iDreamPost

భారత్, పాకిస్థాన్​ మ్యాచ్​కు అంతా రెడీ.. వర్షం పడితే పరిస్థితి ఏంటి?

  • Author singhj Published - 09:22 AM, Sat - 2 September 23
  • Author singhj Published - 09:22 AM, Sat - 2 September 23
భారత్, పాకిస్థాన్​ మ్యాచ్​కు అంతా రెడీ.. వర్షం పడితే పరిస్థితి ఏంటి?

భారత్-పాకిస్థాన్ మ్యాచ్​ కోసం ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానుల నిరీక్షణకు ఇవాళ్టితో తెరపడనుంది. గతేడాది టీ20 ప్రపంచ కప్ అనంతరం ఇండియా-పాకిస్థాన్ జట్లు తలపడుతున్న తొలి మ్యాచ్ ఇదే కానుంది. దీంతో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఆసియా కప్​లో పాక్​పై గ్రూప్ దశలో గెలిచిన భారత్.. సూపర్​-4లో మాత్రం ఓటమిపాలైంది. దీంతో ఎలాగైనా దాయాదిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. ఈమధ్య పాక్ జట్టు మరింత బలంగా తయారైన నేపథ్యంలో ఈ మ్యాచ్​లో టీమిండియా గెలుపు అంత ఈజీ కాదనిపిస్తోంది.

కీలకమైన ఇండో-పాక్ సమరానికి ముందు మాటల యుద్ధం కూడా హైలైట్ అవుతోంది. ఆసియా కప్​తో పాటు రాబోయే వన్డే వరల్డ్ కప్​లోనూ భారత్​ను ఓడిస్తామని పాక్ మాజీలు, ప్లేయర్లతో పాటు ఫ్యాన్స్ మాటలతో రెచ్చిపోతున్నారు. అయితే ఇరు జట్ల మేనేజ్​మెంట్ మ్యాచ్​లో ఎలా నెగ్గాలా అని వ్యూహాలు పన్నడంలో బిజీ అయిపోయాయి. కాగా, మ్యాచ్​కు సర్వం సిద్ధమైన తరుణంలో వరుణుడు అందోళన కలిగిస్తున్నాడు. భారత్-పాక్ మ్యాచ్​కు వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో అభిమానుల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చూద్దాం.. హైబ్రిడ్ మోడల్​ను అనుసరించి ఇండో-పాక్ మ్యాచ్​కు శ్రీలంకలోని పల్లెకెలే ఆతిథ్యం ఇస్తోంది.

శ్రీలంకలో ప్రస్తుతం ఓ మోస్తరుగా వానలు పడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం మ్యాచ్ సమయానికి వర్షం పడే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలవ్వనుంది. ఒకవేళ వాన ఆటంకం కలిగిస్తే మ్యాచ్​ను టీ20 ఫార్మాట్​లో నిర్వహిస్తారు. మ్యాచ్ అసలే సాధ్యం కాకపోతే ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్ చేరుతుంది. అదే జరిగితే పాకిస్థాన్ ఎలాంటి సమీకరణాలు లేకుండా సూపర్-4 దశకు చేరుకుంటుంది. మరో బెర్త్ కోసం నేపాల్​తో భారత్ అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది. మరి.. మంచి బజ్ నెలకొన్న ఇండో-పాక్ మ్యాచ్​కు వరుణుడు కరుణిస్తాడో లేకపోతే ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లుతాడో చూడాలి.

ఇదీ చదవండి: భారత్​తో మ్యాచ్.. తుది జట్టును ప్రకటించిన పాక్! మరి షాహిన్ అఫ్రిది?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి