iDreamPost

వీడియో: దీని కంటే బెస్ట్‌ క్యాచ్‌ మీ లైఫ్‌లో చూసి ఉండరు!

  • Published Mar 09, 2024 | 11:05 AMUpdated Mar 09, 2024 | 11:05 AM

Glenn Phillips, Marnus Labuschagne: న్యూజిలాండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ సంచలన క్యాచ్‌ చోటు చేసుకుంది. ఆ క్యాచ్‌ చూస్తే.. వామ్మో ఇలా కూడా క్యాచ్‌లు పడతారా? అని ఆశ్చర్యపోక తప్పదు. ఆ సూపర్‌ క్యాచ్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Glenn Phillips, Marnus Labuschagne: న్యూజిలాండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ సంచలన క్యాచ్‌ చోటు చేసుకుంది. ఆ క్యాచ్‌ చూస్తే.. వామ్మో ఇలా కూడా క్యాచ్‌లు పడతారా? అని ఆశ్చర్యపోక తప్పదు. ఆ సూపర్‌ క్యాచ్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 09, 2024 | 11:05 AMUpdated Mar 09, 2024 | 11:05 AM
వీడియో: దీని కంటే బెస్ట్‌ క్యాచ్‌ మీ లైఫ్‌లో చూసి ఉండరు!

క్రికెట్‌లో కొన్ని క్యాచ్‌లు చూస్తే ఒళ్లు పులకరించిపోతుంది. ఏ జట్టు ఆటగాడైన సరే ఒక మంచి క్యాచ్‌ పట్టుకుంటే మెచ్చుకోకుండా ఉండలేం. కానీ, ఓ ప్లేయర్‌ ఉన్నాడు.. ఎలాంటి క్యాచ్‌నైనా చాలా అవలీలగా పట్టేయగలడు. చాలా మంది ఫీల్డర్లు ఎంత కష్టం అనుకున్న క్యాచ్‌లను కూడా గాల్లో పక్షిలా, జింకను వేటాడే పులిలా అమాంతం దూకేసి.. అలా ఒడిసిపట్టేస్తాడు. ఆ ఫీల్డర్‌ పేరు గ్లెన్‌ ఫిలిప్స్‌. న్యూజిలాండ్‌కు చెందిన ఈ ఆటగాడిని మోడ్రన్ జాంటీ రోడ్స్‌ అంటుంటారు. ఆ బిరుదును నిలబెట్టుకుంటూ.. మ్యాచ్‌ మ్యాచ్‌కి అద్భుత క్యాచ్‌లతో రెచ్చిపోతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పట్టిన ఓ క్యాచ్‌ అయితే న భుతో న భవిష్యత్త్‌ అన్న రీతిలో ఉంది.

క్రిస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్‌ మొదటి ఇన్నింగ్స్‌ సందర్భంగా ఈ అద్భుతమైన క్యాచ్‌ చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టిమ్‌ సౌథీ వేసిన ఇన్నింగ్స్‌ 61వ ఓవర్‌ రెండో బంతికి ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్ మార్నస్‌ లబుషేన్‌ పాయింట్‌ దిశగా కట్‌ షాట్‌ ఆడాడు. ఆ షాట్‌తో బుల్లెట్‌లా దూసుకెళ్లున్న బంతిని తన కుడివైపునకు అమాంతం గాల్లోకి దూకి ఆ బాల్‌ను ఒడిసి పట్టుకున్నాడు. అంతే బ్యాటర్‌తో పాటు ఆటగాళ్లంతా షాక్‌ అయ్యారు. వామ్మో.. క్యాచ్‌ను ఇలా కూడా పట్టొచ్చా? అన్నట్లు కళ్లప్పగించి చూశారు. అయితే.. ఇలాంటి క్యాచ్‌లు పట్టడం గ్లెన్‌కు కొత్తేమీ కాదు. గతంలో కూడా నమ్మశక్యం కానీ క్యాచ్‌లు కూడా చాలానే అందుకున్నాడు. అతను పట్టిన బెస్ట్‌ క్యాచ్‌లలో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ 162 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ 38 పరుగులతో కివీస్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో హెజల్‌వుడ్‌ 5, స్టార్క్‌ 3 వికెట్లతో సత్తా చాటారు. ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులకు ఆలౌట్‌ అయింది. మార్నస్‌ లబుషేన్‌ 90 పరుగులతో రాణించాడు. సెంచరీకి కొద్ది దూరంలో గ్లెన్‌ ఫిలిప్స్‌ సూపర్‌ క్యాచ్‌తో వెనుదిరిగాడు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ ఒక్కడే 7 వికెట్లు సాధించి అదరగొట్టాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడుతోంది. ఆట రెండో రోజు మూడో సెషన్‌ వరకు 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. టామ్‌ లాథమ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజ్‌లో ఉన్నాడు. అతనితో పాటు రచిన్‌ రవీంద్ర్‌ కూడా క్రీజ్‌లో ఉన్నాడు. కేన్‌ విలియమ్సన్‌ 51 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. మరి ఈ మ్యాచ్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ పట్టిన క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి