iDreamPost

David Warner: చివరి మ్యాచ్‌కి ముందు తాను ఎదుర్కొన్న డేంజర్‌ బౌలర్‌ ఎవరో చెప్పిన వార్నర్‌!

  • Published Jan 02, 2024 | 1:23 PMUpdated Jan 02, 2024 | 1:23 PM

మరో ఆరు రోజుల్లో డేవిడ్‌ వార్నర్‌ టెస్ట్‌ క్రికెట్‌కు పూర్తిగా దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌.. తాను ఎదుర్కొన్న టఫ్‌ బౌలర్‌ ఎవరో రివీల్‌ చేసేశాడు. మరి చాలా మంది బౌలర్లను తన బ్యాటింగ్‌తో భయపెట్టిన వార్నర్‌ను భయపెట్టిన ఆ బౌలర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

మరో ఆరు రోజుల్లో డేవిడ్‌ వార్నర్‌ టెస్ట్‌ క్రికెట్‌కు పూర్తిగా దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌.. తాను ఎదుర్కొన్న టఫ్‌ బౌలర్‌ ఎవరో రివీల్‌ చేసేశాడు. మరి చాలా మంది బౌలర్లను తన బ్యాటింగ్‌తో భయపెట్టిన వార్నర్‌ను భయపెట్టిన ఆ బౌలర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 02, 2024 | 1:23 PMUpdated Jan 02, 2024 | 1:23 PM
David Warner: చివరి మ్యాచ్‌కి ముందు తాను ఎదుర్కొన్న డేంజర్‌ బౌలర్‌ ఎవరో చెప్పిన వార్నర్‌!

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా ఉన్నాడు. బుధవారం నుంచి సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో ప్రారంభం అయ్యే చివరిదైన మూడో టెస్ట్‌.. వార్నర్‌ టెస్ట్‌ కెరీర్‌లో లాస్ట్‌ మ్యాచ్‌ కానుంది. గతంలోనే టెస్ట్‌ క్రికెట్‌కు వార్నర్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్‌తో మ్యాచ్‌తో వార్నర్‌ టెస్ట్‌ కెరీర్‌ ముగియనుంది. ఓపెనర్‌గా ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలోనే గొప్ప ఆటగాడిగా మారిన వార్నర్‌.. టెస్ట్‌ క్రికెట్‌ రూపురేఖల్ని మార్చిన ఆటగాళ్లలో ఒకడిగా నిలుస్తాడు. అయితే.. చివరి టెస్ట్‌కు ముందు వార్నర్‌ ఇన్‌సైడ్‌ టాక్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వార్నర్‌ తన టెస్ట్‌ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఎంతో మంది గొప్ప గొప్ప బౌలర్లను, మిస్టరీ స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు. కఠిన పరిస్థితుల్లో, క్లిష్టమైన పిచ్‌లపై కూడా బ్యాటింగ్‌ చేసి అదరగొట్టాడు. అయితే.. వార్నర్‌ను ఇబ్బంది పెట్టిన బౌలర్లు కూడా ఉన్నారు. ఇదే విషయాన్ని స్వయంగా వార్నర్‌ వెల్లడించాడు. తన చివరి టెస్ట్‌ ఆడేందుకు ముందు తాను ఎదుర్కొన్న టఫ్పెస్ట్‌ బౌలర్‌ ఎవరో వార్నర్‌ రివీల్‌ చేశాడు. తనను ఇబ్బంది పెట్టింది, భయపెట్టింది నిస్సందేహంగా ​సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్‌ డెయిల్‌ స్టెయిన్‌ అని వార్నర్‌ పేర్కొన్నాడు. సౌతాఫ్రికా మాజీ పేసర్‌ డెయిల్‌ స్టెయిన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

david warner afraid of his bowling

తన పేస్‌ పదునుతో ప్రపంచ క్రికెట్‌లోని హేమాహేమీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతన్ని ఎదుర్కొవాలంటే ఒక్క వార్నరే కాదు.. చాలా మంది గొప్ప గొప్ప బ్యాటర్లు వణికిపోయేవారు. అందుకే డెయిల్‌ స్టెయిన్‌ను.. స్టెయిన్‌ గన్‌, స్పీడ్‌ గన్‌ అని పిలిచే వారు. కాగా, వార్నర్‌ తన టెస్ట్‌ క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టుకు ఎంతో చేశాడు. అంత వరకు టెస్ట్‌ క్రికెట్‌ అంటే 40, 50 స్ట్రైక్‌ రేట్‌తో ఆడితేనే చాలా వేగంగా ఆడుతున్నాడు అనే ఫీలింగ్‌లో ఉండేవాళ్లు.. క్రికెటర్లు, క్రికెట్‌ అభిమానుల. కానీ, వార్నర్‌ వచ్చిన దగ్గర్నుంచి.. ఏకంగా 70 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్‌ క్రికెట్‌లో ఒక నూతన వరవడిని సృష్టించాడు. అతని బ్యాటింగ్‌కు ఫిదా కానీ వారు లేరంటే అతిశయోక్తి కాదు. వార్నర్‌ ది లివింగ్‌ లెజెండ్‌. టెస్ట్‌ క్రికెట్‌ అభిమానులు కచ్చితంగా మిస్‌ అయ్యే ప్లేయర్‌ అతను. వార్నర్‌ టెస్ట్‌ కెరీర్‌ ముగిస్తుండటం, అలాగే తాను ఎదుర్కొన్న వారిలో స్టెయిన్‌ టఫ్‌ బౌలర్‌ అని పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి