iDreamPost
android-app
ios-app

Jasprit Bumrah: వాడి ముందు కప్పు కొట్టా.. దీన్ని మించిన సంతోషం లేదు: బుమ్రా

  • Published Jun 30, 2024 | 9:00 AM Updated Updated Jun 30, 2024 | 9:00 AM

ప్రతిష్టాత్మక వరల్డ్ కప్​ను టీమిండియా అందుకోవడంతో దేశమంతటా సంబురాలు మొదలైపోయాయి. కోట్లాది మంది అభిమానులు ఈ గెలుపును పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ప్రతిష్టాత్మక వరల్డ్ కప్​ను టీమిండియా అందుకోవడంతో దేశమంతటా సంబురాలు మొదలైపోయాయి. కోట్లాది మంది అభిమానులు ఈ గెలుపును పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

  • Published Jun 30, 2024 | 9:00 AMUpdated Jun 30, 2024 | 9:00 AM
Jasprit Bumrah: వాడి ముందు కప్పు కొట్టా.. దీన్ని మించిన సంతోషం లేదు: బుమ్రా

ప్రతిష్టాత్మక వరల్డ్ కప్​ను టీమిండియా అందుకోవడంతో దేశమంతటా సంబురాలు మొదలైపోయాయి. కోట్లాది మంది అభిమానులు ఈ గెలుపును పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 13 ఏళ్ల తర్వాత భారత జట్టు ఛాంపియన్​గా నిలవడంతో సంతోషం పట్టలేక ఎమోషనల్ అయిపోతున్నారు. మైదానంలో ఉన్న క్రికెటర్లతో పాటు టీవీలు, మొబైల్స్​లో మ్యాచ్​ను చూసిన అభిమానులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక కప్పు రాదు.. సెమీస్, ఫైనల్స్​కు వెళ్లినా ఓడటమేగా అని నిరాశలో కూరుకుపోయిన ఫ్యాన్స్​లో కాన్ఫిడెన్స్​ నింపింది రోహిత్ సేన. ఫైనల్​లో సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో చిత్తు చేసి మనం విశ్వవిజేతలమని, మనల్ని మించిన టీమ్ ఇంకొకటి లేదని సగర్వంగా చాటి చెప్పింది.

ప్రొటీస్​తో ఫైనల్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగడంతో అందరూ టెన్షన్ పడ్డారు. మ్యాచ్​ను చూస్తున్న ఆడియెన్స్ పరిస్థితి అలా ఉంటే.. గ్రౌండ్​లో ఉన్న ప్లేయర్లు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే కెప్టెన్ రోహిత్ వాళ్లను కూల్​గా ఉంచాడు. ప్రెజర్ తాను తీసుకొని వాళ్లను స్వేచ్ఛగా ఆడించాడు. నిన్నటి మ్యాచ్​లో చాలా మంది ప్లేయర్లు రాణించినా.. రియల్ హీరోగా నిలిచాడు పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా. 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడతను. అతడి స్పెల్ వల్లే టీమ్ ఒడ్డున పడింది. బుమ్రాను చూసి ఇన్​స్పైర్ అయిన అర్ష్​దీప్, హార్దిక్​ మరింత చెలరేగి బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్​తో పాటు టోర్నీ ఆసాంతం అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా అతడు ఎమోషనల్ అయ్యాడు. వాడి ముందు కప్పు కొట్టడం ఆనందంగా ఉందన్నాడు.

మ్యాచ్ తర్వాత తన భార్య సంజనా గణేషన్​తో కాసేపు ముచ్చటించాడు బుమ్రా. ఈ సందర్భంగా ఆమె అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ‘అద్భుత విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్​లో కొన్ని మూమెంట్స్​లో చాలా నెర్వస్​గా అనిపించింది. కానీ కప్పు కొట్టినందుకు హ్యాపీ. ఇది మాకు గ్రేట్ టోర్నమెంట్. ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించింది. అంగద్ కూడా ఇక్కడే ఉన్నాడు. వాడి ముందు కప్పు కొట్టడాన్ని మించిన బెటర్ ఫీలింగ్ మరొకటి ఉండదు. ఫైనల్ మ్యాచ్​లో మేం మా బలానికి తగ్గట్లు ఆడాం. అందరూ కీలక టైమ్​లో రాణించారు. కూల్​గా ఉంటూ అనుకున్న పనిని ఫినిష్ చేశారు. చివర్లో కాస్త టెన్షన్​గా అనిపించింది. కానీ మేం ఒత్తిడికి గురవకుండా మ్యాచ్​ను ముగించాం’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సంజనను హగ్ చేసుకున్నాడు బుమ్రా. వీళ్లిద్దరి కుమారుడే అంగద్. అందుకే తన కొడుకు ముందు వరల్డ్ కప్ కొట్టడాన్ని మించిన ఆనందం మరొకటి లేదన్నాడు బుమ్రా. మరి.. మెగాటోర్నీలో బుమ్రా పెర్ఫార్మెన్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.