iDreamPost
android-app
ios-app

IND vs ENG: భారత్​పై నెగ్గాలంటే ఆ గండాన్ని దాటాలి.. పనేసార్ షాకింగ్ కామెంట్స్!

  • Published Jan 21, 2024 | 6:33 PM Updated Updated Jan 21, 2024 | 6:33 PM

టీమిండియాను ఓడించడం అంత ఈజీ కాదంటున్నాడు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ పనేసార్. భారత్​పై నెగ్గాలంటే ఆ ఒక్క గండాన్ని దాటాల్సి ఉంటుందని చెప్పాడు.

టీమిండియాను ఓడించడం అంత ఈజీ కాదంటున్నాడు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ పనేసార్. భారత్​పై నెగ్గాలంటే ఆ ఒక్క గండాన్ని దాటాల్సి ఉంటుందని చెప్పాడు.

  • Published Jan 21, 2024 | 6:33 PMUpdated Jan 21, 2024 | 6:33 PM
IND vs ENG: భారత్​పై నెగ్గాలంటే ఆ గండాన్ని దాటాలి.. పనేసార్ షాకింగ్ కామెంట్స్!

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్​లో ఈ నెల 24న జరగనున్న మొదటి టెస్ట్​తో ఈ సిరీస్ స్టార్ట్ కానుంది. ఈ సిరీస్​ను ఇటు ఆతిథ్య ఇండియాతో పాటు అటు పర్యాటక ఇంగ్లీష్ టీమ్ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్స్​కు చేరుకోవాలంటే ప్రతి సిరీస్, ప్రతి మ్యాచ్ ఎంతో కీలకంగా మారాయి. అందుకే ఎలాగైనా నెగ్గాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే ఇంగ్లండ్ జట్టు మాత్రం స్లెడ్జింగ్​తో భారత్​ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. గత దశాబ్దంలో ఐసీసీ టోర్నీల్లో ఒక్కసారి కూడా కప్పు గెలవకపోవడాన్ని టార్గెట్​గా చేసుకొని ఇంగ్లీష్ మాజీ క్రికెటర్లు విమర్శలకు దిగుతున్నారు. అదే సమయంలో భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మీద కూడా విరుచుకుపడుతున్నారు. ఆ దేశ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసార్ హిట్​మ్యాన్​పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని.. అతడు అద్భుతమైన బ్యాటర్ అని మెచ్చుకున్నాడు పనేసార్. భారత్​లో టెస్ట్ సిరీస్ నెగ్గాలంటే హిట్​మ్యాన్ గండాన్ని ఇంగ్లండ్ దాటాల్సి ఉంటుందన్నాడు. ‘రోహిత్​ శర్మకు బౌలింగ్ చేయడం చాలా కష్టం. అతడి షాట్ సెలక్షన్ సూపర్బ్​గా ఉంటుంది. రోహిత్ ఖాతాలో చాలా రకాల షాట్లు ఉన్నాయి. స్వదేశంలోని స్పిన్ పిచ్​ల మీద బౌలర్లపై అటాక్​ చేసేందుకు రోహిత్ వద్ద ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. అతడు కచ్చితంగా ఇంగ్లండ్ బౌలర్ల మీద అటాక్ చేస్తాడు. అతడు చాలా ప్రమాదకారి’ అని పనేసార్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లీష్ టీమ్ బౌలర్లపై విరుచుకపడి వాళ్లను వెనక్కి నెట్టేందుకు హిట్​మ్యాన్ తప్పకుండా ప్రయత్నిస్తాడని తెలిపాడు. సిరీస్ నెగ్గాలంటే అతడ్ని అడ్డుకోవాలని ఇంగ్లండ్​కు సూచించాడు. భారత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి కూడా పనేసార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీకి ఈగో ఎక్కువని.. అతడి ఈగోతో ఆడుకోవాలన్నాడు.

విరాట్ కోహ్లీకి ఈగో ఎక్కువ. అదే ఈగోతో ఆడుకొని మానసికంగా అతడ్ని ఇబ్బంది పెట్టాలి. ఐసీసీ టోర్నీ ఫైనల్స్​లో వరుసగా ఓడిపోతోంది భారత్. కాబట్టి వాళ్లు చోకర్స్ అనేది గుర్తుచేయాలి. ప్రస్తుత ఇంగ్లండ్ జట్టులోని బెన్ స్టోక్స్ వన్డే వరల్డ్ కప్​తో పాటు టీ20 ప్రపంచ కప్ నెగ్గాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుచేస్తూ కోహ్లీని స్లెడ్జ్ చేయాలి. ఇది విరాట్​ను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది’ అని పనేసార్ చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్, కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ చేసిన వ్యాఖ్యల మీద భారత అభిమానులు సీరియస్ అవుతున్నారు. విరాట్, హిట్​మ్యాన్​ను ఆపడం ఇంగ్లండ్ తరం కాదని.. వాళ్లు ఒట్టి చేతులతో స్వదేశానికి తిరుగు పయనం కావాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీతో మీరు ఆడుకోవడం కాదు.. అతడే మీ జట్టు బౌలర్లను చెడుగుడు ఆడుకుంటాడని చెబుతున్నారు. మరి.. రోహిత్, కోహ్లీపై పనేసార్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.