iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీ అలాంటోడు కాదు..​ BCCI సెక్రటరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Feb 15, 2024 | 3:16 PM Updated Updated Feb 15, 2024 | 8:10 PM

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అలాంటోడు కాదన్నాడు జై షా. సీనియర్ బ్యాటర్​కు మద్దతుగా నిలిచాడు బీసీసీఐ సెక్రటరీ.

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అలాంటోడు కాదన్నాడు జై షా. సీనియర్ బ్యాటర్​కు మద్దతుగా నిలిచాడు బీసీసీఐ సెక్రటరీ.

  • Published Feb 15, 2024 | 3:16 PMUpdated Feb 15, 2024 | 8:10 PM
Virat Kohli: కోహ్లీ అలాంటోడు కాదు..​ BCCI సెక్రటరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

భారత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంత ఫిట్​గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత పని ఒత్తిడి ఉన్నా, సిరీస్​ల వెంట సిరీస్​లు ప్లాన్ చేసినా కోహ్లీ మాత్రం ఆడుతూనే ఉంటాడు. అలుపెరుగని షెడ్యూల్స్​ను కూడా బాగా ప్లాన్ చేసుకుంటాడు. ఎలాంటి ఇంజ్యురీ లేకుండా 15 ఏళ్లుగా సక్సెస్​ఫుల్​గా టీమ్​లో కంటిన్యూ అవుతున్నాడు. అలాంటోడు ఈ మధ్య వరుసగా మ్యాచులకు దూరమవుతున్నాడు. పర్సనల్ రీజన్స్ వల్ల ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్ మధ్యలో నుంచి వెళ్లిపోయిన విరాట్.. ఇదే కారణంతో ఇంగ్లండ్​తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అసలు కోహ్లీకి ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కింగ్ కావాలనే లీవ్ తీసుకున్నాడంటూ కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై బీసీసీఐ సెక్రటరీ జై షా రియాక్ట్ అయ్యాడు. కోహ్లీ అలాంటోడు కాదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు షా.

పర్సనల్ రీజన్స్ వల్ల టీమ్​కు దూరమైన కోహ్లీకి షా అండగా నిలిచాడు. ఎలాంటి కారణం లేకుండా విరాట్ లీవ్ తీసుకోడని.. అతడు అలాంటి వ్యక్తి కాదన్నాడు. ఈ టైమ్​లో కోహ్లీకి అందరూ అండగా ఉండాలని స్పష్టం చేశాడు. ‘ఏ కారణం లేకుండా కోహ్లీ లీవ్ అడగడు. గత పదిహేను ఏళ్లుగా అతడు నిరంతరం క్రికెట్​ ఆడుతూనే వస్తున్నాడు. అలాంటోడు సెలవు కావాలని అడడంలో తప్పేమీ లేదు. అది అతడికి ఉన్న హక్కు. మనమంతా కోహ్లీ లాంటి ఆటగాళ్లకు మద్దతుగా ఉండాలి. వారి మీద నమ్మకం ఉంచాలి’ అని జై షా చెప్పుకొచ్చాడు. కోహ్లీ విషయంతో పాటు భారత క్రికెటర్ల గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బీసీసీఐ సెక్రటరీ. టీమిండియాకు దూరంగా ఉన్న ఏ ప్లేయర్ అయినా డొమెస్టిక్ క్రికెట్​లో ఆడాల్సిందేనని స్పష్టం చేశాడు.

భారత టీమ్ ఆడే సిరీస్​లకు సెలక్ట్ కానివారు, ఇతర కారణాల వల్ల జట్టుకు దూరంగా ఉన్నవారు దేశవాళీల్లో ఆడాల్సిందేనని జై షా చెప్పారు. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ప్రతి ప్లేయర్ ఫిట్​నెస్ నిరూపించుకోవాల్సిందేనని తెలిపారు. టీమ్​కు దూరంగా ఉన్నవారు, సెలక్ట్ అవ్వని వారు డొమెస్టిక్ క్రికెట్​లో ఆడితే ఫామ్, ఫిట్​నెస్​ లెవల్స్ మెరుగుపడతాయని తెలిపారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉండే ప్లేయర్లు కూడా రంజీ ట్రోఫీ లాంటి డొమెస్టిక్ టోర్నీల్లో తప్పక ఆడాల్సిందేనని క్లారిటీ ఇచ్చారు షా. బీసీసీఐ కాంట్రాక్ట్ కలిగిన ఏ క్రికెటర్ అయినా సరే దేశవాళ్లీల్లో ఆడాల్సిందేనని వెల్లడించారు. అయితే గాయంతో బాధపడుతున్న వారి విషయంలో ఆడాలో వద్దో వారి నిర్ణయానికే వదిలేస్తామని పేర్కొన్నారు. మరి.. కోహ్లీకి షా మద్దతుగా నిలవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Ishan Kishan: ఇషాన్​కు ఇంకో ఆప్షన్ లేదు.. వార్నింగ్ ఇచ్చిన BCCI సెక్రటరీ!