Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించేందుకు ఇంకో అడుగు దూరంలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో అతడు రేర్ రికార్డ్‌ను క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించేందుకు ఇంకో అడుగు దూరంలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో అతడు రేర్ రికార్డ్‌ను క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు రికార్డులు కొత్త కాదు. దశాబ్దంన్నరకు పైగా కెరీర్లో అతడు ఎన్నో అరుదైన ఘనతలు అందుకున్నాడు. ఎవరికీ సాధ్యం కాని కొన్ని రికార్డుల్ని క్రియేట్ చేశాడు. అలాంటోడు ఇప్పుడు చరిత్ర సృష్టించడానికి మరో అడుగు దూరంలో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ మ్యాచ్‌కు మరికొన్ని నిమిషాలే ఉన్నాయి. తుదిపోరులో సౌతాఫ్రికాతో తలపడనుంది భారత్. ప్రపంచ కప్‌ను తొలిసారి ముద్దాడాలని సఫారీ టీమ్ పట్టుదలతో ఉంది. మరోవైపు పొట్టి కప్పును రెండోసారి కైవసం చేసుకోవాలని రోహిత్ సేన తీర్మానించుకుంది. దీంతో ఫైనల్ మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో మ్యాచ్‌తో పాటు రోహిత్ రికార్డు గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు.
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మకు అరుదైన అవకాశం. ప్రొటీస్‌తో ఫైనల్ ఫైట్‌కు ముందు ఓ అరుదైన రికార్డు హిట్‌మ్యాన్‌ను ఊరిస్తోంది. ఇవాళ గనుక మరో 6 పరుగులు చేస్తే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ నిలుస్తాడు. పొట్టి కప్పులో హయ్యెస్ట్ స్కోర్ చేసిన రికార్డు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. అతడు ఇప్పటిదాకా మెగాటోర్నీలో 1,216 పరుగులు చేశాడు. అదే రోహిత్ 1,211 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ ఉన్న ఫామ్‌కు ఈ ఆరు పరుగులు ఒక లెక్కే కాదు. కాబట్టి కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డుకు మూడిందనే చెప్పాలి. ఇక, ప్రస్తుత ప్రపంచ కప్‌లో రోహిత్ 7 మ్యాచుల్లో 248 పరుగులతో మూడో టాప్ స్కోరర్‌గా కంటిన్యూ అవుతున్నాడు. మరి.. కింగ్ రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.