iDreamPost

ఆ విషయంలో ఏ క్రికెటర్ నన్ను బీట్ చేయలేడు: మహ్మద్ షమీ

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం మళ్లీ తన ప్రాక్టీస్ మెుదలుపెట్టాడు మహ్మద్ షమీ. ఈ క్రమంలోనే ఏ క్రికెటర్ కూడా ఆ విషయంలో నన్ను బీట్ చేయలేడని సంచలన కామెంట్స్ చేశాడు. మరి ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం మళ్లీ తన ప్రాక్టీస్ మెుదలుపెట్టాడు మహ్మద్ షమీ. ఈ క్రమంలోనే ఏ క్రికెటర్ కూడా ఆ విషయంలో నన్ను బీట్ చేయలేడని సంచలన కామెంట్స్ చేశాడు. మరి ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆ విషయంలో ఏ క్రికెటర్ నన్ను బీట్ చేయలేడు: మహ్మద్ షమీ

మహ్మద్ షమీ.. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మెగాటోర్నీకి లేట్ గా వచ్చినా.. లేటెస్ట్ గా నిలిచాడు. కేవలం 7 మ్యాచ్ ల్లోనే 24 వికెట్లు పడగొట్టి.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అగ్రస్థానంలో నిలిచి.. ఔరా అనిపించాడు. ఇక ఈ మెగాటోర్నీ తర్వాత విరామం తీసుకున్న షమీ, సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం మళ్లీ తన ప్రాక్టీస్ మెుదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సౌతాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం సన్నద్దమవుతున్నాడు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ. ప్రస్తుతం అందరి చూపు ఇతడిపైనే ఉంది. దానికి కారణం వరల్డ్ కప్ లో అతడు చూపిన అద్భుత ప్రదర్శనే. అదీకాక పేస్ కు అనుకూలించే సఫారీ పిచ్ లపై ఎలా చెలరేగుతాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను జిమ్ లో చేసే కసరత్తులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకోవడం ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు.

For that matter No one better than me

మహ్మద్ షమీ మాట్లాడుతూ..”నేను జిమ్ లో చేసే కసరత్తులను సోషల్ మీడియాలో పంచుకోను. ఎందుకంటే? నాకు పబ్లిసిటీ అవసరం లేదు. దాంతో నేను జిమ్ లో ఏం చేస్తున్నాను అన్న విషయాలు అభిమానులకు తెలీవు. అయితే మీ అందరికి తెలీని ఒక విషయం చెప్తున్నా వినండి. జిమ్ లో నా కంటే ఏ క్రికెటర్ కూడా ఎక్కువ బరువులు ఎత్తలేడు. నేను లెగ్ ప్రెస్ పై 750 కేజీల బరువును ఎత్తగలను. ఆ విషయంలో ఏ క్రికెటర్ నన్ను బీట్ చేయలేడు” అంటూ చెప్పుకొచ్చాడు మహ్మద్ షమీ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో.. నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. నీ ఫిట్ నెస్ కు కారణం ఇదేనా? ఏంటి బ్రో అన్ని కేజీలు ఎలా ఎత్తుతున్నావ్? అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి షమీ 750 కేజీల బరువు ఎత్తడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి