Nidhan
ఎన్నాళ్లుగానో ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్ డ్రీమ్ ఎట్టకేలకు తీరింది. డొమెస్టిక్ క్రికెట్లో దుమ్మురేపుతున్న ఈ యంగ్ బ్యాటర్‌కు గోల్డెన్ ఛాన్స్ దక్కింది.
ఎన్నాళ్లుగానో ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్ డ్రీమ్ ఎట్టకేలకు తీరింది. డొమెస్టిక్ క్రికెట్లో దుమ్మురేపుతున్న ఈ యంగ్ బ్యాటర్‌కు గోల్డెన్ ఛాన్స్ దక్కింది.
Nidhan
ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓటమితో టీమిండియా డీలా పడింది. ఈజీగా నెగ్గుతారనుకుంటే మ్యాచ్‌ను అప్పనంగా ఇంగ్లీష్ టీమ్ చేతుల్లో పెట్టారంటూ భారత ప్లేయర్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. మొదిటి రెండ్రోజులు మ్యాచ్ మీద పట్టు సాధించి ఆ తర్వాత అనూహ్యంగా వదిలేయడం, ప్రత్యర్థి కౌంటర్ అటాక్‌కు తలొగ్గడంతో అభిమానులు కూడా సీరియస్ అవుతున్నారు. ఇదేం ఆటతీరు.. అపోజిషన్ టీమ్‌కు తగ్గట్లు అటాకింగ్ మోడ్‌లో ఆడకుండా అటు బౌలింగ్, ఫీల్డింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ డిఫెన్సివ్ అప్రోచ్‌తో ఓటమిని మూటగట్టుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో రెండో టెస్టులో భారత్ ఎలా ఆడుతుందోననేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో టీమిండియాకు షాక్ తగిలింది. రెండో మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు.
జడేజా, రాహుల్ రెండో టెస్టులో ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. వారి ప్లేసులో ముగ్గురు యంగ్‌స్టర్స్‌ను టీమ్‌లోకి తీసుకుంది. డొమెస్టిక్ క్రికెట్లో బ్యాట్‌తో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు సౌరభ్ కుమార్, స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నామని బీసీసీఐ వెల్లడించింది. ఇది సర్ఫరాజ్‌కు సూపర్బ్ న్యూస్ అనే చెప్పాలి. దేశవాళ్లీల్లో ఎంత అద్భుతంగా ఆడుతున్నా ప్లేస్ దక్కకపోవడం.. ఒక్క అవకాశం ఇస్తే సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్న అతడికి ఇది బంపరాఫర్. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న జడ్డూ, రాహుల్ మిస్సవడం బాధాకరమని.. అయితే సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాడికి అవకాశం దక్కడం గొప్ప విషయమని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రెండో టెస్టులో సర్ఫరాజ్ ఎంట్రీ ఇవ్వనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jadeja and KL Rahul ruled out of the 2nd Test.
Sarfaraz Khan, Sourabh Kumar and Washington Sundar added to the squad. pic.twitter.com/kT13aXJ2nS
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 29, 2024