iDreamPost
android-app
ios-app

IND vs SA: ఇప్పటికి అయిపోయిందేమీ లేదు.. ఆ విక్టరీని గుర్తుచేసుకుంటే సఫారీల పని పట్టొచ్చు!

  • Published Dec 30, 2023 | 9:36 PM Updated Updated Dec 30, 2023 | 9:36 PM

సక్సెస్​లో ఉన్నప్పుడు మిస్టేక్స్ కనిపించవు. అదే ఓటమి ఎదురైతే ఒకేసారి ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. ఇప్పుడు టీమిండియా పరిస్థితి ఇలాగే ఉంది. అయితే ఇందులో నుంచి బయటపడాలంటే ఒక విక్టరీని గుర్తుచేసుకోవాలి.

సక్సెస్​లో ఉన్నప్పుడు మిస్టేక్స్ కనిపించవు. అదే ఓటమి ఎదురైతే ఒకేసారి ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. ఇప్పుడు టీమిండియా పరిస్థితి ఇలాగే ఉంది. అయితే ఇందులో నుంచి బయటపడాలంటే ఒక విక్టరీని గుర్తుచేసుకోవాలి.

  • Published Dec 30, 2023 | 9:36 PMUpdated Dec 30, 2023 | 9:36 PM
IND vs SA: ఇప్పటికి అయిపోయిందేమీ లేదు.. ఆ విక్టరీని గుర్తుచేసుకుంటే సఫారీల పని పట్టొచ్చు!

ఏ గేమ్​లోనైనా గెలుపోటములు సహజం. అందుకు క్రికెట్ కూడా మినహాయింపేమీ కాదు. ఛాంపియన్స్ లాంటి టీమ్స్ కూడా ఘోర ఓటమిని చవిచూసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ ఫెయిల్యూర్ నుంచి త్వరగా బయటపడాలి. అప్పుడే కొత్త చరిత్రను సృష్టించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు భారత్ కూడా సరిగ్గా ఇదే ఫేజ్​లో ఉంది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్​లో అద్భుతంగా ఆడిన టీమిండియా.. ఫైనల్ మ్యాచ్​లో ఓడిపోయి కప్​ను చేజార్చుకుంది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్న రోహిత్ సేనకు సఫారీ టూర్​లో మిక్స్​డ్ రిజల్ట్స్ వచ్చాయి. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్​ను డ్రా చేసిన భారత్.. వన్డే సిరీస్​ను కైవసం చేసుకొని ఫుల్ జోష్​లో కనిపించింది. కానీ టెస్ట్ సిరీస్​లోని మొదటి మ్యాచ్​లో చిత్తుగా ఓడింది. ఇన్నింగ్స్ 32 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ తరుణంలో ఒక విక్టరీని టీమిండియా ప్లేయర్లు గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రొటీస్​తో మొదటి టెస్ట్​లో ఓటమితో సిరీస్​ను గెలిచే ఛాన్స్​ను మిస్ చేసుకుంది భారత్. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ పాయింట్స్ టేబుల్​లోనూ ఆరో స్థానానికి పడిపోయింది. దీంతో ప్లేయర్లతో పాటు ఫ్యాన్స్ కూడా నిరాశలో ముగినిపోయారు. కానీ ఇప్పటికి ఇంకా ఏమీ అయిపోలేదు. ఒక విజయాన్ని గుర్తుచేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఆ విక్టరీని గుర్తుచేసుకొని చెలరేగితే సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించొచ్చు. అంత జోష్​ నింపే ఆ విక్టరీ ఆస్ట్రేలియా​ మీద సాధించింది. అది 2018వ సంవత్సరం. భారత్-ఆసీస్ మధ్య టెస్ట్ సిరీస్. సిరీస్​కు డిసైడర్​​గా మారిన మూడో టెస్ట్​లో టీమిండియా నెగ్గింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన మన జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్​లో 7 వికెట్లకు 443 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

భారత బ్యాటర్లలో ఛటేశ్వర్ పుజారా (106), మయాంక్ అగర్వాల్ (76), రోహిత్ శర్మ (63 నాటౌట్) రాణించారు. ముఖ్యంగా పుజారా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్​తో అలరించాడు. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​లో 151 రన్స్​కే కుప్పకూలింది. పేసు గుర్రం జస్​ప్రీత్ బుమ్రా (6 వికెట్లు) చెలరేగి బౌలింగ్ చేశాడు. అనంతరం టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్​లో 106 రన్స్​కు 8 వికెట్ల దగ్గర డిక్లేర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఆతిథ్య కంగారూ జట్టు 261 రన్స్​కు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 137 రన్స్​తో విజయం సాధించింది. ఈ మ్యాచ్​ తర్వాత నాలుగో టెస్ట్​ను డ్రా చేసుకొని సిరీస్​ను సొంతం చేసుకుంది టీమిండియా. ఆసీస్​పై గ్రాండ్ విక్టరీకి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్ అందరూ దాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆసీస్​ను వారి సొంతగడ్డపై చిత్తుగా ఓడించిన ఆ మూమెంట్స్​ను భారత ప్లేయర్లు గుర్తుచేసుకుంటే సఫారీల పని పట్టడం ఈజీ అని అంటున్నారు. ఆ మ్యాచ్​లో ఆడిన కోహ్లీ, రోహిత్, బుమ్రా మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేయాలని కోరుకుంటున్నారు. మరి.. సౌతాఫ్రికాతో చివరి టెస్ట్​లో భారత్ మ్యాజిక్ చేస్తుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Team India: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్.. దరిద్రం ఇలా పట్టుకుందేంటి?