iDreamPost

Dravid-Rohit: ఆ పీడకలను మర్చిపోని ద్రవిడ్.. తాను సాధించనిది రోహిత్​కు అందిస్తాడా?

  • Published Jun 29, 2024 | 4:23 PMUpdated Jun 29, 2024 | 4:23 PM

టీమిండియా సిసలైన పోరాటానికి సిద్ధమవుతోంది. పొట్టి కప్పు కోసం ఫైనల్​లో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్​ మొదలవడానికి మరికొన్ని గంటలే ఉన్నాయి.

టీమిండియా సిసలైన పోరాటానికి సిద్ధమవుతోంది. పొట్టి కప్పు కోసం ఫైనల్​లో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్​ మొదలవడానికి మరికొన్ని గంటలే ఉన్నాయి.

  • Published Jun 29, 2024 | 4:23 PMUpdated Jun 29, 2024 | 4:23 PM
Dravid-Rohit: ఆ పీడకలను మర్చిపోని ద్రవిడ్.. తాను సాధించనిది రోహిత్​కు అందిస్తాడా?

టీమిండియా సిసలైన పోరాటానికి సిద్ధమవుతోంది. పొట్టి కప్పు కోసం ఫైనల్​లో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్​ మొదలవడానికి మరికొన్ని గంటలే ఉన్నాయి. దీంతో ప్రేక్షకులు, అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రెండు హేమాహేమీలు లాంటి జట్లు బరిలో ఉండటంతో ఏ టీమ్ గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అటు భారత్, ఇటు సౌతాఫ్రికా రెండు కూడా ఓటమి అనేది లేకుండా ఫైనల్స్​కు చేరుకున్నాయి ఇరు జట్లలోనూ అద్భుతమైన స్పిన్నర్లు, పేసర్లు ఉన్నారు. ఆల్​రౌండర్లు, బ్యాటర్లు ఇలా ఏ రకంగా చూసుకున్నా రోహిత్-మార్క్రమ్ టీమ్స్ సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయి. దీంతో ప్రెజర్​ను తట్టుకొని నిలబడే జట్టుదే విజయం ఖాయమని చెప్పొచ్చు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్​కు ఈ ఫైనల్ మ్యాచ్​ ఎంతో కీలకం కానుంది. హిట్​మ్యాన్, విరాట్ పొట్టి ఫార్మాట్​కు గుడ్​బై చెప్పనున్నారనే వార్తలు వస్తున్నాయి. అందుకే వాళ్ల కోసమైనా కప్పు గెలవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ద్రవిడ్​కు భారత టీమ్ కోచ్​గా ఇదే ఆఖరి రోజు కానుంది. అతడి పదవీకాలం ఇవాళ్టితో ముగియనుంది. దీంతో వరల్డ్ కప్ గెలిచి ద్రవిడ్​కు గిఫ్ట్​గా ఇవ్వాలని మరికొందరు అంటున్నారు. దీన్ని పక్కనబెడితే టీమిండియా కోచ్​ను ఓ పీడకల వెంటాడుతోంది. అదే వెస్టిండీస్. అది 2007 వన్డే ప్రపంచ కప్. అప్పటిదాకా టీమ్​కు కెప్టెన్​గా ఉంటూ ఎన్నో కఠిన మ్యాచుల్లో విజయాలు అందించిన ద్రవిడ్ ఆ ఏడాది మెగాటోర్నీలో మాత్రం దాన్ని రిపీట్ చేయలేకపోయాడు.

2007 వరల్డ్ కప్​లో భారత్ గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. అప్పుడు పసికూనగా ఉన్న బంగ్లాదేశ్​ చేతిలో ఓడి టోర్నీ నుంచి బయటకు వచ్చేసింది. దీంతో మన జట్టు ఆటగాళ్ల ఇంటి మీద కొందరు దాడి చేసిన ఉదంతాలు ఉన్నాయి. అన్ని విమర్శలు ద్రవిడ్ తన కెరీర్​లో ఎన్నడూ ఎదుర్కోలేదు. ఆ కరీబియన్ పర్యటన అతడికి పీడకలగా మారింది. అతడు కెప్టెన్సీకి గుడ్​బై చెప్పేశాడు. అయితే పోయిన చోటే వెతుక్కోవాలని పెద్దలు అంటుంటారు. ఇప్పుడు ద్రవిడ్ అదే చేయాలి. అప్పుడు కెప్టెన్​గా విండీస్ గడ్డపై ఫెయిలైన ద్రవిడ్.. ఇప్పుడు అక్కడ టీమిండియాకు కోచ్​గా ఉన్నాడు. తాను ఓడిన చోట రోహిత్ సేనను వెనుక ఉండి సలహాలు, సూచనలు ఇస్తూ గెలిపిస్తే అది మధుర జ్ఞాపకంగా మారుతుంది. తాను సాధించనిది హిట్​మ్యాన్​కు అందించి కోచ్​గా తన కెరీర్, కెప్టెన్​గా రోహిత్ కెరీర్​ను కూడా మరింత చిరస్మరణీయం చేసే అవకాశం ద్రవిడ్ ముందు ఉంది. దీన్ని అతడు ఎలా వాడుకుంటాడో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి