iDreamPost
android-app
ios-app

IND vs SA: టెస్ట్ సిరీస్​కు ముందు భారత్​కు మరో షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్.. తెలుగోడికి ఛాన్స్!

  • Published Dec 17, 2023 | 6:12 PMUpdated Dec 18, 2023 | 9:59 AM

సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్​ల టెస్ట్ సిరీస్​కు ముందు టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే వెటరన్ పేసర్ మహ్మద్ షమి దూరమై టెన్షన్ పడుతున్న భారత్​కు ఇంకో చేదువార్త.

సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్​ల టెస్ట్ సిరీస్​కు ముందు టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే వెటరన్ పేసర్ మహ్మద్ షమి దూరమై టెన్షన్ పడుతున్న భారత్​కు ఇంకో చేదువార్త.

  • Published Dec 17, 2023 | 6:12 PMUpdated Dec 18, 2023 | 9:59 AM
IND vs SA: టెస్ట్ సిరీస్​కు ముందు భారత్​కు మరో షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్.. తెలుగోడికి ఛాన్స్!

నేషనల్ టీమ్​లో ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. అందులోనూ వన్డేలు, టీ20ల కంటే టెస్టుల్లో ఆడటం చాలా మంది డ్రీమ్​గా భావిస్తారు. ఎందుకంటే క్రికెట్​లోని అసలైన మజా లాంగ్ ఫార్మాట్​లోనే ఉంటుంది. అయితే టెస్టు టీమ్​లో స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాలి. ఎంతో మంది సీనియర్ల మధ్య టీమ్​లో పర్మినెంట్​ ప్లేయర్​గా మారాలంటే తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. అందుకోసం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అలా భారత టెస్ట్​ టీమ్​లో తమ ప్లేస్​ను సుస్థిరం చేసుకోవాలనుకుంటున్న యంగ్​స్టర్స్​లో ఇషాన్ కిషన్ ఒకడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్​కు టెస్టు జట్టులో ఛాన్సులు వస్తున్నా ఇంకా ప్లేస్ ఫిక్స్ కాలేదు. ఈ నేపథ్యంలో త్వరలో సౌతాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సిరీస్​లో రాణించి తన చోటును పదిలం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అనూహ్యంగా ఈ సిరీస్​కు దూరమయ్యాడీ లెఫ్టాండ్ బ్యాటర్.

సఫారీ టూర్​లో ఉన్న టీమిండియాకు టెస్ట్ సిరీస్​కు ముందే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చీలమండ గాయం కారణంగా స్టార్ పేసర్ మహ్మద్ షమి ఈ సిరీస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. పర్సనల్ రీజన్స్ వల్ల అతడు టీమ్​ నుంచి రిలీజ్ అయ్యాడు. దీంతో ఇషాన్ ప్లేసులో ఆంధ్రా కుర్రాడు కోన శ్రీకర్ భరత్​ను టీమ్​లో చేర్చుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ ప్రకటన చేసింది. తనను సిరీస్ నుంచి విడుదల చేయాలని స్వయంగా ఇషాన్ కోరాడని బీసీసీఐ తెలిపింది. ఇంకా టెస్ట్ సిరీస్​కు దాదాపుగా పది రోజుల టైమ్ ఉంది. ఫస్ట్ టెస్ట్ డిసెంబర్ 26వ తేదీన జరగనుంది. అయితే ఈ లోపు ఇంకేమైనా షాకులు ఉంటాయేమోనని భారత ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఇషాన్ కిషన్ ప్లేసులో టీమిండియాలో చోటు దక్కించుకున్న కేఎస్ భరత్ త్వరలో జట్టుతో కలుస్తాడు. ప్రస్తుతం ఇండియా-ఏ టీమ్​ సౌతాఫ్రికాలోనే ఉంది. ఆ జట్టుకు ఆడుతున్న భరత్ కూడా అక్కడే ఉన్నాడు. సిరీస్ మొదలవ్వడానికి ముందే ఇషాన్ వెళ్లిపోవడం ఈ ఆంధ్రా క్రికెటర్​కు కలిసొచ్చింది. ఈ ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్​ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్​లో అరంగేట్రం చేసిన భరత్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కీపింగ్​లో అదరగొట్టినా.. బ్యాటింగ్​లో కన్​సిస్టెంట్​గా రాణించలేదు. లోయరార్డర్​లో బ్యాటింగ్​కు వచ్చే ఈ ఆంధ్రా ప్లేయర్ కొన్ని సార్లు మెరుపులు మెరిపించాడు. కానీ ఇంపార్ట్​ఫుల్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. దీంతో అతడు టీమ్​కు దూరమయ్యాడు. అయితే ఇషాన్ వైదొలగడంతో ఇప్పుడు అనుకోకుండా ఛాన్స్ వచ్చింది. దీన్ని అతడు ఎంతమేర సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. మరి.. టెస్ట్ సిరీస్​కు ముందు టీమిండియాకు వరుస షాకులు తగలడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Arshdeep Singh: పనికి రాడన్నోడే పడగొట్టి చూపించాడు.. సఫారీ బ్యాటర్లను పోయించిన అర్ష్​దీప్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి