iDreamPost
android-app
ios-app

IND vs ENG: ఇంగ్లండ్​తో రెండో టెస్టు.. 3 మార్పులతో బరిలోకి టీమిండియా!

  • Published Feb 01, 2024 | 8:17 AM Updated Updated Feb 01, 2024 | 8:17 AM

వైజాగ్ టెస్ట్​కు అంతా సిద్ధమైంది. ఇంగ్లండ్​తో మరోమారు తాడోపేడో తేల్చుకునేందుకు టీమిండియా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

వైజాగ్ టెస్ట్​కు అంతా సిద్ధమైంది. ఇంగ్లండ్​తో మరోమారు తాడోపేడో తేల్చుకునేందుకు టీమిండియా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 01, 2024 | 8:17 AMUpdated Feb 01, 2024 | 8:17 AM
IND vs ENG: ఇంగ్లండ్​తో రెండో టెస్టు.. 3 మార్పులతో బరిలోకి టీమిండియా!

విశాఖపట్నం టెస్టుకు సర్వం సిద్ధమైంది. భారత్-ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నాడు రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్​కు వైజాగ్​లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఉప్పల్ టెస్టులో అనూహ్య ఓటమి ఎదురవడంతో డీలాపడ్డ భారత్ ఈ మ్యాచ్​తో బౌన్స్​ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. ఇంగ్లీష్ టీమ్​ను చిత్తు చేయాలని చూస్తోంది. బజ్​బాల్ క్రికెట్​తో తమను ఎదురుదెబ్బ తీసిన ప్రత్యర్థికి గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తోంది. అందుకు ఈసారి స్పిన్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ పిచ్​ను స్పిన్నర్లకు అనుకూలంగా తయారు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ టెస్టుకు కూడా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. గాయాల వల్ల స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

వైజాగ్ పిచ్ గతంలో బ్యాటర్లతో పాటు స్పిన్నర్లు, పేసర్లకు కూడా బాగా సహకరించేంది. కానీ ఈసారి టర్నింగ్ ట్రాక్​ను తయారు చేశారని తెలుస్తోంది. దీంతో తాము నలుగురు స్పిన్నర్లతో వెళ్లేందుకు ఏమాత్రం భయపడమని ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్టేట్​మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియా కూడా అదే సూత్రాన్ని ఫాలో అవడం ఖాయంలా కనిపిస్తోంది. బ్యాటింగ్ విషయానికొస్తే.. ఓపెనింగ్​లో​ కెప్టెన్​ రోహిత్ శర్మకు తోడుగా యంగ్​స్టర్ యశస్వి జైస్వాల్ దిగుతాడు. కోహ్లీ లేడు కాబట్టి ఫస్ట్ డౌన్​లో శుబ్​మన్ గిల్ ఆడటం పక్కా. ఆ తర్వాత సెకండ్ డౌన్​లో శ్రేయస్ అయ్యర్ దిగుతాడు. మిడిలార్డర్ భారాన్ని మోసే రాహుల్ లేకపోవడంతో అతడి ప్లేసులో ఎవరు ఆడతారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. రజత్ పాటిదార్​తో పాటు యంగ్ సెన్సేషన్ సర్ఫరాజ్‌ ఖాన్​లు ఈ స్థానం కోసం పోటీపడుతున్నారు. కానీ సర్ఫరాజ్​ సూపర్ ఫామ్​లో ఉండటంతో అతడ్ని ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

india 2nd test

వికెట్ కీపింగ్ బాధ్యతల్ని కేఎస్ భరత్ చూసుకుంటాడు. అతడి తర్వాత స్పిన్ ఆల్​రౌండర్లుగా అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ఆడతారు. జడేజా దూరమయ్యాడు కాబట్టి అతడి ప్లేసులో యంగ్ ఆల్​రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడటం ఖాయం. పేస్ బౌలింగ్ బాధ్యతల్ని జస్​ప్రీత్ బుమ్రా చూసుకుంటాడు. అయితే అతడితో పాటు మరో పేసర్​గా మహ్మద్ సిరాజ్​ను ఆడిస్తారా లేదా స్పిన్ వికెట్ అనే వార్తల నేపథ్యంలో కుల్దీప్ యాదవ్​ను మెయిన్ టీమ్​లోకి తీసుకుంటారా అనేది చూడాలి. సిరాజ్ మొదటి టెస్టులో ఫెయిలయ్యాడు. వికెట్లు తీయకపోవడంతో పాటు రన్స్ కూడా ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో బాల్ మొదటి రోజు నుంచి టర్న్ అవుతుందని భావిస్తే అతడ్ని బెంచ్​కే పరిమితం చేస్తారు. అయితే మ్యాచ్​కు ముందు పిచ్​ను పూర్తిగా పరిశీలించాకే సిరాజ్, కుల్దీప్​ల్లో ఎవర్ని ఆడిస్తారనేది డిసైడ్ అవ్వొచ్చు. మరి.. వైజాగ్ టెస్టులో భారత ప్లేయింగ్ ఎలెవన్​లో ఇంకేమైనా మార్పులు ఉంటాయని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్​మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్/కుల్దీప్ యాదవ్.