ఆసియా కప్-2023లో ప్రతిష్టాత్మక పోరుకు సర్వం సిద్ధమైంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో మొదలవ్వనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. గత ఆసియా కప్‌లో గ్రూప్ దశలో పాక్‌పై ఇండియా నెగ్గగా.. సూపర్-4 దశలో మాత్రం పాకిస్థాన్‌దే పైచేయి అయింది. దీంతో దాయాదుల మధ్య ఇవాళ్టి పోరులో ఎవరు గెలుస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక, పాక్‌తో మ్యాచ్ అంటే చాలు.. విరాట్ కోహ్లీ చెలరేగుతాడు. గతేడాది టీ20 ప్రపంచ కప్‌లో పాక్‌పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ను ఎవరూ మర్చిపోలేరు.
గత టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ మీద మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఆ మ్యాచ్‌లో దాయాది జట్టు స్టార్ పేసర్ హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లీ బాదిన భారీ సిక్సర్ ఇప్పటికీ ఫ్యాన్స్ కళ్ల ముందు కదలాడుతోంది. ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ ఇండియా-పాకిస్థాన్‌లు తలపడలేదు. చాన్నాళ్ల తర్వాత ఆసియా కప్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. శనివారం శ్రీలంకలోని పల్లెకెలే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
కీలకమైన ఈ మ్యాచ్ కోసం స్టేడియంలో ప్రాక్టీస్ చేయడానికి టీమిండియా, పాకిస్థాన్ జట్లు వచ్చాయి. రెండు జట్లూ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని చూసిన పాక్ పేసర్ హ్యారిస్ రవూఫ్ అతడి దగ్గరకు వచ్చి కలిశాడు. విరాట్‌ను రవూఫ్ కౌగిలించుకున్నాడు. కోహ్లీ కూడా పాక్ పేసర్‌ను నవ్వుతూ పలకరించాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ గతేడాది వరల్డ్ కప్‌లో పాక్ పై ఆడిన ఇన్నింగ్స్‌ను రిపీట్ చేయాలని అంటున్నారు. రవూఫ్ బౌలింగ్‌లో మళ్లీ రెచ్చిపోయి ఆడాలని కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి: ఇండో-పాక్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. వాన పడితే ఏంటి పరిస్థితి?
King Kohli meets Haris Rauf ahead of the India Vs Pakistan clash. pic.twitter.com/ILPaL6Jk3a
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 1, 2023