iDreamPost
android-app
ios-app

IND vs ENG: వీడియో: ఇంగ్లండ్ కాచుకో.. బజ్​బాల్​ బెండు తీసేటోడు వస్తున్నాడు!

  • Published Feb 11, 2024 | 5:23 PM Updated Updated Feb 11, 2024 | 5:23 PM

బజ్​బాల్ బెండు తీసేటోడు దిగుతున్నాడు. ఇక, మూడో టెస్టులో ఇంగ్లండ్​కు చుక్కలే. ఆ టీమ్ అతడి ధాటిని తట్టుకోవడం కష్టమే.

బజ్​బాల్ బెండు తీసేటోడు దిగుతున్నాడు. ఇక, మూడో టెస్టులో ఇంగ్లండ్​కు చుక్కలే. ఆ టీమ్ అతడి ధాటిని తట్టుకోవడం కష్టమే.

  • Published Feb 11, 2024 | 5:23 PMUpdated Feb 11, 2024 | 5:23 PM
IND vs ENG: వీడియో: ఇంగ్లండ్ కాచుకో.. బజ్​బాల్​ బెండు తీసేటోడు వస్తున్నాడు!

భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ జట్టుతో రోహిత్ సేన చెడుగుడు ఆడుకుంటోంది. మొదటి టెస్టులో తృటిలో ఓడిన టీమిండియా.. రెండో మ్యాచులో మాత్రం 106 పరుగుల తేడాతో నెగ్గింది. గెలుపోటముల సంగతి పక్కనబెడితే.. ఈ రెండు మ్యాచుల్లోనూ చాలా సెషన్స్​లో భారత్ డామినేషన్ నడిచింది. బజ్​బాల్ క్రికెట్​తో మన జట్టును మట్టికరిపిస్తామంటూ సవాళ్లు విసిరిన ఇంగ్లీష్ టీమ్​కు భారత ప్లేయర్లు చుక్కలు చూపిస్తున్నారు. బ్యాటింగ్​లో యంగ్​స్టర్స్ యశస్వి జైస్వాల్, శుబ్​మన్ గిల్ చెలరేగుతున్నారు. బౌలింగ్​లో పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ అదరగొడుతున్నారు. వీళ్ల ధాటికి ఇంగ్లండ్ చతికిలబడుతోంది. ఇలాంటి టైమ్​లో అపోజిషన్ టీమ్ కష్టాలను మరింత పెంచేందుకు సిసలైనోడు దిగుతున్నాడు.

రాజ్​కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో ఆడేందుకు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రెడీ అవుతున్నాడు. గాయం కారణంగా వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడీ స్టైలిష్ బ్యాటర్. అతడితో పాటు స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా కూడా సెకండ్ టెస్ట్​కు దూరమయ్యాడు. అయితే గాయాలతో బాధపడుతున్న వీళ్లిద్దరూ బెంగళూరులోని ఎన్​సీఏలో ఉంటూ కోలుకున్నారు. దీంతో మిగిలిన మూడు టెస్టులకు ప్రకటించిన జట్టులో వీళ్లిద్దరికీ చోటు కల్పించారు సెలక్టర్లు. కానీ ఫిట్​నెస్​ను బట్టే వీళ్లను తుదిజట్టులోకి తీసుకుంటామని టీమ్ మేనేజ్​మెంట్ చెప్పింది. ఈ నేపథ్యంలో తాను పూర్తిగా కోలుకున్నట్లు హింట్ ఇచ్చాడు రాహుల్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను అతడు పోస్ట్ చేశాడు.

నెట్టింట పోస్ట్ చేసిన వీడియోలో నెట్స్​లో జోరుగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు రాహుల్. అవతలి వైపు నుంచి బౌలర్స్ బాల్స్ వేస్తుండగా అతడు షాట్స్ కొడుతూ దర్శనమిచ్చాడు. కేఎల్ ప్రాక్టీస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన అభిమానులు.. అతడు పూర్తిగా ఫిట్​గా ఉన్నాడని అంటున్నారు. ఈ వీడియోనే దీనికి సాక్ష్యమని.. రాజ్​కోట్ టెస్టులో రాహుల్ బరిలోకి దిగడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. ఇంగ్లండ్ కాచుకో.. బజ్​బాల్ బెండు తీసేందుకు మొనగాడు సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. గత ఏడాదిగా సూపర్ ఫామ్​లో ఉన్న రాహుల్.. దాన్నే కొనసాగిస్తే ఇంగ్లండ్​ బిత్తరపోవడం ఖాయమని అంటున్నారు. కేఎల్​తో పాటు జడేజా కూడా కమ్​బ్యాక్ ఇస్తే అటు బ్యాటింగ్​తో పాటు ఇటు టీమ్ బౌలింగ్ యూనిట్ కూడా బలపడుతుంది. మరి.. రాహుల్ రీఎంట్రీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: మూడో టెస్టుకు ముందు ఇంగ్లండ్​కు భారీ షాక్.. ఇక ఆశలు వదులుకోవాల్సిందే!