Nidhan
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చెలరేగి ఆడుతున్నాడు. సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్కు అతడు ఓ రేంజ్లో పోయించాడు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చెలరేగి ఆడుతున్నాడు. సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్కు అతడు ఓ రేంజ్లో పోయించాడు.
Nidhan
వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చెలరేగి ఆడుతున్నాడు. సౌతాఫ్రికా కెప్టెన్‌కు అతడు ఓ రేంజ్లో పోయించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (9), రిషబ్ పంత్ (0), సూర్యకుమార్ యాదవ్ (3) త్వరగా ఔట్ అవడంతో క్రీజులోకి వచ్చాడు అక్షర్. అయితే వికెట్లు పడ్డాయని మెళ్లిగా ఆడకుండా అటాకింగ్ అప్రోచ్‌ను అమల్లో పెట్టాడు. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ (42 నాటౌట్) యాంకర్ ఇన్నింగ్స్‌తో పాతుకుపోయాడు. అక్షర్ మాత్రం రిస్క్ తీసుకొని భారీ షాట్లు బాదాడు. 27 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు అక్షర్.
ఒక బౌండరీ కొట్టిన అక్షర్.. 3 భారీ సిక్సులు బాదాడు. సఫారీ సారథి మార్క్రమ్ వేసిన 8వ ఓవర్లో అతడు తొమ్మిది పరుగులు చేశాడు. అందులో ఓ భారీ సిక్స్ ఉంది. మిడిల్ స్టంప్ మీద పడి వస్తున్న బంతిని స్లాగ్ స్వీప్ సాయంతో బౌండరీ లైన్ దాటించాడు. అక్షర్ ఇలాంటి షాట్ కొడతాడని ఊహించని మార్క్రమ్ బిత్తరపోయాడు. ఇదేం షాట్ భయ్యా అంటూ షాకయ్యాడు. అయితే అక్షర్ మాత్రం అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత షంసీ, నోకియా లాంటి ఇతర బౌలర్లను కూడా బాదిపారేశాడు. కోహ్లీ కోసం సౌతాఫ్రికా స్కెచ్ వేస్తే అక్షర్ వచ్చి దాన్ని తుత్తునియలు చేశాడు. మరి.. అక్షర్ సిక్సర్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
AXAR PATEL SHOW WITH BAT. 👌 pic.twitter.com/6GyYpV1VQU
— Johns. (@CricCrazyJohns) June 29, 2024