iDreamPost
android-app
ios-app

Mohammed Shami: షమి విషయంలో తప్పు చేస్తున్న BCCI.. డేంజర్​లో పేసర్ కెరీర్!

  • Author singhj Published - 09:23 PM, Sat - 2 December 23

టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమి విషయంలో బీసీసీఐ తప్పు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడి కెరీర్ డేంజర్​లో ఉందని అంటున్నారు.

టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమి విషయంలో బీసీసీఐ తప్పు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడి కెరీర్ డేంజర్​లో ఉందని అంటున్నారు.

  • Author singhj Published - 09:23 PM, Sat - 2 December 23
Mohammed Shami: షమి విషయంలో తప్పు చేస్తున్న BCCI.. డేంజర్​లో పేసర్ కెరీర్!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్​ను టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. 5 టీ20ల ఈ సిరీస్​ను భారత్ 3-1 తేడాతో సొంతం చేసుకుంది. మరో మ్యాచ్​ మిగిలి ఉండగానే కంగారూలతో సిరీస్​ను కైవసం చేసుకుంది మన టీమ్. ఈ టీ20 సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లనుంది. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్​లు ఆడనుంది. ఇప్పటికే ఈ టూర్​కు వెళ్లే ప్లేయర్ల లిస్ట్​ను ప్రకటించింది బీసీసీఐ. మూడు ఫార్మాట్లకు ఈసారి ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను బోర్డు ప్రకటించింది. లాంగ్ ఫార్మాట్​లో రోహిత్ శర్మ, వన్డేల్లో కేఎల్ రాహుల్, పొట్టి ఫార్మాట్​లో సూర్యకుమార్ యాదవ్​లు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

సౌతాఫ్రికా టూర్​కు ముగ్గురు కెప్టెన్ల ఫార్ములాను ప్రయోగించడం వెనుక ఓ కారణం ఉంది. రెగ్యులర్ కెప్టెన్‌ రోహిత్ శర్మ ఈ సిరీస్​లో కేవలం టెస్టుల్లోనే ఆడతానని చెప్పాడు. రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో లిమిటెడ్ ఓవర్స్​ క్రికెట్​కు తనను దూరంగా ఉంచాలని బోర్డును హిట్​మ్యాన్ కోరాడట. దీంతో వన్డే టీమ్ పగ్గాలను రాహుల్​కు అప్పజెప్పారు. టీ20ల్లో టీమ్​ను నడిపించాల్సిన హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆసీస్​తో సిరీస్​లో కెప్టెన్​గా ఆకట్టుకున్న సూర్యకుమార్​కు సఫారీ సిరీస్​లోనూ కెప్టెన్సీ బాధ్యతలను అప్పజెప్పింది. కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ చేసిన మార్పులు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

సఫారీ టూర్​లో రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సీనియర్ పేసర్ మహ్మద్ షమి కూడా కేవలం టెస్టులకే పరిమితం కానున్నారు. వీళ్లిద్దరూ కూడా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతోనే మిగిలిన రెండు ఫార్మాట్లకు దూరంగా ఉంటామని బోర్డుకు చెప్పారట. దీనికి అనుమతించిన బీసీసీఐ.. వన్డేలు, టీ20లకు వాళ్లిద్దర్నీ సెలక్ట్ చేయలేదు. అయితే షమి విషయంలో భారత క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు మీద మాత్రం విమర్శలు వస్తున్నాయి. చీలమండ గాయంతో బాధపడుతున్న షమీని అసలు ఈ సిరీస్​కు ఎందుకు సెలక్ట్ చేశారనే ప్రశ్నలు వస్తున్నాయి.

ప్రస్తుతం ముంబైలోని ఒక ఆర్థోపెడిక్ దగ్గర ట్రీట్​మెంట్ తీసుకుంటున్నాడట షమి. అతడి గాయం గురించి సమాచారాన్ని బోర్డే వెల్లడించింది. అలాంటప్పుడు ఇంజ్యురీతో బాధపడుతున్నాడని ముందే తెలిసినా సౌతాఫ్రికా సిరీస్​కు ఎందుకు ఎంపిక చేశారనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకవేళ ఆ టూర్​కు వెళ్లే లోపు కోలుకుంటే ఆడిద్దామనే ఆలోచనతోనే అలా చేసుంటారని వినిపిస్తోంది. అలా చేస్తారనే అనుకుందాం.. అప్పుడు ఇంజ్యురీ నుంచి పూర్తిగా రికవర్ కాకుండా ఆడించడం రాంగ్ అవుతుంది. సౌతాఫ్రికా సిరీస్​లో యంగ్​స్టర్స్ విషయంలో ప్రయోగాలు చేస్తే ఓకే.

రాబోయే టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ సిరీస్​లో ఎంతో కీలకంగా భావిస్తున్న షమీని గాయంతో ఇబ్బంది పడుతున్నా ఆడించడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అందులోనూ ఫిట్​నెస్ ఎంతో కీలకమైన టెస్టుల్లో ఆడిస్తే.. ఒకవేళ గాయం తిరగబెడితే అతడి కెరీర్ డేంజర్​లో పడే ప్రమాదం ఉంది. అందుకే షమి విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. సీనియర్ పేసర్​కు కావాల్సినంత రెస్ట్ ఇచ్చి.. రికవర్ అయ్యాక ఆడించాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఇలాంటి విలువైన ప్లేయర్​ను కాపాడుకోవాలని చెబుతున్నారు. మరి.. షమి విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs AUS: టీమిండియా బ్యాటర్​కు సారీ చెప్పిన అంపైర్! ఎందుకంటే..?