Nidhan
టీమిండియాలో చోటు కోసం సర్ఫరాజ్ ఖాన్ చేయని ప్రయత్నం లేదు. ఐపీఎల్‌తో పాటు డొమెస్టిక్ క్రికెట్లోనూ దుమ్మురేపాడు. అయినా చోటు దక్కలేదు. ఎట్టకేలకు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సెలక్టర్ల నుంచి అతడికి పిలుపు వచ్చింది.
టీమిండియాలో చోటు కోసం సర్ఫరాజ్ ఖాన్ చేయని ప్రయత్నం లేదు. ఐపీఎల్‌తో పాటు డొమెస్టిక్ క్రికెట్లోనూ దుమ్మురేపాడు. అయినా చోటు దక్కలేదు. ఎట్టకేలకు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సెలక్టర్ల నుంచి అతడికి పిలుపు వచ్చింది.
Nidhan
క్రికెట్‌ను ఓ మతంలా భావించే భారత్‌లో జాతీయ జట్టుకు ఆడాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ డ్రీమ్‌ను నిజం చేసుకునేందుకు వేలాది మంది క్రికెటర్లు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే వారిలో ఏ కొందరికో మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది. కొందరికి ఆ ఛాన్స్ త్వరగానే వస్తే.. మరికొందరి విషయంలో మాత్రం ఏళ్లకు ఏళ్లు గడిచిపోతాయి. ఈ కోవలోకే వస్తాడు యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్. దాదాపుగా పదేళ్లుగా భారత జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడీ స్టైలిష్ బ్యాటర్. ఐపీఎల్‌తో పాటు డొమెస్టిక్ క్రికెట్లోనూ తానేంటో చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. సెంచరీలు మీద సెంచరీలతో పాటు డబుల్, ట్రిపుల్ సెంచరీ బాదినా సెలక్టర్లు మాత్రం కరుణించలేదు. అధిక బరువు, ఫిట్నెస్ ఇష్యూస్ వల్ల అతడికి మొండిచేయి చూపారని వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు సర్ఫరాజ్‌కు పిలుపు వచ్చింది. దీంతో అతడి తండ్రి నౌషద్ ఖాన్ పట్టరాని సంతోషంలో ఉన్నాడు.
రెండో టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. అతడ్ని వెంటనే టీమ్‌తో జాయిన్ అవ్వాలని ఆదేశించారు. రాక రాక ఇన్నాళ్లకు తమ కల నెరవేరడంతో సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కొడుకు భారత్‌కు ఆడాలని తాను కన్న కల నిజం కావడంతో ఆయన ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఆయన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి థ్యాంక్స్ చెప్పారు. తన కొడుకు మీద నమ్మకం ఉంచినందుకు బోర్డుకు రుణపడి ఉంటామన్నారు. సర్ఫరాజ్ జర్నీ గురించి మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ‘సర్ఫరాజ్ టెస్ట్ టీమ్‌కు సెలక్ట్ అయ్యాడు. దీనికి ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీకి కృతజ్ఞతలు చెప్పాలి. అతడు ఈ స్థాయికి చేరుకోవడంలో వాళ్ల కృషి ఎంతో ఉంది. మా మీద నమ్మకం ఉంచినందుకు బీసీసీఐకి, సెలక్టర్లకు థ్యాంక్స్. సర్ఫరాజ్ కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. అతడు భారత జట్టు తరఫున అద్భుతంగా ఆడాలని, టీమ్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నా’ అని నౌషద్ ఖాన్ చెప్పుకొచ్చారు.
కాగా, ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరమయ్యారు. ఇంజ్యురీల కారణంగా వీళ్లిద్దరూ ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. వీళ్ల స్థానాల్లో సర్ఫరాజ్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్‌ను బోర్డు సెలక్ట్ చేసింది. వైజాగ్ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు మొదలవనుంది. ఇక, ఉప్పల్ టెస్టులో రన్నింగ్ చేస్తుండగా జడేజాకు మడమ కండరం పట్టేసింది. రాహుల్‌కు తొడ కండరం నొప్పి రావడంతో రెస్ట్ కావాలని అతడు బోర్డును కోరాడు. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ.. తమ వైద్యబృందం ఎప్పటికప్పుడు వాళ్లిద్దర్నీ పర్యవేక్షిస్తోందని తెలిపింది. వాళ్ల స్థానంలో సెలక్షన్ కమిటీ ముగ్గురు ఆటగాళ్లను సెలక్ట్ చేసిందని పేర్కొంది. కేఎల్, జడ్డూకు రీప్లేస్‌మెంట్‌గా సర్ఫరాజ్, సౌరభ్, సుందర్‌ను టీమ్‌లోకి తీసుకున్నామని వెల్లడించింది. మరి.. సర్ఫరాజ్ టెస్టు ఎంట్రీ కోసం మీరెంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sarfaraz Khan’s father thanking the BCCI for trusting him.
– What a lovely day for Sarfaraz and his family. pic.twitter.com/axYRTcaEEU
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 29, 2024