iDreamPost

Sneh Rana: వీడియో: సెన్సేషనల్ క్యాచ్.. యువరాజ్​ను గుర్తుచేసిన లేడీ క్రికెటర్!

  • Published Dec 28, 2023 | 8:09 PMUpdated Dec 28, 2023 | 8:09 PM

ఓ టీమిండియా విమెన్ క్రికెటర్ సెన్సేషనల్ క్యాచ్​ పట్టి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఈ క్యాచ్​తో లెజెండరీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్​ను గుర్తుచేసింది.

ఓ టీమిండియా విమెన్ క్రికెటర్ సెన్సేషనల్ క్యాచ్​ పట్టి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఈ క్యాచ్​తో లెజెండరీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్​ను గుర్తుచేసింది.

  • Published Dec 28, 2023 | 8:09 PMUpdated Dec 28, 2023 | 8:09 PM
Sneh Rana: వీడియో: సెన్సేషనల్ క్యాచ్.. యువరాజ్​ను గుర్తుచేసిన లేడీ క్రికెటర్!

క్రికెట్​ అంటే చాలా మంది బ్యాటింగ్, బౌలింగ్ అనే అనుకుంటారు. అందుకే స్టార్ బ్యాటర్లు, బౌలర్లకు భారీగా ఫ్యాన్​బేస్ ఉంటుంది. కానీ జెంటిల్మన్ గేమ్​లో ఫీల్డింగ్​కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్​ ఎంత ముఖ్యమో మ్యాచ్​ గెలవాలంటే ఫీల్డింగ్ కూడా అంతే ముఖ్యం. అయితే బ్యాటర్లు, బౌలర్లకు వచ్చినంత పేరు ఫీల్డర్లకు రాదు. ఒకప్పుడు క్రికెట్​లో ఫీల్డింగ్​కు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో దీని ప్రాముఖ్యతను అన్ని టీమ్స్ గుర్తిస్తున్నాయి. అందుకే తమ ఫీల్డింగ్​ను మరింత బలోపేతం చేసుకోవడం మీద ఫోకస్ చేస్తున్నాయి. మెన్స్ క్రికెట్​తో పాటు విమెన్స్ క్రికెట్​లోనూ ఫీల్డింగ్ మీద ఎక్కువ కాన్​సంట్రేషన్​ చేస్తున్నారు. దీని రిజల్ట్ కూడా కనిపిస్తోంది. తాజాగా ఓ టీమిండియా విమెన్ క్రికెటర్ సెన్సేషనల్ క్యాచ్​తో అందర్నీ ఆశ్చర్యపర్చింది.

భారత మహిళ క్రికెటర్ స్నేహా రానా పట్టిన ఆ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇండియా విమెన్, ఆస్ట్రేలియా విమెన్ మధ్య జరిగిన మ్యాచ్​లో ఇది చోటుచేసుకుంది. ఆసీస్ ఓపెనర్ అలీసా హీలీ ఇచ్చిన క్యాచ్​ను అద్భుతమైన రీతిలో ఎడమ వైపునకు గాలిలో దూకుతూ అందుకుంది స్నేహ. క్యాచ్ పట్టిన టైమ్​లో ఆమె శరీరం మొత్తం గాల్లోనే ఉంది. అయినా ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా, బాల్​ చేజారకుండా గట్టిగా హోల్ట్ చేసింది స్నేహ. ఈ క్యాచ్ చూసి బ్యాటర్ అలీసాతో పాటు స్టేడియంలోని ఆడియెన్స్ కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత కోలుకొని చప్పట్లు కొడుతూ స్నేహ ఎఫర్ట్​ను మెచ్చుకున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు.. 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 282 రన్స్ చేసింది.

టీమిండియాలో యషికా భాటియా (49), జెమీమా రోడ్రిగ్స్ (82) రాణించారు. ఆఖర్లో పూజా వస్త్రాకర్ (62) ధనాధన్‌ ఇన్నింగ్స్​తో టీమ్​కు భారీ స్కోరు అంచింది. ఛేజింగ్​కు దిగిన ఆస్ట్రేలియా ప్రస్తుతం 27 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 156 పరుగులతో ఉంది. ఫోబ్ లిచ్​ఫీల్డ్ (71 నాటౌట్), బెత్ మూనీ (8 నాటౌట్) క్రీజులో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్​లో స్నేహా రేణుకా పట్టిన క్యాచ్ హైలైట్ అని చెప్పాలి. దీన్ని చూసిన నెటిజన్స్ ఆమెను లేడీ యువరాజ్ అని పిలుస్తున్నారు. గతంలో భారత పురుషుల జట్టు తరఫున ఆడుతూ యువీ పట్టిన డైవింగ్ క్యాచెస్​ను గుర్తుచేస్తున్నారు. యువీలాగే గాల్లో ఎగురుతూ స్నేహ క్యాచ్ పట్టుకుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. స్నేహా రానా సూపర్బ్ క్యాచ్​ మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Ambati Rayudu: YCPలో చేరిన అంబటి రాయుడు.. పొలిటికల్ కెరీర్​పై కీలక వ్యాఖ్యలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి