iDreamPost

IND vs SA: సౌతాఫ్రికాతో రెండో వన్డే.. టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు..!

  • Published Dec 20, 2023 | 8:16 AMUpdated Dec 20, 2023 | 8:16 AM

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. ఆతిథ్య జట్టు ఆల్​రౌండర్ పెర్ఫార్మెన్స్​తో అదరగొట్టగా.. భారత్ ఇటు బ్యాటింగ్​తో పాటు అటు బౌలింగ్​లోనూ ఫెయిలైంది. మన టీమ్ ఓటమికి గల 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. ఆతిథ్య జట్టు ఆల్​రౌండర్ పెర్ఫార్మెన్స్​తో అదరగొట్టగా.. భారత్ ఇటు బ్యాటింగ్​తో పాటు అటు బౌలింగ్​లోనూ ఫెయిలైంది. మన టీమ్ ఓటమికి గల 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 20, 2023 | 8:16 AMUpdated Dec 20, 2023 | 8:16 AM
IND vs SA: సౌతాఫ్రికాతో రెండో వన్డే.. టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు..!

సౌతాఫ్రికాతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్​ను కైవసం చేసుకునే ఛాన్స్​ను మిస్ చేసుకుంది. సెకండ్ ఓడీఐలో తొలుత బ్యాటింగ్​కు దిగిన టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. కొత్త కుర్రాడు సాయి సుదర్శన్ (62), కెప్టెన్ కేఎల్ రాహుల్ (56) మినహా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. దీంతో సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. అనంతరం బౌలింగ్​లోనూ ఫెయిలై ఓడిపోయింది. సఫారీ బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్ (52), టోనీ జార్జి (119 నాటౌట్) అద్భుతంగా ఆడి తమ టీమ్​కు సిరీస్​లో తొలి విక్టరీని అందించారు. ఈ మ్యాచ్​లో భారత్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

రెండో వన్డేలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి బ్యాటింగ్ ఫెయిల్యూర్. సుదర్శన్, రాహుల్ తప్ప ఎవరూ రాణించలేదు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (4) మరోమారు విఫలమయ్యాడు. హైదరాబాదీ తిలక్ వర్మ (10) ఒక్కో రన్ తీసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. వీళ్లిద్దరూ బర్గర్ బౌలింగ్​లోనే ఔటయ్యారు. రాకరాక వచ్చిన అవకాశాన్ని సంజూ శాంసన్ (12) యూజ్ చేసుకోలేకపోయాడు. ఇన్నింగ్స్​ను బిల్డ్ చేసే ఛాన్స్​ ఉన్నా సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. నయా ఫినిషర్ రింకూ సింగ్ (17) వేగంగా ఆడే క్రమంలో పెవిలియన్​కు చేరాడు. బ్యాటర్లు మరో 60 నుంచి 70 పరుగులు స్కోరు బోర్డు మీద పెట్టి ఉండే బౌలర్లకు ఫైట్ చేసేందుకు అవకాశం ఉండేది.

These are the 5 reasons for India's defeat

రెండో వన్డేలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాల్లో రెండోది బౌలింగ్ ఫెయిల్యూర్. తొలి మ్యాచ్​లో అదరగొట్టిన అర్ష్​దీప్ సింగ్ (1/28) ఈసారి ఎక్కువ వికెట్లు తీయలేకపోయాడు. కానీ పొదుపుగా బౌలింగ్ చేస్తూ సఫారీ బ్యాటర్ల మీద ప్రెజర్ పెంచాడు. మొదట్లోనే రెండు, మూడు వికెట్లు పడి ఉంటే మ్యాచ్​లో రిజల్ట్ వేరేలా ఉండేదేమో. మిగిలిన పేసర్లు ముకేశ్ కుమార్ (0/46), అవేశ్ ఖాన్ (0/43) భారీగా రన్స్ ఇచ్చుకున్నారు. అక్షర్​ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేసినా.. కుల్దీప్ యాదవ్ (0/48) బౌలింగ్​లో అపోజిషన్ బ్యాటర్లు పరుగులు పిండుకున్నారు. ఇటు వికెట్లు రాకపోవడం, అటు పరుగులు కూడా లీక్ అవ్వడంతో మ్యాచ్ ప్రొటీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ మ్యాచ్​లో ఓటమికి కెప్టెన్సీ ఫెయిల్యూర్ కూడా ఒక కారణమే. బ్యాటింగ్​లో రాణించిన రాహుల్ ట్రికీ వికెట్ మీద ఇంకొన్ని ఓవర్లు క్రీజులో ఉండాల్సింది.

రాహుల్ ఒక ఎండ్​లో నిలబడి ఉండుంటే వికెట్లు పడేవి కాదు. కానీ అతడు ఔట్ అవ్వడం మ్యాచ్​లో కీలక పాయింట్​గా మారింది. బౌలింగ్, ఫీల్డింగ్ ఛేంజెస్​లో రాహుల్ మరింత జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే మొదట్లోనే వికెట్లు పడేవి. అర్ష్​దీప్ ఆరంభ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా మంచి డెలివరీస్ వేస్తూ సౌతాఫ్రికా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఆ టైమ్​లో ఇంకాస్త అటాకింగ్ ఫీల్డ్ సెట్ చేసి ఉంటే వికెట్ పడే ఛాన్స్ ఉండేది. కానీ దీన్ని రాహుల్ వాడుకోలేదు. భారత్ ఓటమికి మరో కారణం పిచ్. ట్రిక్కీ పిచ్ మీద బ్యాటింగ్ చేసేందుకు మన బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. అదే టైమ్​లో రెండో ఇన్నింగ్స్​లో సౌతాఫ్రికాకు మాత్రం రన్స్ ఈజీగా వచ్చాయి.

ప్రొటీస్ బ్యాటింగ్ టైమ్​లో పిచ్ నుంచి పేస్, స్వింగ్​కు కొంచెం హెల్ప్ దొరికినా అర్ష్​దీప్, ముకేశ్ చెలరేగేవారు. కానీ అది సాధ్యం కాలేదు. ఈ మ్యాచ్​లో సాయి సుదర్శన్ ఔట్ కావడం కూడా మన టీమ్ ఓటమికి మరో కారణం. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలున్నప్పుడల్లా బౌండరీలు బాదుతూ కెప్టెన్ రాహుల్​తో కలసి ఇన్నింగ్స్​ను బిల్డ్ చేశాడీ యంగ్ ఓపెనర్. అయితే అతడు కీలక టైమ్​లో ఔటవ్వడం, ఆ తర్వాత వచ్చిన వాళ్లు వచ్చినట్లు పెవిలియన్ చేరడంతో భారత్​ భారీ స్కోరు చేయలేకపోయింది. రాహుల్​తో కలసి సుదర్శన్ భారీ ఇన్నింగ్స్ ఆడి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో. మరి.. ఈ మ్యాచ్​లో టీమిండియా ఓటమికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Josh Hazlewood: ఆక్షన్​లోకి జోష్ హేజిల్​వుడ్.. RCB రియాక్షన్ చూస్తే నవ్వాగదు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి