iDreamPost

IND vs SA: ఫైనల్‌కి ముందు టీమిండియాకు మార్కరమ్‌ వార్నింగ్‌! ఆకలితో ఉన్నామంటూ..

  • Published Jun 29, 2024 | 3:29 PMUpdated Jun 29, 2024 | 3:29 PM

Aiden Markram, IND vs SA, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కి ముందు సౌతాఫ్రికా కెప్టెన్‌ మార్కరమ్‌ టీమిండియాకు వార్నింగ్‌ ఇచ్చాడు. తాము ఆకలితో ఉన్నామంటూ.. ఎమోషనల్‌ డైలాగ్‌ కొట్టాడు. అతను ఏమన్నాడో పూర్తిగా తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు(శనివారం) బార్బోడోస్‌ వేదికగా ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఈ హైఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. ఎలాగైన కప్పు కొట్టాలని ఇరుజట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. 2013 తర్వాత టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా నెగ్గలేదు. అలాగే 1998 తర్వాత సౌతాఫ్రికా కూడా ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. అసలు సౌతాఫ్రికా ఇప్పటి వరకు వన్డే, టీ20 వరల్డ్‌ కప్‌ నెగ్గలేదు. ఓ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు చేరడం వాళ్లకు ఇదే తొలిసారి. అయినా కూడా.. టీమిండియాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు మార్కరమ్‌.

మార్కరమ్‌ మాట్లాడుతూ.. ‘మేం ఇంకా ఒక అడుగు వేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో కోచ్‌ లేదా కెప్టెన్‌ ఎవర్ని గైడ్‌ చేయరు.. మొత్తం జట్టు ఒక యూనిట్‌లా కలిసి ఆడుతుంది. ఆటగాళ్లలో సహజంగానే పోటీతత్వం ఉంటుంది. ఎవరూ కూడా ఓడిపోవాలని అస్సలు అనుకోరు, ఓటమిని ఒప్పుకోరు. కాబట్టి ఫైనల్‌లో మేం విజయం కోసమే ఆడతాం.. ఫైనల్‌ మ్యాచ్‌ కోసం మేం చాలా ఆకలితో ఉన్నాం’ అని పేర్కొన్నాడు. వరల్డ్‌ కప్‌ పోటీల్లో సౌతాఫ్రికాను తొలి ఫైనల్‌ చేర్చిన కెప్టెన్‌గా మార్కరమ్‌ పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

అయితే.. ఫైనల్‌ మ్యాచ్‌లో తామంతా ఒకటే లక్ష్యంతో ఆడతామని, కప్పు గెలవాలనే ఆకలి తమకు ఎప్పటి నుంచో ఉందని.. తమ ఆకలికి టీమిండియా బలైపోతుందని పరోక్షంగా వార్నింగ్‌ ఇచ్చాడు మార్కరమ్‌. మరోవైపు టీమిండియా కూడా ఫైనల్‌ మ్యాచ్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. రెండు జట్లు పేపర్‌పై సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ అన్ని విభాగాల్లో రెండు జట్లు స్ట్రాంగ్‌గానే ఉన్నా.. గత చరిత్ర చూస్తే మాత్రం టీమిండియానే హాట్‌ ఫేవరేట్‌గా ఉంది. మరి ఫైనల్‌ మ్యాచ్‌కి ముందు సౌతాఫ్రికా కెప్టెన్‌ మార్కరమ్‌ ఆకలితో ఉన్నామని పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి