iDreamPost

IND vs ENG: మూడో టెస్టులో బ్రేక్ అయ్యే రికార్డులు ఇవే.. క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోతాయి!

  • Published Feb 15, 2024 | 7:58 AMUpdated Feb 15, 2024 | 7:58 AM

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాజ్​కోట్ వేదికగా ఇవాళ మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్​లో ఎన్నో రికార్డులు బ్రేక్ కానున్నాయి.

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాజ్​కోట్ వేదికగా ఇవాళ మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్​లో ఎన్నో రికార్డులు బ్రేక్ కానున్నాయి.

  • Published Feb 15, 2024 | 7:58 AMUpdated Feb 15, 2024 | 7:58 AM
IND vs ENG: మూడో టెస్టులో బ్రేక్ అయ్యే రికార్డులు ఇవే.. క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోతాయి!

భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టుకు సర్వం సిద్ధమైంది. రాజ్​కోట్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్​ గురువారం ప్రారంభం కానుంది. వైజాగ్ టెస్టు తర్వాత దొరికిన గ్యాప్​ను రెండు జట్లు వాడుకున్నాయి. భారత క్రికెటర్లు తమ ఇళ్లకు వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. ఇంగ్లీష్ ప్లేయర్లు అబుదాబికి వెళ్లి తమ కుటుంబ సభ్యులతో గడుపుతూ సేదతీరారు. అయితే రాజ్​కోట్​ టెస్టుకు సమయం దగ్గర పడటంతో రెండ్రోజుల ముందే ఇక్కడికి వచ్చేశారు. ఇరు టీమ్స్ జోరుగా ప్రాక్టీస్ చేశాయి. సిరీస్​లో ఈ మ్యాచ్ నెగ్గడం కీలకంగా మారడంతో రెండ్రోజుల పాటు సాధనలో మునిగితేలాయి. ఇప్పటికే ఈ మ్యాచ్​లో బరిలోకి దిగే తమ తుదిజట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. స్పిన్నర్ బషీర్ ప్లేసులో పేసర్ మార్క్ వుడ్ టీమ్​లోకి వచ్చాడు. భారత ప్లేయింగ్ ఎలెవన్ ఏంటనేది టాస్​ టైమ్​లో తేలనుంది. అయితే ఈ మ్యాచ్​లో ఎన్నో రికార్డులు బ్రేక్ కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

రాజ్​కోట్ టెస్టులో చాలా పాత రికార్డులు బద్దలవడానికి ఎదురు చూస్తున్నాయి. భారత జట్టు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​తో పాటు ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్​కు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకం కానుంది. ఎందుకంటే వాళ్లిద్దరూ అరుదైన రికార్డులకు చేరువలో ఉన్నారు. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్​లో చేరేందుకు అశ్విన్ ఇంకో వికెట్ తీస్తే చాలు. మొదటి ఇన్నింగ్స్​లోనే అతడు ఈ ఘనత అందుకోవడం ఖాయం. ఇక, అండర్సన్ మరో 5 వికెట్లు పడగొడితే 700 వికెట్ల క్లబ్​లో జాయిన్ అవుతాడు. తద్వారా ఈ క్లబ్​లో జాయిన్ అయిన మూడో బౌలర్​గా రికార్డు సాధించే అవకాశం ఉంది.

These are the records that will be broken in the third Test

క్రికెట్​లో ఇప్పటిదాకా ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) మాత్రమే ఈ ఘనత సాధించారు. కాగా, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్​ స్టోక్స్​కు మూడో టెస్టు ఎంతో ప్రతిష్టాత్మకం కానుంది. టెస్టుల్లో ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. ఒకవేళ లాంగ్ ఫార్మాట్​లో ఆడే ఛాన్స్ వస్తే వంద టెస్టులు పూర్తి చేయాలనేది మరో డ్రీమ్. అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఆ ఫీట్​ను నమోదు చేస్తారు. రాజ్​కోట్​ టెస్టుతో ఆ క్లబ్​లో జాయిన్ అవనున్నాడు స్టోక్స్. ఇది అతడి కెరీర్​లో 100వ టెస్టు కానుంది. దీంతో ఈ మ్యాచ్​లో విజయం సాధించి చిరస్మరణీయం చేసుకోవాలని అతడు భావిస్తున్నాడు. ఇక, ఈ మ్యాచ్​లో భారత జట్టులో అనూహ్య మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

వికెట్ కీపర్ కేఎస్ భరత్ ప్లేసులో కొత్త కుర్రాడు ధృవ్ జురెల్, శ్రేయస్ అయ్యర్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ లేదా దేవ్​దత్ పడిక్కల్ ఎంట్రీ ఇవ్వడం పక్కా అని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే టీమిండియా తరఫున మరో ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేసినట్లు అవుతుంది. ఇలా చాలా మంది ప్లేయర్లకు ఈ మ్యాచ్​ మెమరబుల్​గా నిలిచిపోయే ఛాన్స్ ఉంది. ఈ రికార్డులతో పాటు మ్యాచ్​లో ప్లేయర్లు తమ ఆటతీరుతో ఇంకా సరికొత్త రికార్డులను సృష్టించే ఛాన్స్ కూడా ఉంది. మరి.. భారత్-ఇంగ్లండ్ టెస్టులో అశ్విన్, అండర్సన్ రేర్ ఫీట్స్ నమోదు చేస్తారని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచేది టీమిండియానే.. జై షా ఆసక్తికర వ్యాఖ్యలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి