iDreamPost
android-app
ios-app

Rohit Sharma: పక్కా ప్లానింగ్​తో రోహిత్​ను ఔట్ చేసిన సౌతాఫ్రికా.. మనోడే దెబ్బకొట్టాడు!

  • Published Jun 29, 2024 | 8:52 PM Updated Updated Jun 29, 2024 | 8:52 PM

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్​లో సౌతాఫ్రికా అదరగొడుతోంది. ఎన్నో ఎక్స్​పెక్టేషన్స్ మధ్య బరిలోకి దిగిన భారత్​ను ప్రొటీస్ ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది.

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్​లో సౌతాఫ్రికా అదరగొడుతోంది. ఎన్నో ఎక్స్​పెక్టేషన్స్ మధ్య బరిలోకి దిగిన భారత్​ను ప్రొటీస్ ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది.

  • Published Jun 29, 2024 | 8:52 PMUpdated Jun 29, 2024 | 8:52 PM
Rohit Sharma: పక్కా ప్లానింగ్​తో రోహిత్​ను ఔట్ చేసిన సౌతాఫ్రికా.. మనోడే దెబ్బకొట్టాడు!

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్​లో సౌతాఫ్రికా అదరగొడుతోంది. ఎన్నో ఎక్స్​పెక్టేషన్స్ మధ్య బరిలోకి దిగిన భారత్​ను ప్రొటీస్ ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్లే మంచి స్టార్ట్ లభించింది. మార్కో యాన్సన్ వేసిన ఫస్ట్ ఓవర్​లోనే విరాట్ కోహ్లీ 3 బౌండరీలు కొట్టాడు. మొత్తంగా ఆ ఓవర్​లో 15 పరుగులు వచ్చాయి. మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా రెండు ఫోర్లు కొట్టడంతో ఇక తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ 9 పరుగులు చేసిన హిట్​మ్యాన్​ను సఫారీ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ పెవిలియన్​కు పంపించాడు.

మెగాటోర్నీలో స్వీప్ షాట్స్​తో స్పిన్నర్ల బౌలింగ్​లో భారీగా పరుగులు రాబట్టాడు రోహిత్. సౌతాఫ్రికాతో మ్యాచ్​లోనూ ఇదే షాట్​ను ఉపయోగించాలని అనుకున్నాడు. అయితే దీన్ని ముందే పసిగట్టిన కేశవ్ మహారాజ్ అందుకు తగ్గట్లు పర్ఫెక్ట్ స్కెచ్ వేశాడు. సర్కిల్ లోపల స్క్వేర్ లెగ్​లో ఓ ఫీల్డర్​ను పెట్టి ఆ షాట్ కొట్టమంటూ హిట్​మ్యాన్​ను రెచ్చగొట్టాడు. ఈ ఛాలెంజ్​ను స్వీకరించిన రోహిత్ స్వీప్ షాట్ కొట్టాడు. అయితే గాలి కారణంగా బంతికి అనుకున్న ఎలివేషన్ దొరక్కపోవడం, బంతి బ్యాట్ మీదకు స్లోగా రావడంతో ఆ షాట్ వర్కౌట్ కాలేదు. గాల్లో దూసుకొచ్చిన బంతిని హెన్రిచ్ క్లాసెన్ డైవ్ చేసి అందుకున్నాడు. భారతీయ మూలాలు ఉన్న మహారాజ్ మన టీమ్​ను ఆదిలోనే ఈ విధంగా దెబ్బతీశాడు. రోహిత్​తో పాటు రిషబ్ పంత్​ను కూడా అతడు పెవిలియన్​కు పంపించాడు.