iDreamPost

టాస్ ఓడితే టీమిండియాకు ఓటమి తప్పదు.. పాక్ మాజీ క్రికెటర్ వార్నింగ్!

  • Author singhj Published - 12:18 PM, Sat - 2 September 23
  • Author singhj Published - 12:18 PM, Sat - 2 September 23
టాస్ ఓడితే టీమిండియాకు ఓటమి తప్పదు.. పాక్ మాజీ క్రికెటర్ వార్నింగ్!

భారత్, పాకిస్థాన్ జట్లు దాదాపు ఏడాది తర్వాత తలపడనున్నాయి. ఆసియా కప్-2023లో భాగంగా జరిగే గ్రూప్ మ్యాచ్​లో దాయాది జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చూడటానికి రెండు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎవరు గెలుస్తారని తెగ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లెజెండరీ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు అక్తర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. భారత్​, పాక్​ మ్యాచ్​కు శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్​లో ఒకవేళ పాకిస్థాన్ టాస్ గెలిస్తే భారత్​కు తిప్పలు తప్పవని అక్తర్ హెచ్చరించాడు.

పాక్ టాస్ నెగ్గితే భారత్​కు ముప్ప తప్పదన్న అక్తర్.. ఒకవేళ టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేస్తే వాళ్లదే పైచేయి అని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్​లో అన్నింటి కంటే టాస్ చాలా కీలకమన్నాడు. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు కొన్ని రోజుల కింద ఇదే స్టేడియంలో తలపడ్డాయి. అప్పుడు మొదట బ్యాటింగ్​కు దిగిన బంగ్లా ఆశించినంతగా భారీ స్కోరు చేయలేకపోయింది. అయితే రెండో ఇన్నింగ్స్​లో మాత్రం ఆ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలోనే భారత్​-పాక్ మ్యాచ్​లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తుందన్నాడు షోయబ్ అక్తర్. అలాగే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పుకొచ్చాడు.

‘ఈ మ్యాచ్​లో ఒకవేళ పాకిస్థాన్ గనుక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్​కు దిగితే.. వాళ్లు భారత్​ను చిత్తు చేస్తారు. అదే టైమ్​లో ఇండియా గనుక టాస్ గెలిస్తే.. పాక్​కు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే, ఇక్కడ పిచ్ పూర్తిగా సెటిల్ అయినట్లు కనిపించడం లేదు. ఈ పిచ్ మీద రెండో ఇన్నింగ్స్​లో బంతి అంత సులువుగా బ్యాట్ పైకి రావడం లేదు. ఈ మ్యాచ్​లో పేస్ బౌలర్లు కీలకం కానున్నారు. భారత్ తప్పకుండా కుల్దీప్ యాదవ్​ను ఆడించాలి. అతడు చాలా నైపుణ్యం కలిగిన ప్లేయర్. బుమ్రా, షమీ, సిరాజ్​లు ఎలాగూ టీమ్​లో ఉంటారు’ అని అక్తర్ వ్యాఖ్యానించాడు.

ఇదీ చదవండి: PAKతో మ్యాచ్​.. కోహ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలంటున్న ఫ్యాన్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి