Nidhan
టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ మరోమారు అభిమానుల్ని నిరాశపర్చాడు. అతడు ఔటైన తీరుపై భారీగా విమర్శలు వస్తున్నాయి.
టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ మరోమారు అభిమానుల్ని నిరాశపర్చాడు. అతడు ఔటైన తీరుపై భారీగా విమర్శలు వస్తున్నాయి.
Nidhan
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌కు సరైన స్టార్ట్ దొరకలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆరంభంలోనే మన టీమ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10) త్వరగా పెవిలియన్ చేరాడు. మార్క్ వుడ్ గుడ్ లెంగ్త్‌లో వేసిన బాల్ పడి అనూహ్యంగా బౌన్స్ అయింది. దీంతో దాన్ని అతడు సరిగ్గా డిఫెండ్ చేయలేకపోయాడు. బాల్ అతడి బ్యాట్ ఎడ్జ్‌ను తీసుకొని స్లిప్‌లోకి దూసుకెళ్లింది. దాన్ని జో రూట్ చక్కగా అందుకున్నాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ (0) మరోసారి నిరాశపర్చాడు. అతడు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్‌ను కూడా వుడ్ ఔట్ చేశాడు. అయితే అతడు ఔట్ అయిన తీరుపై భారీగా విమర్శలు వస్తున్నాయి.
గిల్ ఈ సిరీస్‌లోని తొలి రెండు టెస్టుల్లోనూ ఇలాగే ఔట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్‌ను టార్గెట్ చేసుకొని వుడ్ గుడ్ లెంగ్త్‌లో వేసిన బాల్‌ను డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు గిల్. ఆ బాల్ అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ బెన్ ఫోక్స్ చేతుల్లోకి వెళ్లింది. ఫోక్స్ క్యాచ్ పట్టుకోవడంతో గిల్ నిరాశగా క్రీజును వీడాడు. అయితే గిల్ ఇలా ఆఫ్ స్టంప్ లైన్లో పడిన బంతుల్ని డిఫెండ్ చేయబోయి ఔటవడం ఇదే తొలిసారి కాదు. ఆ బంతుల్ని ఎదుర్కొనే వీక్నెస్ చాలా రోజుల నుంచి ఉంది. టెస్టులతో పాటు వన్డేలు, టీ20ల్లోనూ ఇదే బలహీనతతో చాలా సార్లు ఔటయ్యాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోని తొలి రెండు టెస్టుల్లో కూడా ఇదే విధంగా ఔటయ్యాడు.
ఆఫ్ స్టంప్ లైన్లో పడి ఔట్ స్వింగ్ అయ్యే డెలివరీస్‌ను ఆడటంలో గిల్‌కు ఉన్న వీక్నెస్ను ఇంగ్లండ్ పేసర్లు టార్గెట్ చేస్తున్నారు. జేమ్స్ అండర్సన్ దీన్ని ఉపయోగించుకొని వైజాగ్ టెస్టులో అతడ్ని దెబ్బ కొట్టాడు. మూడో టెస్టులో మార్క్ వుడ్ దీన్ని యూజ్ చేసుకున్నాడు. క్వాలిటీ పేస్‌తో ఆఫ్ స్టంప్ ఆవల బాల్ వేసి గిల్‌ను తన వలలో చిక్కుకునేలా చేశాడు. దీంతో శుబ్‌మన్‌ను సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఒకే విధంగా ఇంకెన్ని సార్లు ఔట్ అవుతావని.. ఇన్నాళ్ల నుంచి ఆడుతున్నా తన బలహీనతను సరిదిద్దుకోకపోవడం ఏంటంటూ సీరియస్ అవుతున్నారు. ఇలాగైతే జట్టులో చోటు కష్టమేనని.. అతడి ప్లేసులో మరో యంగ్‌స్టర్‌కు ఛాన్స్ ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ని అవకాశాలు ఇచ్చినా గిల్ తన గేమ్‌ను ఇంప్రూవ్ చేసుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. మరి.. శుబ్‌మన్ గిల్ మళ్లీ అలాగే ఔట్ అవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Sarfaraz Khan: సర్ఫరాజ్ డెబ్యూతో తండ్రి ఎమోషనల్.. సంతోషంతో కన్నీళ్లు ఆపుకోలేక..!
Even if you are an Indian fan you need to appreciate Mark Wood’s fiery Spell 🔥
Shubman Gill and Jaiswal have no answer against him. Brilliant Morning for England…!!#INDvENGpic.twitter.com/u4iFXA3QQ9
— Sujeet Suman (@sujeetsuman1991) February 15, 2024