iDreamPost

Josh Hazlewood: ఆక్షన్ లోకి జోష్ హేజిల్ వుడ్.. RCB రియాక్షన్ చూస్తే నవ్వాగదు!

ఆసీస్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ పేరు ఐపీఎల్ 2024 వేలంలోకి రాగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఆసీస్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ పేరు ఐపీఎల్ 2024 వేలంలోకి రాగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Josh Hazlewood: ఆక్షన్ లోకి జోష్ హేజిల్ వుడ్.. RCB రియాక్షన్ చూస్తే నవ్వాగదు!

ఐపీఎల్ 2024 వేలం రసవత్తరంగా సాగింది. ఈ వేలంలో ఆసీస్ ప్లేయర్లపై కోట్లు కుమ్మరించాయి ఫ్రాంచైజీలు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే భారీ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతడిని ఏకంగా రూ.24.75 కోట్లకు కోల్ కత్తా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ఇది అందరిని షాక్ కు గురిచేసింది. ఇక రెండో ప్లేస్ లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఉన్నాడు. కమ్మిన్స్ ను రూ.20.50 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా ఈ రోజు జరిగిన ఆక్షన్ లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ పేరు ఆక్షన్ లోకి రాగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

సాధారణంగా ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లను దక్కించుకోవాలని తెగ ఆరాటపడుతూ ఉంటాయి కొన్ని ఫ్రాంచైజీలు. ఇక మరికొన్ని మాత్రం దారుణంగా విఫలం అవుతున్న ప్లేయర్లను వదిలించుకుని ప్రశాంతంగా ఉంటాయి. అయితే తాము వదిలించుకున్న ప్లేయర్లు ఆక్షన్ లోకి రాగానే ఒక విధమైన రియాక్షన్స్ సదరు ఫ్రాంచైజీ నుంచి వస్తూ ఉంటాయి. ఇలాంటి రియాక్షనే ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ పేరు వేలంలోకి రాగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సభ్యుడొకరు ఇచ్చారు. అసలేం జరిగిందంటే?

డిసెంబర్ 19 మంగళవారం నాడు దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వేలంలోకి రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్ వుడ్. ఇక అతడి పేరు ఆక్షన్ బోర్డ్ పైకి రాగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలోని ఓ సభ్యుడు ఏకంగా రెండు చేతులు జోడించి దండం పెట్టాడు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా.. 2022 ఐపీఎల్ మెగావేలంలో హేజిల్ వుడ్ ను ఆర్సీబీ ఏకంగా రూ.7.75 కోట్లు పెట్టి కొన్నది. కానీ మనోడు రాణించకపోవడంతో.. ఈసారి రిలీజ్ చేసింది. 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన అతడిని కొనుగోలు చేయడానికి ఏ టీమ్ ఆసక్తి చూపలేదు. దానికి కారణం అతడు ఫామ్ లో లేకపోవడమే. మరి ఈ ఫన్నీ ఇన్సిడెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Middle stump Cricket (@middle.stump.cric)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి