Nidhan
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ ఆడేందుకు భారత జట్టు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్‌లో రోహిత్ సేన కూర్పు ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం..
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ ఆడేందుకు భారత జట్టు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్‌లో రోహిత్ సేన కూర్పు ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం..
Nidhan
సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు టీమిండియా రెడీ అవుతోంది. మొదటి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఓడి బాధలో ఉన్న భారత జట్టు.. ఈసారి ఎలాగైనా గెలవాలని కోరుకుంటోంది. రెండో టెస్టులో నెగ్గి, సిరీస్‌ను డ్రా చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో సఫారీ పేసర్ల ఛాలెంజ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు టీమిండియా బ్యాటర్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తదితర ప్లేయర్స్ ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. టెస్ట్ అరంగేట్రంలోనే అదరగొట్టిన ప్రొటీస్ లెఫ్టార్మ్ స్పీడ్‌స్టర్ బర్గర్‌కు కళ్లెం వేయడం మీద కోహ్లీ ఫోకస్ పెట్టాడు. అందుకే నెట్స్‌లో ఓ బౌలర్ బౌలింగ్‌లో ప్రత్యేకంగా సాధన చేశాడు. మిగతా బ్యాటర్లు కూడా ఎక్స్ట్రా టైమ్ ప్రాక్టీస్ చేశారు. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్‌కు భారత టీమ్ కాంబినేషన్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం..
చివరి టెస్ట్‌కు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ గ్రౌండ్ ఆతిథ్యం ఇస్తోంది. ఇది కూడా బ్యాటర్లకు ఛాలెంజ్ విసిరే వికెట్ కావడం గమనార్హం. ఈ పిచ్ మీద బౌలర్లకు ముఖ్యంగా పేసర్లకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. టాస్ నెగ్గిన టీమ్ తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువ. పేస్‌తో పాటు స్పిన్నర్లకూ న్యూలాండ్స్ వికెట్ నుంచి మద్దతు దొరికే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్‌లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. వెన్ను నొప్పి కారణంగా ఫస్ట్ మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆఖరి టెస్ట్‌లో బరిలోకి దిగడం ఖాయం. అతడు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న తీరును బట్టి పూర్తిగా రికవర్ అయినట్లు కనిపిస్తోంది. శార్దూల్ ఠాకూర్ స్థానంలో జడ్డూ టీమ్‌లోకి రావొచ్చు. మొదటి టెస్ట్‌లో బౌలింగ్‌లో దారుణంగా ఫెయిలయ్యాడు యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ. వికెట్లు తీయకపోగా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు.
రెండో మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణను పక్కన పెట్టడం ఖాయం. అతడి ప్లేసులో అవేశ్ ఖాన్‌ను టీమ్‌లోకి తీసుకురావడం గ్యారెంటీ. ఫస్ట్ టెస్ట్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించాడు. ఒకే వికెట్ తీసినా రన్స్ బాగా కట్టడి చేశాడు. 6 మెయిడిన్లు వేసి ప్రొటీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. కాబట్టి జడ్డూ రూపంలో ఒక స్పిన్నర్ ఉన్నా అశ్విన్‌ను కూడా ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లు వద్దనుకుంటే అశ్విన్ ప్లేస్‌లో యంగ్ పేసర్ ముకేష్ కుమార్ టీమ్‌లోకి వస్తాడు. బ్యాటింగ్ విషయానికొస్తే.. మొదటి టెస్ట్‌లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తప్ప మిగతా వాళ్లందరూ ఫెయిల్ అయ్యారు. కానీ కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్లానింగ్‌ను గమనిస్తే బ్యాటింగ్ యూనిట్లో ఎలాంటి మార్పులు చేయకుండా.. సేమ్ కాంబినేషన్‌తో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరి.. రెండో టెస్ట్‌లో భారత జట్టులో ఇంకేమైనా మార్పులు చేస్తే బాగుంటుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/ముకేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్
ఇదీ చదవండి: David Warner: చివరి మ్యాచ్‌కి ముందు తాను ఎదుర్కొన్న డేంజర్ బౌలర్ ఎవరో చెప్పిన వార్నర్!
📍Cape Town#TeamIndia have arrived for the second #SAvIND Test 👌🏻👌🏻 pic.twitter.com/VGCTdk7yzO
— BCCI (@BCCI) January 1, 2024