ఆ ఫార్మాట్​కు సర్ఫరాజ్ పనికిరాడు.. టీమిండియా మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్!

టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్​ తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. డొమెస్టిక్​ క్రికెట్​లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్.. ఇంటర్నేషనల్ క్రికెట్​లోనూ దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు.

టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్​ తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. డొమెస్టిక్​ క్రికెట్​లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్.. ఇంటర్నేషనల్ క్రికెట్​లోనూ దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు.

కష్టం ఎప్పటికీ వృథా కాదంటారు పెద్దలు. కష్టపడినోడు ఎప్పటికైనా పైకి వస్తాడని చెబుతుంటారు. కష్టాన్ని నమ్ముకుంటే ఎదగడం ఈజీ అంటుంటారు. ఇదే సూత్రాన్ని నమ్ముకొని టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్ ఖాన్. డొమెస్టిక్ క్రికెట్​లో సెంచరీల మీద సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదినా అతడికి సెలక్టర్లు తొలుత ఛాన్స్ ఇవ్వలేదు. అధిక బరువుతో పాటు పలు ఇతర కారణాలు చూపుతూ ఈ యంగ్ బ్యాటర్​ను సెలక్ట్ చేయలేదు. కానీ సర్ఫరాజ్ మాత్రం ఆగిపోలేదు. మరింత కసితో ఆడుతూ పరుగుల వరద పారించాడు. దీంతో ఎట్టకేలకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. దాన్ని ఒడిసిపట్టుకొని తన టాలెంట్​ ఏంటో అందరికీ చూపించాడు. ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​లో డెబ్యూ ఇచ్చి పలు మెరుపు ఇన్నింగ్స్​లతో ఫ్యూచర్​ స్టార్​ను తానేనని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే సర్ఫరాజ్‌ మీద టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

సర్ఫరాజ్ టీ20 ఫార్మాట్​కు పనికిరాడని అన్నాడు గంగూలీ. అతడు టెస్టులకు బాగా సరిపోతాడని చెప్పాడు. లాంగ్ ఫార్మాట్​లో సర్ఫరాజ్​కు మరిన్ని ఛాన్సులు ఇవ్వాలని సూచించాడు. ‘సర్ఫరాజ్ టెస్టులకు బాగా సరిపోతాడు. 5 రోజుల ఆటకు అతడి బ్యాటింగ్ స్టైల్ పర్ఫెక్ట్​గా సెట్ అవుతుంది. టీ20లు అనేది డిఫరెంట్ ఫార్మాట్. డొమెస్టిక్ క్రికెట్​లో కూడా అతడు లాంగ్ ఫార్మాట్​లోనే ఎక్కువ రన్స్ చేశాడు. రంజీ ట్రోఫీతో పాటు ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో సర్ఫరాజ్ అద్భుతంగా ఆడాడు. మనం పడిన కష్టం, శ్రమ వృథా పోదు అంటారు. సర్ఫరాజ్ విషయంలో అది మరోమారు నిరూపితమైంది. దేశవాళీల్లో బాదిన శతకాలు, చేసిన పరుగులు అతడ్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాయి’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. సర్ఫరాజ్​పై దాదా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. దాదా చెప్పింది కరెక్ట్​ అని.. టెస్టుల్లో సుదీర్ఘ కాలం రాణించే సత్తా సర్ఫరాజ్​కు ఉందని అంటున్నారు.

సర్ఫరాజ్ టెస్టులకు బాగా సూట్ అవుతాడని నెటిజన్స్ చెబుతున్నారు. అయితే అతడికి వన్డేలు, టీ20ల్లో కూడా ఛాన్స్ ఇచ్చి చూడాలని కామెంట్స్ చేస్తున్నారు. టెస్టు స్పెషలిస్ట్​లుగా ముద్రపడిన లెజెండరీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత కాలంలో లిమిటెడ్ ఓవర్స్​ క్రికెట్​లోనూ రాణించారని గుర్తుచేస్తున్నారు. సర్ఫరాజ్​ అటాకింగ్ బ్యాటర్ అని.. అదే దూకుడును ఇతర ఫార్మాట్లకు తగ్గట్లుగా అడాప్ట్ చేసుకుంటే ఆపడం ఎవరి తరం కాదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇంగ్లండ్​తో రాజ్​కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టుతో ఇంటర్నేషనల్ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్. ఆ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో 62 పరుగులు చేసిన యంగ్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్​లో 68 పరుగులు చేశాడు. అయితే నాలుగో టెస్టులో మాత్రం 14, 0 పరుగులు చేసి నిరాశపర్చాడు. దీంతో ఆఖరి టెస్టులో పంజా విసరాలని చూస్తున్నాడు. మరి.. సర్ఫరాజ్​పై దాదా చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అంబానీ ఇంటికి క్రికెటర్లు! ధోని ఎంట్రీ మామూలుగా లేదుగా..

Show comments