iDreamPost

ఓటమి బాధలో ఉన్న పాక్​కు మరో షాక్.. ఇకపై వారికి కష్టమే!

  • Author singhj Published - 10:13 AM, Tue - 12 September 23
  • Author singhj Published - 10:13 AM, Tue - 12 September 23
ఓటమి బాధలో ఉన్న పాక్​కు మరో షాక్.. ఇకపై వారికి కష్టమే!

ఆసియా కప్-2023లో టీమిండియా దూసుకెళ్తోంది. సూపర్​-4 దశలో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో భారత జట్టు ఏకంగా 228 రన్స్ తేడాతో గెలిచి.. ఫైనల్ అవకాశాలను గణనీయంగా మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్​లో ఆదివారం టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియా వర్షం వల్ల మ్యాచ్ నిలిచేపోయే టైమ్​కు 147/2తో నిలవగా.. రిజర్వ్ డే అయిన సోమవారం ఇన్నింగ్స్​ను కొనసాగించి మరో వికెట్ కోల్పోకుండా ఏకంగా 356 పరుగుల భారీ స్కోరు చేసింది. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (122 నాటౌట్)తో పాటు చాన్నాళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్న కేఎల్ రాహుల్ (111 నాటౌట్) అజేయ శతకాలతో అదరగొట్టారు.

బౌలింగ్​లో​ ఫ్లాప్​ అయిన పాకిస్థాన్ బ్యాటింగ్​లోనైతే అట్టర్ ఫ్లాప్ అయింది. ఛేజింగ్​లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/25) ధాటికి దాయాది జట్టు 128 రన్స్​కే కుప్పకూలింది. ఇంజ్యురీ కారణంగా పేసర్లు హ్యారిస్ రౌఫ్, నసీమ్ షా బ్యాటింగ్​కు రాకపోవడంతో 8 వికెట్లకే ఆ టీమ్ ఇన్నింగ్స్ ముగించింది. పాక్​పై భారీ విక్టరీతో ఊపు మీదున్న భారత్.. తన తర్వాతి సూపర్-4 మ్యాచ్​లో మంగళవారం శ్రీలంకను ఢీకొంటుంది. ఇదిలా ఉంటే.. టీమిండియాపై ఓటమి బాధ నుంచి కోలుకోక ముందే పాకిస్థాన్​కు మరో బిగ్​షాక్ తగిలినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్​ పేసర్లు హ్యారీస్ రౌఫ్, నసీం షా గాయం కారణంగా ఆసియా కప్-2023 మొత్తానికి దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియాతో మ్యాచ్​ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా వీళ్లిద్దరూ గాయపడ్డారు.

రౌఫ్ పూర్తిగా రిజర్వ్ డే నాడు గ్రౌండ్​లోకి అడుగుపెట్టలేదు. నసీం షా బ్యాటింగ్​ చేయలేదు. ప్రధాన పేసర్లు గాయాలపాలవ్వడంతో వీళ్లకు బ్యాకప్​గా యువ పేసర్లు షానవాజ్ దహానీ, జమాన్ ఖాన్​లకు పాక్ క్రికెట్ పిలుపునిచ్చింది. ఈ ఇద్దరు యంగ్​స్టర్స్ మంగళవారం పాక్ టీమ్​తో కలవనున్నారు. రౌఫ్, నసీం గాయంపై పాక్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటన చేసింది. వీళ్లిద్దరూ మెడికల్ ప్యానెల్ పరిశీలనలో ఉంటారని తెలిపింది. వాళ్ల గాయాలు అంత తీవ్రమైనవి కాదని చెప్పింది. అయితే త్వరలో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో రిస్క్ చేయకూడదని అనుకుంటున్నట్లు పేర్కొంది. ఒకవేళ షానవాజ్ దహానీ, జమాన్ ఖాన్​లను భర్తీ చేయాలనుకుంటే ఏసీసీ టెక్నికల్ కమిటీ అనుమతి తీసుకుంటామని పీసీబీ వివరించింది.

ఇదీ చదవండి: VIDEO: హారీస్ రౌఫ్ ఓవరాక్షన్​కు బుద్ధి చెప్పిన రోహిత్-కోహ్లీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి