Nidhan
రియల్ బజ్‌బాల్ అంటే ఏంటో ఇంగ్లండ్‌కు రుచి చూపిస్తోంది రోహిత్ సేన. ఈ లెక్కల్ని చూస్తే ఎవ్వరైనా సరే.. బజ్‌బాల్‌కు భారత్ సరికొత్త నిర్వచనం చెబుతోందని ఒప్పుకోక మానరు.
రియల్ బజ్‌బాల్ అంటే ఏంటో ఇంగ్లండ్‌కు రుచి చూపిస్తోంది రోహిత్ సేన. ఈ లెక్కల్ని చూస్తే ఎవ్వరైనా సరే.. బజ్‌బాల్‌కు భారత్ సరికొత్త నిర్వచనం చెబుతోందని ఒప్పుకోక మానరు.
Nidhan
బజ్‌బాల్ అంటూ క్రికెట్ దునియాను కొన్నాళ్లు భయపెట్టింది ఇంగ్లండ్. ఆ జట్టు, ఈ జట్టు.. ఆ దేశం, ఈ దేశం అనే తేడాల్లేకుండా ఆడిన ప్రతి చోటా విజయం సాధిస్తూ డామినేషన్ చూపించింది. టెస్టులను మూడ్నాలుగు రోజుల్లోనే ముగిస్తూ అందర్నీ వణికించింది. ధనాధన్ బ్యాటింగ్, భీకరమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను గడగడలాడించింది. ఇదే క్రమంలో భారత పర్యటనకు వచ్చి ఉప్పల్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లోనూ విక్టరీ కొట్టింది. విజయం సాధించిన ఉత్సాహమో లేదా తమకు సాటి ఎవరూ లేరనే పొగరో గానీ విర్రవీగింది ఇంగ్లీష్ టీమ్. కట్ చేస్తే మిగిలిన మూడు టెస్టుల్లోనూ రోహిత్ సేన చేతిలో ఘోర ఓటములు ఎదుర్కొంది. ఆఖరి టెస్టులోనూ ఓటమి ముంగిట ఉంది. ఆ జట్టుకు అసలైన బజ్‌బాల్ ఎలా ఉంటుందో టీమిండియా రుచి చూపిస్తోంది. దీనికి ఈ లెక్కలే సాక్ష్యం.
భారత్-ఇంగ్లండ్ సిరీస్‌లో ఇప్పటిదాకా 100 సిక్సులు నమోదయ్యాయి. ఇన్నేళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక సిరీస్‌లో ఇన్ని సిక్సులు ఎప్పుడూ నమోదు కాలేదు. ఆ లెక్కన ఈ సిరీస్ హిస్టరీలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ వంద సిక్సుల్లో భారత బ్యాటర్లు బాదినవి 72 ఉన్నాయి. అదే బజ్‌బాల్ అంటూ బడాయికి పోయిన ఇంగ్లండ్ ఆటగాళ్లు కొట్టినవి కేవలం 28 మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టే ఈ సిరీస్‌లో మన జట్టు బ్యాటర్ల డామినేషన్ ఏ లెవల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బజ్‌బాల్ అంటే చెలరేగి ఆడటం, ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడటమే కదా.. కానీ అందులో ఇంగ్లీష్ టీమ్ పూర్తిగా ఫెయిలైంది. అనవసర షాట్లకు పోయి వికెట్లు పారేసుకుంది. కానీ టీమిండియా ఆటగాళ్లు స్ట్రయిక్ రొటేషన్ చేస్తూనే అదను చూసి బిగ్ షాట్స్‌తో విరుచుకుపడ్డారు. వికెట్లు కాపాడుకుంటూనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
బజ్‌బాల్‌ను నమ్ముకున్న ఇంగ్లండ్ ఫెయిలైన చోట.. భారత్ మాత్రం సంయమనంతో ఆడుతూనే అవసరాన్ని బట్టి దూకుడు పెంచింది. అందుకే సిరీస్‌లో అత్యధిక సిక్సులు మన ఆటగాళ్ల బ్యాట్ల నుంచే వచ్చాయి. ఇండియన్ బ్యాటర్స్ బాదిన దాంట్లో కనీసం సగం సిక్సులు కూడా ఇంగ్లీష్ క్రికెటర్స్ బాదలేకపోయారు. దీన్ని బట్టి బజ్‌బాల్‌కు భారత్ కొత్త నిర్వచనం చెప్పిందని అనొచ్చు. టెస్టుల్లో సంప్రదాయక శైలిలో ఆడుతూనే అవసరాన్ని బట్టి అటాక్ చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని ప్రూవ్ చేసింది. ఓపికతో ఆడుతూనే సమయాన్ని బట్టి దూకుడు అనే ఆయుధాన్ని బయటకు తీయాలని నేర్పించింది. రియల్ బజ్‌బాల్ అంటే ఏంటో నిరూపించింది. మరి.. బజ్‌బాల్‌కు భారత్ కొత్త నిర్వచనం చెప్పడం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: దీని కంటే బెస్ట్ క్యాచ్ మీ లైఫ్‌లో చూసి ఉండరు!
100 sixes in the India Vs England Test series:
India – 72.
Bazball – 28. pic.twitter.com/u7kcpbe1FS— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2024