Team India: భారత టీమ్​లో వైస్ కెప్టెన్​కు విలువ లేదు.. వాళ్లదే పెత్తనం: సీనియర్ క్రికెటర్

క్రికెట్ టీమ్​లో కెప్టెన్, వైస్ కెప్టెన్​కు ఇచ్చే గౌరవం, విలువ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. కానీ భారత జట్టులో మాత్రం వైస్ కెప్టెన్ పదవికి విలువ లేదని ఓ మాజీ క్రికెటర్ అంటున్నాడు.

క్రికెట్ టీమ్​లో కెప్టెన్, వైస్ కెప్టెన్​కు ఇచ్చే గౌరవం, విలువ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. కానీ భారత జట్టులో మాత్రం వైస్ కెప్టెన్ పదవికి విలువ లేదని ఓ మాజీ క్రికెటర్ అంటున్నాడు.

సఫారీ టూర్​ను ఓటమితో మొదలుపెట్టిన భారత్ గాడిన పడాలని అనుకుంటోంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన సెకండ్ మ్యాచ్​లో సౌతాఫ్రికాతో చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది టీమిండియా. మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దవగా.. రెండో మ్యాచ్​లో అనుకున్నంత రేంజ్​లో ఆడకపోవడంతో ఓటమి తప్పలేదు. రెండో టీ20లో అటు బ్యాటింగ్​లో ఓపెనర్లు శుబ్​మన్ గిల్, యశస్వీ జైస్వాల్ ఫెయిలవ్వడం.. బౌలర్లు కూడా ప్రభావం చూపకపోవడం భారత్​ను దెబ్బతీసింది. వర్షం కురవడం, తేమ ప్రభావం వల్ల బాల్ మీద పట్టు దొరకకపోవడంతో బౌలర్లు ఎఫెక్టివ్​గా పెర్ఫార్మ్ చేయలేకపోయారు. ఆఖర్లో వాళ్లు చెలరేగినప్పటికీ అప్పటికే మ్యాచ్ ప్రొటీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది.

సిరీస్​లో ఇదే లాస్ట్ మ్యాచ్. కాబట్టి ఈ మ్యాచ్​లో నెగ్గి సిరీస్​ను 1-1తో సమం చేయాలని భారత్ చూస్తోంది. మూడో టీ20లో టీమిండియాలో భారీ మార్పులు చేయడం తప్పనిసరిలా కనిపిస్తోంది. ఇద్దరు ఓపెనర్లలో ఒకర్ని కూర్చోబెట్టి రుతురాజ్ గైక్వాడ్​ను టీమ్​లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్​ లేదా ఇషాన్ కిషన్​ల్లో ఒకరు జట్టులోకి రావొచ్చు. అయితే ఈ సిరీస్​లో టీమ్ సెలక్షన్ మీద విమర్శలు వస్తున్నాయి. ఆసీస్​తో సిరీస్​లో రాణించిన రుతురాజ్, ఇషాన్, రవి బిష్ణోయ్​కు తుది జట్టులో చోటు కల్పించడం లేదు. దీంతో యంగ్​స్టర్స్​ అయోమయంలో పడే ప్రమాదం ఉందని ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు.

కంగారూలతో టీ20 సిరీస్​లో బ్యాటింగ్, బౌలింగ్​లో అదరగొట్టిన స్పిన్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్​ను సౌతాఫ్రికా టూర్​కు ఎంపిక చేయకపోవడం మీదా విమర్శలు వస్తున్నాయి. అక్షర్ ప్లేసులో రవీంద్ర జడేజాను తీసుకోవడం, అతడ్ని వైస్ కెప్టెన్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్​మెంట్, సెలక్టర్ల తీరుపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీ20ల్లో అక్షర్ పటేల్ రూపంలో జడేజా స్థానానికి ప్రమాదం పొంచి ఉందన్నాడు ఆకాశ్ చోప్రా. పొట్టి ఫార్మాట్​లో తన ప్లేస్​ను ఫిక్స్ చేసుకోవాలంటే జడ్డూ ఇక మీదట బ్యాట్ ఝళిపించాల్సిందేనని చెప్పాడు. బ్యాట్​తో గనుక రాణించకపోతే ఏ క్షణమైనా సెలక్టర్లు జడేజా మీద వేటు వేసేందుకు వెనుకాడరని హెచ్చరించాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్​లో వైస్ కెప్టెన్​ ట్యాగ్ అతడ్ని కాపాడుతుందని అనుకుంటే మాత్రం పొరబడ్డట్లేనని ఆకాశ్ పేర్కొన్నాడు.

‘వైస్ కెప్టెన్ అయినంత మాత్రాన జడేజా ఫైనల్ ఎలెవన్​లో ఉంటాడనే నమ్మకం లేదు. ఇటీవలి కాలంలో భారత వైస్ కెప్టెన్ పదవికి విలువ ఉండటం లేదు. ఆసీస్​తో సిరీస్​లో శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్​గా ఉన్నాడు. అంతకుముందు టెస్టుల్లో అజింక్యా రహానే కెప్టెన్​కు డిప్యూటీగా వ్యవహరించాడు. ఈ మధ్య కాలంలో సెలక్టర్లు ప్లేయర్లపై వేటు వేసేందుకు ముందూ వెనుకా ఆలోచించడం లేదు. ఆఖరికి వైస్ కెప్టెన్ అయినా సరే. అయితే ఎందుకిలా చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్​లో సెలక్టర్లదే పెత్తనం నడుస్తోందని ఇన్​డైరెక్ట్​గా వ్యాఖ్యానించాడు. మరి.. వైస్ కెప్టెన్ పోస్ట్​పై ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Mohammed Shami: ఆ విషయంలో ఏ క్రికెటర్ నన్ను బీట్ చేయలేడు: మహ్మద్ షమీ

Show comments