Nidhan
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడతాడా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. అయితే తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడతాడా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. అయితే తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది.
Nidhan
ఇంగ్లండ్‌తో మొదటి రెండు టెస్టులు ముగియడంతో మూడో మ్యాచ్‌పై టీమిండియా ఫోకస్ పెడుతోంది. ఉప్పల్ ఆతిథ్యం ఇచ్చిన మొదటి టెస్టులో ఇంగ్లీష్ టీమ్ నెగ్గగా.. వైజాగ్‌లో రోహిత్ సేనను విజయం వరించింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు జరగనుంది. అయితే మిగిలిన మూడు మ్యాచులకు సంబంధించిన టీమ్ సెలక్షన్ ఆలస్యమైంది. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కమ్‌బ్యాక్ ఇస్తాడా? గాయంతో రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగొస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి దీనిపై క్లారిటీ వచ్చేసింది. మిగిలిన మూడు టెస్టు మ్యాచులకు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అనుకున్నట్లుగానే కోహ్లీ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంజ్యురీ కారణంగా రెండో టెస్టుకు దూరమైన జడేజా, రాహుల్ తిరిగి టీమ్‌లోకి వచ్చారు.
ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా మిగతా టెస్టులకు వచ్చేశాడు. కొత్తగా ఆకాశ్ దీప్ కూడా టెస్టు టీమ్‌కు సెలక్ట్ అయ్యాడు. రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇంజ్యురీతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయలేదు. ఇషాన్ కిషన్‌తో పాటు మహ్మద్ షమీని పరిగణనలోకి తీసుకోలేదు. సెకండ్ టెస్టు స్క్వాడ్‌లో ఉన్న అవేశ్ ఖాన్, సౌరభ్ కుమార్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ సందర్భంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై బీసీసీఐ ఆసక్తికర కామెంట్ చేసింది. పర్సనల్ రీజన్స్‌తో టెస్టు సిరీస్‌కు అతడు దూరమయ్యాడని తెలిపింది. కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని వెల్లడించింది. రాహుల్, జడేజా విషయంలోనూ తొందరపాటు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది.
రాజ్‌కోట్ టెస్టు నాటికి క్లియరెన్స్ వస్తేనే జడేజా, రాహుల్‌ను తుదిజట్టులో ఆడించే అవకాశాలు ఉంటాయని తెలిపింది బీసీసీఐ. ఈ మేరకు బీసీసీఐ డాక్టర్ల బృందం నుంచి రిపోర్టులు రావాల్సి ఉందని స్పష్టం చేసింది. అయితే కోహ్లీ కమ్‌బ్యాక్ ఇస్తాడని అనుకుంటే సిరీస్ మొత్తానికి దూరమవడంపై అతడి అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జేమ్స్ అండర్సన్ లాంటి బౌలర్‌తో కోహ్లీ కౌంటర్ చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తే.. చివరికి నిరాశే మిగిలిందని కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ నిర్ణయానికి తాము మద్దతు ఇస్తామని.. తన అవసరం కుటుంబానికి ఉంది కాబట్టే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటాడని చెబుతున్నారు. ఇక, సిరీస్‌లోని మూడో టెస్టు రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మొదలవనుంది. నాలుగో టెస్టు ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో, ఐదో మ్యాచ్ మార్చి 7న ధర్మశాలలో ప్రారంభం కానున్నాయి. మరి.. ఇంగ్లండ్‌తో సిరీస్ నుంచి కోహ్లీ తప్పుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli won’t be participating in the Test series against England due to personal reasons.
– Come back stronger, King …!!! 👑 pic.twitter.com/3BISk6e1fv
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 10, 2024
India’s squad for the last 3 Tests:
Rohit (C), Bumrah, Jaiswal, Gill, KL*, Patidar, Sarfaraz, Jurel, Bharat, Ashwin, Jadeja*, Axar, Sundar, Kuldeep, Siraj, Mukesh and Akash Deep.
– KL and Jadeja participation depends on their fitness.
– Virat Kohli opted out.
– Iyer ruled out. pic.twitter.com/CmPEEDkfV4— Mufaddal Vohra (@mufaddal_vohra) February 10, 2024