iDreamPost
android-app
ios-app

Sarfaraz Khan: సర్ఫరాజ్​ డెబ్యూతో తండ్రి ఎమోషనల్.. సంతోషంతో కన్నీళ్లు ఆపుకోలేక..!

  • Published Feb 15, 2024 | 10:09 AM Updated Updated Feb 15, 2024 | 8:19 PM

డొమెస్టిక్ క్రికెట్​లో దుమ్మురేపిన సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నాడు. భారత్ తరఫున ఆడాలనే సర్ఫరాజ్ డ్రీమ్ నిజమవడంతో అతడి తండ్రి ఎమోషనల్ అయ్యాడు.

డొమెస్టిక్ క్రికెట్​లో దుమ్మురేపిన సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నాడు. భారత్ తరఫున ఆడాలనే సర్ఫరాజ్ డ్రీమ్ నిజమవడంతో అతడి తండ్రి ఎమోషనల్ అయ్యాడు.

  • Published Feb 15, 2024 | 10:09 AMUpdated Feb 15, 2024 | 8:19 PM
Sarfaraz Khan: సర్ఫరాజ్​ డెబ్యూతో తండ్రి ఎమోషనల్.. సంతోషంతో కన్నీళ్లు ఆపుకోలేక..!

పిల్లల సక్సెస్ కంటే తల్లిదండ్రులకు కావాల్సింది ఇంకా ఏమీ ఉండదు. ఎన్నో ఏళ్లు కష్టపడ్డాక వాళ్లు అనుకున్నది సాధిస్తే పేరెంట్స్ సంతోషంలో మునిగిపోతారు. తమ పిల్లల విజయాన్ని చూసి ఫుల్ ఎమోషనల్ అయిపోతారు. యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి తాజాగా దీన్ని ఎక్స్​పీరియెన్స్ చేశారు. రాజ్​కోట్ వేదికగా ఇంగ్లండ్​తో జరుగుతున్న మూడో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్​కు ప్రకటించిన భారత తుదిజట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​లో అతడికి ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. డొమెస్టిక్ క్రికెట్​లో గత కొన్నేళ్లుగా ఇరగదీస్తున్న సర్ఫరాజ్ ఎట్టకేలకు డెబ్యూ ఇవ్వడంతో అతడి తండ్రి ఆనందాన్ని పట్టలేక ఎమోషనల్ అయిపోయాడు.

టాస్​కు ముందు స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే సర్ఫరాజ్​కు టెస్ట్ క్యాప్ ఇచ్చి భారత జట్టులోకి ఆహ్వానించాడు. దీంతో టీమ్​మేట్స్ అందరూ అతడ్ని మెచ్చుకున్నారు. ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ చెప్పారు. ఆ తర్వాత అతడు తన తండ్రి దగ్గరకు వెళ్లాడు. సర్ఫరాజ్​ ఆ క్యాప్​ను తన తండ్రికి ఇవ్వగానే.. ఆయన దాన్ని చూసి ఏడ్చేశారు. కొడుకును గట్టిగా కౌగిలించుకున్నారు. సర్ఫరాజ్ భార్య కూడా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో యంగ్ బ్యాటర్ ఆమె కన్నీళ్లు తుడిచాడు. అనంతరం సర్ఫరాజ్ ఫ్యామిలీతో కలసి పలు ఫొటోలు దిగాడు. ఇక, ఈ మ్యాచ్​లో సర్ఫరాజ్​తో పాటు మరో కొత్త కుర్రాడు ధృవ్ జురెల్ కూడా అరంగేట్రం చేశాడు.

రాజ్​కోట్ టెస్టులో కేఎస్ భరత్ ప్లేసులో జురెల్, శ్రేయస్ అయ్యర్ స్థానంలో సర్ఫరాజ్ టీమ్​లోకి వచ్చారు. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమ్​లో ఇంకా రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. స్పిన్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా జట్టులోకి వచ్చాడు. గత టెస్టులో ఆడిన పేసర్ ముకేష్ కుమార్ ప్లేసులో ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఎంట్రీ ఇచ్చాడు. బ్యాటింగ్​కు స్వర్గధామంగా చెప్పుకునే రాజ్​కోట్ టెస్టులో భారీ స్కోరు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. ఇంటర్నేషనల్ క్రికెట్​లో సర్ఫరాజ్ ఖాన్ డెబ్యూపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: మూడో టెస్టులో బ్రేక్ అయ్యే రికార్డులు ఇవే.. క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోతాయి!