Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిసలైన సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. పొట్టి కప్పు ఫైనల్స్‌లో భారత్‌ను గెలిపించి.. విజేతగా నిలబెట్టాలని చూస్తున్నాడు. సౌతాఫ్రికాను చిత్తు చేసి కోట్లాది మంది భారతీయులను సంతోషంలో ముంచెత్తాలని అనుకుంటున్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిసలైన సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. పొట్టి కప్పు ఫైనల్స్‌లో భారత్‌ను గెలిపించి.. విజేతగా నిలబెట్టాలని చూస్తున్నాడు. సౌతాఫ్రికాను చిత్తు చేసి కోట్లాది మంది భారతీయులను సంతోషంలో ముంచెత్తాలని అనుకుంటున్నాడు.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసలు సిసలైన సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. పొట్టి కప్పు ఫైనల్స్‌లో భారత్‌ను గెలిపించి.. విజేతగా నిలబెట్టాలని చూస్తున్నాడు. సౌతాఫ్రికాను చిత్తు చేసి కోట్లాది మంది భారతీయులను సంతోషంలో ముంచెత్తాలని అనుకుంటున్నాడు. ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్ డ్రీమ్‌ను నిజం చేయాలని చూస్తున్నాడు. అతడి సారథ్యంలో టీ20 ప్రపంచ కప్-2022లో సెమీస్ వరకు వచ్చి ఆగిపోయింది భారత్. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లో ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ ఆఖరి మెట్టుపై బోల్తా పడి కప్పును చేజార్చుకుంది. అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోనూ ఫైనల్స్‌కు చేరుకున్నా టైటిల్‌ను అందుకోలేదు. మూడు సార్లు ఐసీసీ ట్రోఫీ దగ్గర దాకా వచ్చి మిస్సవడంతో హిట్‌మ్యాన్ కసి మీద ఉన్నాడు. ఈసారి ఆ ఛాన్స్‌ను మిస్ చేసుకోవద్దని చూస్తున్నాడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ సౌతాఫ్రికాను చిత్తు చేయాల్సిందేనని రోహిత్ పట్టుదలతో ఉన్నాడు. కప్పు కైవసం చేసుకొని తన కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ తరుణంలో హిట్‌మ్యాన్‌పై పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు అద్భుతమైన కెప్టెన్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు. బ్యాటర్‌గా రాణిస్తూ టీమ్‌ను నడిపించడం అంత ఈజీ కాదన్నాడు. గత మెగాటోర్నీలోనూ అతడు ఇలాగే హుషారుగా ఉన్నాడని.. ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంతో ఆడుతుంటే ముచ్చటేస్తోందన్నాడు బుమ్రా. రోహిత్ జోరు ఏమాత్రం తగ్గడం లేదని మెచ్చుకున్నాడు. ఎంతో కష్టపడి అతడు ఈ స్థాయికి చేరుకున్నాడని తెలిపాడు. ప్లేయర్లకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి ఆడమని చెప్పడం వల్లే కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ ఈ రేంజ్‌కు చేరుకున్నాడని బుమ్రా పేర్కొన్నాడు.
‘రోహిత్ సారథ్యం సూపర్బ్. బ్యాటర్‌గా రాణిస్తూనే కెప్టెన్సీ బాధ్యతల్ని నిర్వర్తించడం చిన్న విషయం కాదు. గత ప్రపంచ కప్ సమయంలో ఎంత యాక్టివ్‌గా ఉన్నాడో ఇప్పుడు కూడా అతడు అంతే హుషారుగా ఉన్నాడు. అతడు గ్రౌండ్లో ఉంటే అందరిలోనూ ఉత్సాహం వస్తుంది. జట్టు ఆటగాళ్లందరికీ అతడు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడు. అందరి మాటలు శ్రద్ధగా వింటాడు. తన ఎక్స్‌పీరియెన్స్‌ను ప్లేయర్లతో పంచుకుంటాడు. అతడి కెప్టెన్సీలో ఆడటం గర్వకారణం. ఇప్పుడు టీమ్‌లోని ప్రతి ఆటగాడు ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. ప్రతి ప్లేయర్‌కు ఫ్రీడమ్ ఇవ్వడం, టీమ్ కోసం ఆడేలా ప్రోత్సహించడం రోహిత్లోని బెస్ట్ క్వాలిటీ అని మెచ్చుకున్నాడు. ఈ లక్షణమే తనకు నచ్చుతుందన్నాడు. ఫైనల్ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నామని బుమ్రా వివరించాడు. మరి.. రోహిత్లో మీకు నచ్చే గుణం ఏంటో కామెంట్ చేయండి.