iDreamPost

క్రికెటే కాదు.. బిజినెస్‌లోనూ సచిన్‌ మాస్టరే! ఒక్క నిర్ణయంతో రూ.26 కోట్ల లాభం

  • Published Dec 30, 2023 | 6:09 PMUpdated Dec 30, 2023 | 6:09 PM

క్రికెట్‌కు దేవుడు సచిన్‌ టెండూల్కర్‌. అయితే.. సచిన్‌కు క్రికెట్‌ తప్ప ఇంకేం తెలియదు అనుకుంటే పొరపాటే.. క్రికెట్‌లోనే కాదు బిజినెస్‌లోనూ సచిన్‌ మాస్టర్‌ మైండ్‌ అనిపించుకున్నాడు. సచిన్‌ తీసుకున్న ఒక్క నిర్ణయం.. ఏకంగా రూ.26 కోట్ల లాభం తెచ్చిపెట్టంది.

క్రికెట్‌కు దేవుడు సచిన్‌ టెండూల్కర్‌. అయితే.. సచిన్‌కు క్రికెట్‌ తప్ప ఇంకేం తెలియదు అనుకుంటే పొరపాటే.. క్రికెట్‌లోనే కాదు బిజినెస్‌లోనూ సచిన్‌ మాస్టర్‌ మైండ్‌ అనిపించుకున్నాడు. సచిన్‌ తీసుకున్న ఒక్క నిర్ణయం.. ఏకంగా రూ.26 కోట్ల లాభం తెచ్చిపెట్టంది.

  • Published Dec 30, 2023 | 6:09 PMUpdated Dec 30, 2023 | 6:09 PM
క్రికెటే కాదు.. బిజినెస్‌లోనూ సచిన్‌ మాస్టరే! ఒక్క నిర్ణయంతో రూ.26 కోట్ల లాభం

సచిన్‌ టెండూల్కర్‌ అంటే చాలా మందికి ఒక గొప్ప క్రికెటర్‌గానే తెలుసు. క్రికెట్‌ గురించి కాస్త ఎక్కువ అవగాహన ఉన్న వాళ్లు.. భారత దిగ్గజ మాజీ క్రికెటర్‌, ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ అంటూ వర్ణిస్తారు. ప్రపంచ క్రికెట్‌లో చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ అనేక రికార్డులను సచిన్‌ తన పేరిట లిఖించుకున్నాడు. సెంచరీల సెంచరీ చేసిన ఏకైక క్రికెట్‌ సచిన్‌ టెండూల్కర్‌. అయితే.. సచిన్‌ కేవలం గొప్ప క్రికెటరే కాదు, అద్భుతమైన బిజినెస్‌మెన్‌ కూడా. బాల్‌ను బౌండరీకి తరలించడమే కాదు, డబ్బును పొదుపుచేసి, ఎలా పెంచాలో కూడా సచిన్‌కు బాగా తెలుసు. క్రికెట్‌లో అయినా, బిజినెస్‌లో అయినా సచిన్‌ మాస్టరే. సచిన్‌ బిజినెస్‌ మాస్టర్‌ మైండ్‌ గురించి తెలియజేసే ఒక మంచి ఉదాహరణ తాజాగా వెలుగులోకి వచ్చింది.

అదేంటంటే.. సచిన్‌ టెండూల్కర్‌ తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఏకంగా రూ.20 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. సచిన్‌ తన డబ్బును పలు కంపెనీల్లో పెట్టుబడి పెడతాడనే విషయం తెలిసిందే. సచిన్‌ ఒక్కడే కాదు చాలా మంది క్రికెటర్లు, సినిమా యాక్టర్లు తన ప్రొఫెషన్‌ నుంచి వచ్చిన డబ్బును షేర్‌ మార్కెట్‌లోనో, రియల్‌ ఎస్టేట్‌లోనో, స్టార్ట్‌ ఆప్‌ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి తమ డబ్బును జాగ్రత్త చేసుకుని, దాన్ని పెంచుకుంటూ ఉంటారు. అయితే.. తాజాగా సచిన్‌ టెండూల్కర్‌ హైదరాబాద్‌కు చెందిన ఆజాద్‌ ఇంజనీరింగ్స్‌ అనే కంపెనీలో రూ.5 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీ.. డిఫెన్స్‌కు సంబంధిన పరికరాలను తయారు చేస్తూ ఉంటుంది.

అయితే.. ఈ కంపెనీ ఇటీవల పబ్లిక్‌ లిస్టెడ్‌ కంపెనీగా మారింది. దీంతో.. ఈ కంపెనీ షేర్ల కోసం కొనుగోలు దారులు ఎగబడ్డారు. ఈ నెల డిసెంబర్‌ 28న ఆజాబ్‌ కంపెనీ షేర్లకు భారీ డిమాండ్‌ ఏర్పండి. దీంతో ఆ కంపెనీ షేర్‌ వ్యాల్యూ భారీగా పెరిగింది. స్టాక్ ధర 29.21% పెరిగింది, ఒక్కో షేరుకు ₹677.10కి చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ రెండూ గణనీయమైన లావాదేవీలను చూశాయి. ఇలా ఆజాద్‌ కంపెనీ షేర్‌ వ్యాల్యూ భారీగా పెరగడంతో సచిన్‌ పెట్టిన రూ.5 కోట్ల పెట్టబడి ఏకంగా ఏడింతలు పెరిగింది. మొత్తంగా సచిన్‌కు 26.5 కోట్లు పొందాడు. ఇలా సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌లోనే కాకుండా బిజినెస్‌లోనూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ.. కోట్లు కూడబెడుతున్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి