iDreamPost

Arshdeep Singh: పనికి రాడన్నోడే పడగొట్టి చూపించాడు.. సఫారీ బ్యాటర్లను పోయించిన అర్ష్​దీప్!

  • Published Dec 17, 2023 | 5:36 PMUpdated Dec 17, 2023 | 5:36 PM

ఫామ్​లో ఉన్నప్పుడు ఎవ్వరైనా బాగానే పెర్ఫార్మ్ చేస్తారు. కానీ ఫామ్ కోల్పోయిన టైమ్​లో, భారీగా విమర్శలు ఎదుర్కొంటున్నప్పుడు తమ బెస్ట్ ఇవ్వడం అంత ఈజీ కాదు. అలా విమర్శల్ని ఫేస్ చేసిన యంగ్ పేసర్ అర్ష్​దీప్ సింగ్ మరోమారు తన సత్తా ఏంటో చూపించాడు.

ఫామ్​లో ఉన్నప్పుడు ఎవ్వరైనా బాగానే పెర్ఫార్మ్ చేస్తారు. కానీ ఫామ్ కోల్పోయిన టైమ్​లో, భారీగా విమర్శలు ఎదుర్కొంటున్నప్పుడు తమ బెస్ట్ ఇవ్వడం అంత ఈజీ కాదు. అలా విమర్శల్ని ఫేస్ చేసిన యంగ్ పేసర్ అర్ష్​దీప్ సింగ్ మరోమారు తన సత్తా ఏంటో చూపించాడు.

  • Published Dec 17, 2023 | 5:36 PMUpdated Dec 17, 2023 | 5:36 PM
Arshdeep Singh: పనికి రాడన్నోడే పడగొట్టి చూపించాడు.. సఫారీ బ్యాటర్లను పోయించిన అర్ష్​దీప్!

భారత జట్టును పేస్ బౌలింగ్ సమస్య ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే వస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో మన టీమ్ బౌలింగ్ యూనిట్ బలపడింది. ఎన్నడూ లేనంత పటిష్టంగా తయారైంది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్​లో జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా షమి అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీళ్లతో పాటు టీమ్ బెంచ్ స్ట్రెంగ్త్ కూడా స్ట్రాంగ్​గా కనిపించింది. అర్ష్​దీప్ సింగ్, ముకేశ్ కుమార్, అవేశ్​ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ​ లాంటి యంగ్​స్టర్స్ తమకు వచ్చిన ఛాన్సుల్ని వినియోగించుకుంటూ ఫ్యూచర్ మీద భరోసా కల్పించారు. వీళ్లలో అర్ష్​దీప్ మిగతా వారి కంటే ఎక్కువ ఇంప్రెస్ చేశాడు. పొడగరి అయిన ఈ లెఫ్టార్మ్ పేసర్ చాలా డేంజరస్​గా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టాడు. కానీ ఇటీవల కాలంలో తరచూ విఫలమవుతున్న అర్ష్​దీప్​పై భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

మంచి పేస్, పదునైన బౌన్సర్లు, యార్కర్లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే అర్ష్​దీప్ మునుపటిలా రాణించకపోవడంతో అతడ్ని టీమ్​లో నుంచి తీసేయాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. భారీగా పరుగులు ఇస్తూ టీమ్​కు తలనొప్పిగా మారిన ఈ పేసర్​ను పక్కన పెట్టాల్సిందేనని.. అతడి బౌలింగ్​లో పసలేదని సోషల్ మీడియాలోనూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే వాళ్లందరికీ బాల్​తోనే ఆన్సర్ ఇచ్చాడీ పంజాబీ పుత్తర్. సౌతాఫ్రికాతో మూడు వన్డే సిరీస్​లో భాగంగా ఇవాళ జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్​లో ఏకంగా 5 వికెట్లతో చెలరేగాడు అర్ష్​దీప్​. పిచ్​ పేస్​కు పెద్దగా అనుకూలించకపోయినా తన టాలెంట్​తో సఫారీ బ్యాటర్లను పోయించాడు. ఓపెనర్లు రీజా హెండ్రిక్స్ (0), టోనీ డీ జోర్జీ (22) త్వరగా వెనక్కి పంపిన భారత స్పీడ్​స్టర్.. డేంజరస్ వాండర్ డస్సెన్​ (0)నూ ఔట్ చేశాడు.

స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (6) కూడా అర్ష్​దీప్ బౌలింగ్​లోనే పెవిలియన్​కు చేరాడు. ఆఖర్లో ఫెహ్లెక్వాయో (33)ను కూడా ఔట్ చేసి తన కెరీర్​లో తొలిసారి 5 వికెట్ల క్లబ్​లో చేరాడు. సౌతాఫ్రికా సొంత గడ్డ మీద సౌతాఫ్రికా టీమ్​పై 5 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్​గా రికార్డు సృష్టించాడు. అర్ష్​దీప్​కు తోడుగా మరో యంగ్ పేసర్ అవేశ్ ఖాన్ (4 వికెట్లు) కూడా బాగా బౌలింగ్ చేయడంతో మొదట బ్యాటింగ్​కు దిగిన సౌతాఫ్రికా 27.3 ఓవర్లలో 116 రన్స్​కు ఆలౌట్ అయింది. ఆతిథ్య జట్టులో హెండ్రిక్స్, డస్సెన్, మార్క్​రమ్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్ లాంటి ప్రమాదకర బ్యాటర్లు ఉన్నారు. కానీ వీళ్లలో మార్క్​రమ్, మిల్లర్ తప్ప మిగతా ముగ్గుర్నీ అర్ష్​దీప్ ఔట్ చేశాడు. దీంతో ఆ టీమ్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. కాగా, ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్​లోనూ భారీగా రన్స్ ఇచ్చుకున్న అర్ష్​దీప్ వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో సఫారీ టూర్ అతడికి ఆఖరి ఛాన్స్ అనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజా ప్రదర్శనతో తన సత్తా ఏంటో ప్రూవ్ చేశాడు అర్ష్​దీప్. మరి.. పనికి రాడనుకున్న అర్ష్​దీప్ సౌతాఫ్రికా టాప్ బ్యాటర్ల వికెట్లను పడగొట్టడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Mumbai Indians: అంతకంతా పగ తీర్చుకుంటున్నారు.. ముంబైని వదలని రోహిత్ ఫ్యాన్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి