iDreamPost
android-app
ios-app

IND vs SA: సఫారీ టూర్​లో ఇద్దరు సీనియర్లకు నో ఛాన్స్.. సెలక్టర్లు చేసిందే కరెక్ట్ అంటున్న గంగూలీ!

  • Author singhj Published - 08:08 PM, Sun - 3 December 23

సౌతాఫ్రికా టూర్​కు వెళ్తున్న భారత జట్టులో ఇద్దరు సీనియర్లకు సెలక్టర్లు చోటు కల్పించలేదు. సెలక్టర్లపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపై గంగూలీ రియాక్ట్ అయ్యాడు.

సౌతాఫ్రికా టూర్​కు వెళ్తున్న భారత జట్టులో ఇద్దరు సీనియర్లకు సెలక్టర్లు చోటు కల్పించలేదు. సెలక్టర్లపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపై గంగూలీ రియాక్ట్ అయ్యాడు.

  • Author singhj Published - 08:08 PM, Sun - 3 December 23
IND vs SA: సఫారీ టూర్​లో ఇద్దరు సీనియర్లకు నో ఛాన్స్.. సెలక్టర్లు చేసిందే కరెక్ట్ అంటున్న గంగూలీ!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్​ను టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఈ సిరీస్​ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది భారత్. మిగిలిన ఆ ఒక్క మ్యాచ్ నామమాత్రం కానుంది. దీంతో నెక్స్ట్ జరగబోయే సౌతాఫ్రికా టూర్ మీద టీమిండియా ఫోకస్ పెడుతోంది. ఇప్పటికే ఆ సిరీస్​కు వెళ్లబోయే టీమ్స్​ను ప్రకటించారు సెలక్టర్లు. టెస్టు, వన్డే, టీ20లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్స్​ను ఎంపిక చేశారు. టెస్టుల్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మే టీమ్​ను నడిపించనున్నాడు. వన్డేల్లో కేఎల్ రాహుల్ నాయకత్వ బాధ్యతల్ని మోస్తాడు. ఆసీస్​తో టీ20 సిరీస్​లో టీమ్​ను నడిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్.. ప్రొటీస్​తో పొట్టి ఫార్మాట్ సిరీస్​లోనూ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

సౌతాఫ్రికా సిరీస్​కు వెళ్లే టీమ్​లో ఎక్కువగా యంగ్​స్టర్స్​కు అవకాశం ఇచ్చారు సెలక్టర్లు. రింకూ సింగ్, అర్ష్​దీప్ సింగ్, సాయి సుదర్శన్, ముకేశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ లాంటి యువ ప్లేయర్లకు ఛాన్సులు ఇచ్చారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహ్మద్ షమీని కేవలం టెస్ట్ స్క్వాడ్​కే ఎంపిక చేశారు. రెస్ట్ కావాలనే ఉద్దేశంతో లిమిటెడ్ ఓవర్స్​ ఫార్మాట్లకు తాము దూరంగా ఉంటామని వీళ్లు ముందే బీసీసీఐకి తెలియజేశారు. అయితే సఫారీ టూర్​లో కొందరు సీనియర్లకు అవకాశం దక్కకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. స్వింగ్ కింగ్ భువనేశ్వర్​ కుమార్​కు వన్డేలు, టీ20 జట్లలో చోటు కల్పించకపోవడం మీద ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. భువీతో పాటు అజింక్యా రహానె, ఛటేశ్వర్ పుజారాకు మొండిచెయ్యి చూపడం మీదా క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

టెస్టుల్లో నయా వాల్​గా పేరు తెచ్చుకున్న పుజారాతో పాటు క్లాస్ బ్యాటింగ్​తో ఆకట్టుకునే రహానేను విస్మరించడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఈ ఇద్దరు క్రికెటర్లను తీసుకోకపోవడంలో తప్పేమీ లేదని.. సెలక్టర్లు చేసింది కరెక్టేనని అంటున్నాడు బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ. ‘ఏ ప్లేయరైనా ఎప్పటికీ టీమ్​లో కంటిన్యూ అవ్వలేడు. వాళ్లిద్దరూ ఇప్పటిదాకా దేశానికి చేసిన సేవలకు కృతజ్ఞతలు చెబుతున్నా. కానీ సెలక్టర్స్ కొత్తవారి కోసం వెతకడంలోనూ, టాలెంట్ ఉన్న యంగ్​స్టర్స్​కు అవకాశం ఇవ్వడంలోనూ తప్పు లేదు. ఏదో ఒక సమయంలో కొత్తవారిని ఆడించక తప్పదు. ఇండియాలో ఎంతో మంది టాలెంటెడ్ క్రికెటర్స్ ఉన్నారు. టీమ్​ను ముందుకు తీసుకెళ్లాలంటే మార్పులు తప్పవు. టీమిండియా తరఫున పుజారా, రహానె ఎంతో అద్భుతంగా ఆడారు. కానీ స్పోర్ట్స్​లో ఎప్పటికీ జట్టులో కొనసాగడం అనేది కుదరదు’ అని గంగూలీ స్పష్టం చేశాడు. మరి.. పుజారా, రహానేను సెలక్ట్ చేయకపోవడం తప్పేమీ కాదంటూ దాదా చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Shubman Gill: అరుదైన గుర్తింపు దక్కించుకున్న శుబ్ మన్ గిల్!