iDreamPost
android-app
ios-app

Virat Kohli: వీడియో: భార్యాపిల్లలతో మాట్లాడుతూ.. కోహ్లీ ఎమోషనల్‌! విరాట్ ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు..

  • Published Jun 30, 2024 | 8:42 AM Updated Updated Jun 30, 2024 | 8:42 AM

వరల్డ్ కప్ విజయం తర్వాత భార్య, పిల్లలకు వీడియో కాల్ చేసిన విరాట్ కోహ్లీ, తన సంతోషాన్ని కన్నీళ్ల రూపంలో తెలియజేశాడు. విరాట్ ను ఇంతకు ముందెన్నడూ ఇలా చూడలేదు.. అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.

వరల్డ్ కప్ విజయం తర్వాత భార్య, పిల్లలకు వీడియో కాల్ చేసిన విరాట్ కోహ్లీ, తన సంతోషాన్ని కన్నీళ్ల రూపంలో తెలియజేశాడు. విరాట్ ను ఇంతకు ముందెన్నడూ ఇలా చూడలేదు.. అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.

Virat Kohli: వీడియో: భార్యాపిల్లలతో మాట్లాడుతూ.. కోహ్లీ ఎమోషనల్‌! విరాట్ ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు..

ప్రపంచ క్రికెట్ లో ఓ శకం ముగిసింది. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో వారిద్దరు ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడిన తర్వాత ఘనంగా రిటైర్మెంట్ ప్రకటించారు ఈ దిగ్గజాలు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత గ్రౌండ్ లో భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంది. ఏ ఆటగాడిని కదిలించినా.. ఆనందబాష్పాలే రాలుతున్నాయి. ఇక ఈ విజయం తర్వాత భార్య, పిల్లలకు వీడియో కాల్ చేసిన విరాట్ కోహ్లీ, సంతోషాన్ని కన్నీళ్ల రూపంలో తెలియజేశాడు. విరాట్ ను ఇంతకు ముందెన్నడూ ఇలా చూడలేదు.

టీ20 వరల్డ్ కప్ 2024ను టీమిండియా సగర్వంగా ముద్దాడింది. టైటిల్ ఫేరెట్ గా ఈ టోర్నీలోకి అడుగుపెట్టిన భారత్.. అందుకు తగ్గట్లుగానే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఒక్క ఓటమి ఎగరగని జట్టుగా వరల్డ్ కప్ ను అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్లో 7 పరుగులతో సౌతాఫ్రికాపై విజయం సాధించిన అనంతరం టీమిండియా ప్లేయర్లు అందరూ భావోద్వేగానికి గురైయ్యారు. మరీ ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ సంతోషాన్ని ఆపుకోలేకపోయారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత విరాట్ తన భార్య అనుష్క శర్మకు వీడియో కాల్ చేశాడు.

విరాట్ కోహ్లీ వీడియో కాల్ లో అనుష్క శర్మ, పిల్లలతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఏకంగా కన్నీరు కార్చాడు. 13 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ.. వరల్డ్ కప్ ను అందుకోవడంతో ఒక్కింత భావోద్వేగానికి లోనైయ్యాడు కింగ్ కోహ్లీ. ఇక తన సంతోషాన్ని తన భార్యా, పిల్లలతో పంచుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో విరాట్ ఫ్యాన్స్ సైతం ఎమోషనల్ అవుతున్నారు. కోహ్లీని ఇలా ఎన్నడూ చూడలేదని సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. మరి విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురికావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/