీ చదవండి: క్రికెటే కాదు.. బిజినెస్‌లోనూ సచిన్‌ మాస్టరే! ఒక్క నిర్ణయంతో రూ.26 కోట్ల లాభం