Virat Kohli: చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎవరికీ సాధ్యం కాని ఫీట్​ను సాధించిన స్టార్ బ్యాటర్!

టీమిండియా డాషింగ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఎవరికీ సాధ్యం కాని ఓ ఫీట్​ను సాధించాడీ స్టార్ బ్యాటర్.

టీమిండియా డాషింగ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఎవరికీ సాధ్యం కాని ఓ ఫీట్​ను సాధించాడీ స్టార్ బ్యాటర్.

సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్​లో టీమిండియా ఘోర ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్​లో 245 పరుగులకే భారత జట్టు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆతిథ్య జట్టు.. 408 పరుగులు చేసింది. 163 పరుగులు వెనుకబడిన భారత్.. సెకండ్ ఇన్నింగ్స్​లోనూ ఫెయిలైంది. మన టీమ్ 131 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ (76) ఆఖరి వికెట్​గా వెనుదిరిగాడు. అయితే ఈ మ్యాచ్​లో రన్​ మెషీన్ చరిత్ర సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్ చేస్తూ క్రికెట్​లో ఇప్పటిదాకా ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు విరాట్. ఈ క్యాలెండర్ ఇయర్​లో టెస్టు, వన్డేలు, టీ20ల్లో కలిపి 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి రెండు వేల రన్స్ పూర్తి చేసుకున్న కోహ్లీ అరుదైన ఫీట్​ను నమోదు చేశాడు. మొత్తం 7 క్యాలెండర్ ఇయర్స్​లో 2 వేల పరుగులు బాదిన మొట్టమొదటి ప్లేయర్​గా రికార్డు సృష్టించాడు. తద్వారా శ్రీలంక లెజెండరీ వికెట్ కీపర్, బ్యాటర్ కుమార సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు. 2012లో 2,186 రన్స్ చేసిన విరాట్.. 2014లో 2,286 రన్స్, 2016లో 2,595 రన్స్, 2017లో 2,818 రన్స్, 2018లో 2,735 రన్స్, 2019లో 2,455 రన్స్, 2023లో 2,000 రన్స్ సాధించాడు. మొత్తంగా ఏడుసార్లు క్యాలెండర్ ఇయర్స్​లో ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి క్రికెటర్​గా నిలిచాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో మరో అరుదైన రికార్డునూ అందుకున్నాడు కోహ్లీ. క్రికెట్​లో సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)గా పిలిచే నాలుగు దేశాల మీద కలిపి 7 వేల పరుగులు బాదిన రెండో ప్లేయర్​గా నిలిచాడు విరాట్.

సేనా దేశాలపై 7 వేల రన్స్ చేసిన ఫస్ట్ క్రికెటర్ లెజెండ్​ సచిన్ టెండూల్కర్. ఇప్పుడు ఈ ల్యాండ్​మార్క్​ను అందుకున్న రెండో ప్లేయర్​గా కోహ్లీ నిలిచాడు. ఇక, సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్​లో భారత్ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్​లో కేవలం 131కు ఆలౌట్ అయింది. దీంతో ఇన్నింగ్స్​ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టీమిండియా స్టార్ బ్యాటర్లు అందరూ ఫెయిల్ అయ్యారు. విరాట్ కోహ్లీ ఒక్కడే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒంటరి పోరాటం చేశాడు. అయితే ఇతర బ్యాటర్ల నుంచి సపోర్ట్ దొరక్కపోవడంతో భారత్​కు ఓటమి తప్పలేదు. ఇన్నింగ్స్​ను నిర్మించేందుకు అతడు ఎంత ప్రయత్నించినా అవతలి ఎండ్​లో వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు పెవిలియన్​కు క్యూ కట్టారు. శుబ్​మన్ గిల్ (26) తప్ప మరో భారత బ్యాటర్ రెండంకెల స్కోరు చేయలేదు. మరి.. సౌతాఫ్రికాతో మ్యాచ్​లో కోహ్లీ సాధించిన అరుదైన ఫీట్​పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Sneh Rana: వీడియో: సెన్సేషనల్ క్యాచ్.. యువరాజ్​ను గుర్తుచేసిన లేడీ క్రికెటర్!

Show comments