పాకిస్థాన్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేసిన ఇర్ఫాన్‌ పఠాన్‌!

  • Author singhj Published - 03:39 PM, Tue - 12 September 23
  • Author singhj Published - 03:39 PM, Tue - 12 September 23
పాకిస్థాన్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేసిన ఇర్ఫాన్‌ పఠాన్‌!

పాకిస్థాన్​తో మ్యాచ్​కు ముందు భారత జట్టుపై ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు నెలకొన్నాయి. దాయాది పేస్ అటాక్​ను తట్టుకొని మన బ్యాట్స్​మెన్ నిలబడగలరా? అని అన్నారు. అలాగే జట్టు కూర్పు సరిగ్గా లేదన్నారు. వరల్డ్ కప్​కు ముందు ఇలాంటి జట్టా? అని కొందరు సీనియర్ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అయితే.. వీటన్నింటికీ అద్భుతమైన విజయంతో సమాధానం చెప్పింది టీమిండియా. ఆసియా కప్-2023 సూపర్-4 మ్యాచ్​లో పాక్​పై ఘన విజయాన్ని భారత జట్టు నమోదు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ రాణించి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వాన కారణంగా రెండ్రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ రోహిత్ సేనకు పరీక్షగా నిలిచింది.

మ్యాచ్​కు ముందు నెలకొన్న అనుమానాలు, ప్రశ్నలను భారత జట్టు పటాపంచలు చేసింది. వన్డేల్లో నంబర్ 2 ప్లేసులో ఉన్న పాక్​ను చిత్తుగా ఓడించింది. ఆ టీమ్​కు అసలు పోరాడేందుకు కూడా ఏ దశలోనూ ఛాన్స్ ఇవ్వలేదు. పాక్​ జట్టు బలంగా భావించే పేస్ అటాక్​ను మన బ్యాటర్లు తుత్తునియలు చేశారు. ఓపెనర్ శుబ్​మన్ గిల్ అయితే స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది బౌలింగ్​లో బౌండరీల మీద బౌండరీలు కొట్టాడు. మరో ఓపెనర్ రోహిత్ స్పిన్నర్​ షాదాబ్​ను టార్గెట్ చేసుకొని భారీగా రన్స్ పిండుకున్నాడు. వీళ్లు స్వల్ప విరామంలో ఔట్ అవ్వడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రాహుల్ కాసేపు నెమ్మదిగా ఆడారు. కానీ కుదురుకున్నాక ప్రతి బౌలర్​ను ఉతికి ఆరేశారు. ఇన్నింగ్స్ చివర్లో కోహ్లీ కొట్టిన ఫోర్లు, సిక్సులు హైలైట్ అనే చెప్పాలి.

ఛేదనకు దిగిన పాకిస్థాన్​.. భారత బౌలర్ల ముందు నిలబడలేకపోయింది. ప్రత్యర్థి జట్టు సారథి బాబర్ ఆజంను హార్దిక్ క్లీన్​బౌల్డ్ చేశాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్​కు వచ్చాక పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్​కు క్యూ కట్టారు. కుల్దీప్ 5 వికెట్లతో ప్రత్యర్థి వెన్ను విరిచాడు. ఈ మ్యాచ్​లో ఓటమితో పాక్​ టీమ్​పె పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్​కు ముందు భారత జట్టును టార్గెట్ చేసుకుంటూ పాక్ సీనియర్ ప్లేయర్లు కామెంట్స్ చేశారు. టీమిండియాకు ఓటమి తప్పదని అన్నారు. అయితే తీరా మ్యాచ్​లో తమ జట్టు ఘోర ఓటమి పాలవ్వడంతో వాళ్లంతా సెలైంట్ అయ్యారు. ఈ నేపథ్యంలో పాక్​ను ఓ రేంజ్​లో ట్రోల్ చేశాడు భారత మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. మ్యాచ్​లో పాక్ చిత్తు చిత్తుగా ఓడటంతో అంతటా నిశ్శబ్దం ఆవరించిందని ఎద్దేవా చేశాడు . ఈ ఓటమితో పాక్​ ఫ్యాన్స్ టీవీలతో పాటు తమ ఫోన్లను కూడా పగలగొట్గినట్లున్నారని పఠాన్ ట్రోల్ చేశాడు.

ఇదీ చదవండి: ఈ విజయానికి వాళ్లే కారణం: రోహిత్ శర్మ

Show comments